బజారీతో..

పిల్లాడకుని పరువాలను పరుపులా పరచిన పాపం
నేడు పశ్చాతాపంతో పైటను సరిచేసుకో లేకుంది..   
పైబడ్డ ప్రాయం పొంగులు జారి వలపు వెలకోరుకుంది 
పడుపువృత్తేమో పైసలతో పని ప్రణయపైత్యం వద్దంది! 

ఆతృతతో కూడిన ఆరాటంలో అవయవాలన్నీ చూస్తే 
చిన్నవాడి గిల్టు ప్రేమ మెరుపులకు మురిసిపోతుంది..   
తల్లి చనుపాలు త్రాగి ఋణం తీర్చుకున్నవాడని నమ్మ   
వేశ్య రొమ్ములు చీకి రమించి రుణపడనంటే గొల్లుమంది! 

విటుడై వచ్చి పోవడానికి విడిది ఏర్పాటు చేయమంటే  
మల్లెల మత్తులో జగత్తు మరచి మనువు కోరుకుంది..
వేరొకరి పతి అయినా మనస్ఫూర్తిగా మనసు ఇచ్చింది    
వెన్నెల పిలువ వెర్రిది వెలయాలినన్న మాటే మరచింది!  

పదినిముషాల పక్క సుఃఖానికి తాను పుండుగా మారి 
డబ్బులిచ్చి సంస్కరించేటి రసికరాజుల్ని నమ్ముకుంది..  
కుతి తీరి అంగంవాల కళ్ళుతెరచి ఒళ్ళుతెలిసి మేల్కుని    
భోగంస్త్రీ పనిమాని మంచిని వలచి మాత్రం చేసేదేముంది! 

27 comments:

  1. వేరొకరి పతి అయినా మనస్ఫూర్తిగా మనసు ఇచ్చింది
    వెన్నెల పిలువ వెర్రిది వెలయాలినన్న మాటే మరచింది!- Verokari pathi aina Vesya daggaraki velladu anthe, aa Bharya daggara ay sukam lekane. Alanthi Vaadini preminchatam aa Vesya verritanam ela avtundhi.

    ReplyDelete
  2. ఎదలోని వ్యధను వెలిబుచ్చడంలో ఎక్కడో లోపం అనిపిస్తుంది. మరోసారి సరిచూసుకోండి పద్మాజీ!

    ReplyDelete
  3. వెలయాలు మానసిక విలువలతో వృత్తి చేస్తె
    కడుపు నిండదు మాడం..nice narration

    ReplyDelete
  4. వేశ్యా వృత్తి అనేది లీగలైజ్ అయిన తరువాత అందరూ కమర్షియల్ అయిపోయారు ఇచ్చామా పుచ్చుకున్నామా అనే పద్దతిలోనే కొనసాగుతున్నాయి ఎవ్వారాలు. మీ కవితా నాయిక మరీ సున్నితత్వం కలది...ఇలా అయితే వ్యాపారం సాగదని చెప్పండి.వృత్తిని వృత్తిలా తీసుకుని గౌరవించాలి.

    ReplyDelete
  5. ఏడాదికి పైబడింది నీ బ్లాగ్ చూసి. పనిఒత్తిడి అనారోగ్య కారణాల వలన చూడలేక పోయాను. అప్పుడప్పుడూ చూసి చదివి కూడా కమెంట్స్ వ్రాయలేదు, నీవు మునపటి వలెనే ఒక ధీక్ష పట్టుదలతో బ్లాగ్లో రాతలు కొనసాగించడం నిజంగా ప్రశంసనీయం. ఇక ఈ పోస్ట్ విషయానికి వస్తే చిత్రానికి సరిపడిన వాక్యాలు కవితలో కొరవడినాయి అనిపించింది ఎందుకనో? అర్పితా మెయిల్ చూడు. ఆశిస్సులతో-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. నిజమే... మీరు బ్లాగ్ లోకి రాకపోతే హడావిడే లేదు... ఇప్పుడు వచ్చారుగా పద్మార్పిత కవితల కోలాహలం మళ్లీ మొదలౌతుంది 😀😀😀
      హరనాథ్ గారు... Get well soon

      Delete
  6. కుతి తీరి అంగంవాల కళ్ళుతెరచి ఎబ్బెట్టుగా ఉందనిపిస్తుంది.
    చిత్రం చాలా అర్థవంతంగా పెట్టారు.

    ReplyDelete
  7. గట్స్ విత్ గన్ షాట్స్

    ReplyDelete
  8. నీ సౌందర్య లోకానందం
    చీకటి గదుల్లో ఆతృత
    చల్లనిరేయి అశాంతులు
    అరువిచ్చేటి నీ శృంగారం
    నీ తళతళ మెరుపులు
    అన్నీ కూడా గిల్టు నగలు
    నిదురించిన ప్రపంచ గర్భంలో
    మేలుకొన్న ఆకలి పాపాలు
    మిణుకులా మెరిసే వెలుగులు
    నీకు పొంచియున్న విధిశాపాలు..

    ReplyDelete
  9. ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలకు చోటివ్వకుండా విషయాన్ని సూటిగా చెప్పగలిగే ప్రతిభ ఉన్నవారు మీరు.

    ReplyDelete
  10. పక్క సుఃఖానికి తాను పుండుగా మారి..touched

    ReplyDelete
  11. ఎవరి ఆనందం వారిది
    అలాగని ఎవరినీ నిర్దేశించి ఆపలేము
    వృత్తి రీత్యా వాళ్ళ పని వాళ్ళది
    వీళ్ళ అవసరాలు వీళ్ళవి...కాదంటారా

    ReplyDelete
  12. అందరి స్పూర్తి స్పందనలకు వందనములు.

    ReplyDelete
  13. అధ్భుతం

    ReplyDelete
  14. అయ్యో... పాపం! విటుడు మహా నటుడు :((

    ReplyDelete
  15. its made me to recollect my poem 6 years back that I wrote ....

    http://vedivedisamosaalu.blogspot.com/2013/03/blog-post_5837.html

    I too agree different flavors....
    Little bit masaala ekkuvaga vunnadi, but still its ok

    ReplyDelete
  16. మనసుని తడిబార్చిన అక్షరాలు.

    ReplyDelete
  17. simply superb padmagaru

    ReplyDelete
  18. మీ కవిత మాటలకూ నమస్కారం, మంచి మనస్సు తో అలోచించి పోస్ట్ చేసిన మీకు అభినందనలు..... జమాండ్ల

    ReplyDelete
  19. govullu tellana
    gopayya nallana

    ReplyDelete
  20. Madam ela unaru
    Missing your post

    ReplyDelete