కనుపాపలే కుంచెలవ్వ కన్నీరు రంగులుగా మార
సున్నిత భావాలు క్యాన్వాసు గోడకు వ్రేలాడుతుంటే
హృదయంలో అందమైన నీరూపం చిత్రించబడుతుంది!
చిరుగాలికి అక్షరాలతో ఊసులెన్నో నివేదించుకున్నా
వెలుగు సిరాతో తెల్లకాగితంపై ఆశల ధరకాస్తు పంప
ఇరుస్పర్శలు పలుకక తడుముకుని ముచ్చటిస్తుంటే
ఆగాగని నీగుండె నిబ్బరంతో నిర్దయగా నిందిస్తుంది!
కంటికి దూరంకావద్దని కలంతో కాలాన్ని వేడుకున్నా
కప్పుంచిన మదిలోని మాటలను బయటపడనీయక
దూరంగున్నా దగ్గర ఉన్నావన్న భ్రాంతిలో నేనుంటే
నీ మౌనం మనిద్దరి మధ్యా ఉన్నది దూరమంటుంది!
ధీనంగా చెంపలపై జారుతున్న కన్నీటిని అర్ధించుకున్నా
మొద్దుబారిన నీ మదిని తడిపి నన్ను గుర్తుచేయమని
రూపుదిద్దుకున్న నీ చిత్రాన్ని సంపూర్ణం చేయబోతుంటే
వేదన వర్షంలా కురిస్తే అర్పించిన ప్రేమ ఎలా నిలుస్తుంది!
Love it happens
ReplyDeleteDont borrow it from others.
హ్మ్మ్
ReplyDeletePrema putte time vachinapudu మొద్దుబారిన మదిని kuda niddura leputundhi friend.
ReplyDeleteసహజత్వాన్ని పుణికిపుచ్చుకునే స్వభావం ఆప్యాయతది
ReplyDeleteతనవారి పట్ల కలిగే విధేయత గీటురాయి అనురాగానిది
నిత్యమై అలరారు వేళ.. చిన్న పొరబాటైనా అతలాకుతలమే
బాధతప్త హృదయాన ఉబికి వచ్చే కన్నీటి సాంద్రత
సంతోష సమయాన కనుజారే భాష్పాలకు సరితూగవు
హృద్మందిరాన ఇంకిన భావోద్వేగాల రంగులన్ని
మనసు కుంచేతో జీవితమనే కాన్వాసుపై ముద్రించగా
గతకాల జ్ఞాపకాలు కొన్ని ఇహకాల ఘడియలు మరికొన్ని
పిమ్మట కాలపు ఆలోచనలను సైతం సునాయాసంగా చిత్రించవచ్చు
ధరణి
ఓం కేశవాయ నమః
ప్రేమ రూపురేఖలు దిద్దుకోవడం మామూలు పనియా
ReplyDeleteprema puttuka vichitram
ReplyDeleteadi tenchukoedam chaala kashtam
prema meeku dasoham
ReplyDeleteఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. జీవితమనే పుస్తకాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా రాసుకుంటారు. జీవితంలో సంతోషంగా, మనశ్శాంతితో ఉండాలంటే కృతజ్ఞతా భావం, ప్రేమ, నిజాయితీ, గౌరవమనే నాలుగు విషయాల కావాలి.
ప్రేమ మనసు జతకట్టి వ్రాసిన కవిత.
ReplyDeleteLOVELY
ReplyDeleteప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకొక్కరిదీ ఒకో వాదన, దానికి అనేక రూపాలు చిత్రలు ఉంటాయి.. నిజమైన ప్రేమ అంటే...ఎవరినైతే తన ప్రేమికుడు/ ప్రేమికురాలిని ప్రేమిస్తుంటారో, వారు తను ప్రేమించేవారినుండి తిరిగి మళ్ళీ అదే ప్రేమను పొందాలనుకోవడం అవివేకం ప్రేమ అనేది ఎప్పుడూకూడా తీసుకోవడం ఎరుగదు, దానికి తెలిసిందల్లా ఇవ్వడమే. ప్రేమ అనేది కష్టాన్ని సహిస్తుంది. ప్రేమ అనేది మరొక వ్యక్తి కొరకు సున్నితంగా పదిల పరచుకొనే ఒక లోతైన, అవ్యక్తభావన.
ReplyDeletepremanu arthinchakandi
ReplyDeleteadi avasaram anukunapudu vachi valutundi
కనే కలలు ఎప్పుడూ నిజం కావు. కవితపరంగా భావాలు బాగున్నాయి.
ReplyDeleteవేదన వర్షం :(
ReplyDeleteఊహల మాటున కొలువుండి
ReplyDeleteరెప్పలు మూసినవేళ కలవై
కనులు తెరిచినంతనే
జ్ఞాపకంలా మిగిలిపోతాయి తలపులు
స్వప్నం నిజం కాదు
కాదు అంటే మది ఊరుకోదు
నువ్వు నిజంకాదన్టే వాస్తవం ఒప్పుకోదు
ప్రేమ ధ్యాస మనసుని నిద్రపుచ్చదు
ప్రేమ జీవనరాగం.
ReplyDeleteవలపు తూటాలు ఇంకా ఎన్ని మిగినవి సాంబా :) ప్రేమకు అంతం లేదు అనకు.
ReplyDeleteఎందుకని మీ కవితల్లో నిట్టుర్పుసెగలు పెరిగి నిరాశక్తితో కూడిన భావాలు కనబడుతున్నాయి.
ReplyDeleteమీ భావాల దారి మళ్ళించండి పద్మార్పితగారు.
Bagundandee mee kavitha
ReplyDeleteప్రేమలో పడిపోయారు అనుకుంటే ఇలా ప్రణయ విలాపంలో పడిపోయారేంటి?? ప్రేమర్పిత
ReplyDelete