చేసిన నేరం!


నేను కన్న కలల్ని నాకు కాకుండా దూరం చేసిన
అంతర్యామీ! నువ్వు ఏమి కలగంటున్నావో ఏమో
నీకు నేను పరాయిని ఎప్పుడయ్యానో తెలియలేదు
ఆత్మ వేరైనాకా నేనెలా జీవించాలో తెలియకుందిగా!

నేను వెళుతున్న మార్గం నన్నెక్కడుంటావని అడుగ 
అంధకారమా! నువ్వే వెలుగుబాటలో ఉన్నావో ఏమో
గమ్యంలేని నేను దారి ఏం చూపాలో తెలియడంలేదు
ఇప్పుడైనా మదిక్కడా సవ్వడి అక్కడని తెలిసిందిగా!

ఇసుకలో రాసినట్లు నానుదుటిరాత ప్రతిచోటా చెరిగిన
అదృష్టమా! నువ్వే నుదురు వెతుకుతున్నావో ఏమో
కనీసం నాపై నేనెందుకు అలిగానో నాకు తెలుపలేదు     
శ్వాస పీలుస్తున్నా బ్రతికిలేను ఎందుకో తెలియదుగా!

అనుకున్నవేవీ జరుగవని కన్నీరు నన్నంతమవ్వమన 
ఆత్మవిశ్వాసమా! నువ్వు ఎక్కడికి పారిపోయావో ఏమో
నమ్మకం ఇంకా కళ్ళుతెరిచి నిద్రిస్తుందో తెలియడంలేదు 
నా తప్పేంటో ప్రాణం శిక్షగా ఎందుకిచ్చావో తెలుపవుగా!   

23 comments:

  1. Mee antarardam artham chesukotam chala kastam.

    ReplyDelete
  2. అదృష్టం మన వెన్నంటి ఉంటే ఇలా ప్రశ్నించరు ఎవ్వరు..మనసు అలజడితో రేకెత్తిన భావాలు మీవి.

    ReplyDelete
  3. madam love failure vala stories poetrically covering very well.

    ReplyDelete
  4. మనసు మదించిన వచ్చే ఆవేశంలో ఆవేదనపాళ్ళు అధికం.

    ReplyDelete
  5. నేరం మీది కాదు ప్రేమది :)

    ReplyDelete
  6. మనసు స్థితిగతులు బాగా వ్రాశారు.

    ReplyDelete
  7. ఏమిటి జీవితాన్ని ప్రశ్నించారు?
    జవాబులు దొరుకుతాయి అనుకుంటున్నారా?
    చిత్రం తగినట్లు లేదు పర్మార్పితగారు

    ReplyDelete
  8. Emotional feelings bagapandincharu.

    ReplyDelete
  9. జీవితం అనేది ఒక తోటలాంటిది. ఆ తోటలో చెట్లనున్న ఆకులు రాలిపోతాయి. పువ్వులు వాడిపోతాయి. అలాగే జీవితంలో రాలిపోయిన ఆకుల్ని ఏరిపారేసినట్టే మనం మన గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని మనసులో నుంచి తొలగించుకోవాలి. అప్పుడే కొత్తగా చిగురించిన చిగుళ్లు పువ్వులను ఆస్వాదించగలం.

    ReplyDelete
  10. అంతర్యామీ ఇచ్చిన జవాబు ఏమిటి?

    ReplyDelete
  11. అంధకారమా! నువ్వు ఏ వెలుగుబాటలో ఉన్నావో ఏమో..బాగుందిచీకటిని ప్రశ్నించిన తీరు.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. మనిషి ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ప్రాబ్లం. మీకు కష్టం అనుకున్నవి వేరొకరికి సులభం. ప్రపంచంలొ ఏకష్టాలు లేని జీవులు ఉండరు అనుకుంటాను. మీ రచనలు ఆలోచించే విధానం ప్రశంసనీయం.

    ReplyDelete
  14. మీ అత్మబలం మీద నమ్మకం ఉంచండి.
    అదే కాలానుసారం మిమ్మల్ని కాపాడుతుంది.

    ReplyDelete
  15. కర్కష కఠోర మనుకుంటున్న భావావేశాలు ఏవి తమకు తాముగా
    పెనవేసుకో లేవు నీవు చనువు ఇచ్చే దాక ఓ మనసా..
    అంధకార మనుకుంటున్న కోపతాపాలన్ని దావానలమున జీర్ణ మవగ తేజోమయ దీప్తమే తోవ జూపే ఓ మనసా..
    నిర్వేద మనుకుంటున్న ఆశయాలు అసంపూర్ణమై నిలవగలవ ఆత్మస్థైర్యము మెండుగా నుంటే తానుగా దరికి చేరదా ఓ మనసా..

    బాగున్నారా పద్మ గారు..!

    ధరణి

    ReplyDelete
  16. ఇసుకలో రాసినట్లు నానుదుటిరాత ప్రతిచోటా చెరిగిన
    అదృష్టమా!ఎక్కడున్నావు అంటూ ప్రశ్నించారు కదా! బాగుంది నేస్తం.

    ReplyDelete
  17. ఇతరులు తెలుసుకోలేరు మనసుపడుతున్న వేదన.
    చాలా చక్కగా విపులంగా వ్యధాభరితంగా వ్రాసారు.

    ReplyDelete
  18. వేదన నిండిన కవిత

    ReplyDelete
  19. ప్రాణాన్ని శిక్షగా ఇచ్చిన పాపి ఆ విధాత... మనం పైకెళ్లాక వాడి సంగతి చూసుకుందాం గానీ... ఇక్కడ కుమ్మేసుకుందాం కవితలు

    ReplyDelete
  20. గంతగనం పాపమేం జేసినావ్

    ReplyDelete