సర్దుబాటు..

ఎన్ని విధాల గాయమైందో కుంచెకు.. 
ప్రశాంతమైన తెల్లరంగూ నెత్తురోడుతుంది

కలం పాళీ కూడా అరిగి అలిసిందేమో..
పదాలు సగమై పరుషంగా మారుతున్నాయి

గాలి మాటలకు చెదిరిపోయిన బంధాలు..
అలలైన అప్యాయతకే మురిసి నర్తిస్తున్నాయ్

రంగు వెలసిన రక్తసంబంధాలు అవసరానికి..
అర్రులు చాచి అప్పుడప్పుడూ మిణుక్కన్నాయి

మనసు చచ్చిపోయిన క్షణాలు మాత్రం.. 
గుర్తుగా నిబ్బరాన్ని లేపి ధైర్యాన్ని రెచ్చగొట్టె

కాలానుగుణంగా మార్పుచేర్పులతో జీవితం.. 
తప్పని సరైన సర్దుబాట్లతో ముందుకు సాగుతుంది

అలసిన దేహం తనకంటూ ఆత్మీయతనడుగుతూ.. 
అది దొరకడమే మహాభాగ్యమని తనతో తానే మాట్లాడె!

25 comments:

  1. రంగు వెలసిన రక్తసంబంధాలు అవసరానికి..
    అర్రులు చాచి అప్పుడప్పుడూ మిణుక్కన్నాయి..
    100% Nijam..

    ReplyDelete
  2. అస్థిరంతో కూడన బంధం ఏదైనా ఇంతే,

    ReplyDelete
  3. nice lyrics and pics is also good.

    ReplyDelete
  4. చంచలమైన మనసున రేగే ఆలోచనల తూఫాను
    అస్థిరమైన ఆకాశాన రేగే మేఘాల అలజడులు
    వారి అవసరానికి ఆత్మగౌరవం మరచి మోకరిల్లే
    అవసరం తీరినాక అసలు రంగును వెదజల్లే
    ఆప్యాయతనురాగాలకై ప్రాకులాడే మనిషిని సైతం
    దుర్భాషలాడి మౌనముద్ర వేయించి వెగటు చేసే
    కఠోర పదజాలం తో తమవారే పరులవగా
    మనిషిలో గల అహంకారాన్ని ఆహుతి చేయక
    తమ విచక్షణ రాహిత్యాన్ని బట్టబయలు చేయగ


    ~ధరణి

    ReplyDelete
  5. రసికరాజ తనయులను రెచ్చగొట్టి
    తిట్టి ఏమి సాధించాలని కంకణం కట్టినారో

    ReplyDelete
  6. మీ కవితలు మనసుని మెలిపెడతాయి
    చిత్రాలు రంగులు వెలిసిపోవడం కాదు కళ్ళు తెరిపిస్తాయి.

    ReplyDelete
  7. రంగు వెలసిన రక్తసంబంధాలు అవసరానికి..
    అర్రులు చాచి అప్పుడప్పుడూ మిణుక్కన్నాయి

    ReplyDelete
  8. మనసు చచ్చిన క్షణాలు కనుల ముందు కదలాడుతున్నా, కాలానుగుణంగా మార్పులు చేర్పులు అవమానాలు అవహేళనలు సర్దుబాట్లు దిద్దుబాట్లు తప్పని జీవితాలై అలసిన దేహం కోరుకునేది తన కోసమంటూ ఆత్మీయతను అరక్షణమైనా కేటాయించమని అదే తీరని కోరికగా అర్హులు చాస్తూ జీవితాన్ని నెట్టుకు రాక తప్పని పరిస్థితులు.

    ReplyDelete
  9. అంతంలేని వ్యధలు.

    ReplyDelete
  10. స్టైల్ మార్చారేంటి? మందహాసార్పిత 😊

    ReplyDelete
  11. heart touching content & painting

    ReplyDelete
  12. మీ వ్యవహారాల్లో కూడా వినోదం విషాదం సమపాళ్లలో దాగి ఉంటాయి అదేంటో

    ReplyDelete
  13. భావవెల్లువలో మునిగి తేలుతున్నాం

    ReplyDelete
  14. Amazing writings.
    God bless you.

    ReplyDelete
  15. మానసిక ఒత్తిళ్ళలు మందులేదు కదా!

    ReplyDelete
  16. అలసిన దేహం తనకంటూ ఆత్మీయతనడుగుతూ..మనసుని తాకిన వాక్యాలు

    ReplyDelete
  17. అందరికీ అభివందనములు.

    ReplyDelete
  18. ప్రతీ అక్షరంలో ఆర్దత గుప్పించారు.

    ReplyDelete
  19. కుంచెకు గాయమైంది
    తెల్లరంగు నెత్తురోడుతుంది

    ఎలా వస్తాయండి ఇలాంటి పదాలు మీకు, దీన్ని పొగడటానికి నాదగ్గర పదాలు లేవు క్షమించండి.

    ReplyDelete