కలగలిసి..

                                                                      నేను నిద్రను అయితే నీవొక కలవి
రెండూ కలగలిపితేనే కమ్మని రేయి..
ఈ నివేదన నిజం కావాలనుకుంటాను!

నేను భువిని కాను నీవు కాకు దివివి
రెండూ ఎప్పటికీ ఏకము కానేకావు..
అలాంటి అపూర్వ ఊహాలోకం వద్దంటాను!   

నేను నీరైతే నీవు తీపి పానీయానివి
రెండూ కలిపి సేవిస్తేనే దాహం తీరేను..
ఇలా కలిసి కరిగిపోవాలని కోరుకుంటాను!

నేను భాషని నీవు అందమైన భావానివి
రెండూ కలిసి ఏర్పడేనొక ప్రేమకావ్యం..
రసరమ్య మధురకావ్యం అవుదామంటాను!

నేను ఆలోచనలైతే నువ్వు ఆచరణవి
రెండూ ఏకమై అంచెలంచెలుగా ఎదిగి..
వేర్లు నీవై వృక్షం నేనై నీడనివ్వాలంటాను!
  

33 comments:

  1. lovely expressions in picture & post too..kudos

    ReplyDelete
  2. కలగలసి కాపురం చెయ్యాలనా లేక కాలక్షేపమా చెప్పలేదు అర్పితగారు.

    ReplyDelete
  3. ఓ సజీవ శిల్పకళా భావసౌందర్యం పెల్లుబికినట్లుంది. చెట్టుకూ మనసుకూ ఓ ఇల్లుంది దానికి ఓ తత్వం వుందని చాటిన మెండైన భావాలు. చిత్రం మరిన్ని భావాలని ప్రస్పుటం చేస్తుంది

    ReplyDelete
  4. మసక నీడల గుట్టు విప్పి
    నక్కిన భావాలని వెలికి తీసి
    తెలీని ఉద్విగ్నతని తెలిపి
    చీకటిలో చేలాంచలంగా ఎదిగి
    ఏళ్ళతరబడి అక్షరసేద్యం చేసి
    భావ పరిమళాల గుప్పు...

    ReplyDelete
  5. Very nice expression.

    ReplyDelete
  6. వేరు+వృక్షం what a combination.

    ReplyDelete
  7. కస్సుమంది పిడిబాకు మనస్సులోకి తూటాలకి బదులు.

    ReplyDelete
  8. మీ కవితలకు ప్రతిబింబం..ఈ కవిత

    ReplyDelete
  9. ఇంకా నయం నీరు నిప్పు అనలేదు
    ఏమిటో ఈ కలయికలు విడిపోవడాలు.

    ReplyDelete
  10. మీ నివేదన బాగుంది.

    ReplyDelete
  11. నేను నీరైతే నీవు పానీయానివి..కొంగ్రొత్త ప్రయోగం

    ReplyDelete
  12. Kalavalani korika unthe needa(Shadow)ni thodu ga undochu. Kaali cheppu(Slipper) la chustunnaru chustunte em chestam.

    ReplyDelete
  13. కలగలిసిన వేళ ఇరుహృదయాలు పులకరించి పరవశించునేమో

    ReplyDelete
  14. Nice padmarpita.
    హృదయాలు రెండూ కలిసి సంతోషలో ఉన్నప్పుడు భూమి కూడా స్వర్గమే లేనినాడు జ్ఞాపకాలు తోడు.
    ఆపైన కాస్లము తీర్పు చెబుతుంది.

    ReplyDelete
  15. Nice lines with compromising words.

    ReplyDelete
  16. నేను భాషని
    నీవు అందమైన భావానివి
    అందమైన మీ అక్షరాలు

    ReplyDelete
  17. picture dominating the poem.

    ReplyDelete

  18. నేను బ్లాగయితే నీవు కామింటువి
    రెండూ కలిస్తే యేర్పడేనొక ఉఝాలా :)



    జిలేబి

    ReplyDelete
  19. ఒకరికొకరు మమైకం అయిపోయారు ప్రేమలో

    ReplyDelete
  20. నేను ఆలోచనలైతే నువ్వు ఆచరణవి, రెండూ ఏకమై అంచెలంచెలుగా ఎదగాలి

    ReplyDelete
  21. ప్రేమ మైకం లో మమైకం...!!

    ReplyDelete
  22. కలగలసి కాపురం చేసేవారు ఆలుమగలు
    మనసులతో మనుగడ సాగించేవారు ప్రేమికులు
    ఇంతకూ మీరు ఏఅకోవకు చెందినవారు!??

    ReplyDelete
  23. ప్రేమించుకున్నప్పుడు కలగలిసి ఉంటారు. పెళ్ళి అయిన తరువాత అన్నీ కలతలు మొదలు.కారణం ఏమిటో సృష్టికర్తకు కూడా అర్థం కాదు మిమ్మల్ని అడిగితే మీరు మాత్రం ఏమి చెబుతారు...హ అహా హా :)

    ReplyDelete
  24. రెండు భిన్న మనసులు కష్టం కలసి జీవించడం

    ReplyDelete
  25. అందరికీ నమస్సుమాంజలి _/\_

    ReplyDelete