చంద్రుని పై...

ఛల్ ఛల్ చక్కనోడా నా మనసుకే నచ్చినోడా
నిన్ను నా చందమామ అని ముద్దుగా పిలిస్తే 
వ్యోమగాములపైనే వెర్రి వ్యామోహం అనుకోకు!

అంతరిక్షంతో అంతరాత్మను తులాభారమేసేటోడా
చంద్రుని ఉపరితల ఎత్తుపల్లాలు కొలవ వారెళితే
నా కొలతలు అడిగి ఇస్రోని ఇరకాటంలో పెట్టకు!

ప్రణయం కూడా ప్రయోగమనుకునే ప్రవరాఖ్యుడా
చల్లని చంద్రకంపాలు నీ వేడిని చల్లబరుస్తుంటే
ప్రయోజనాత్మకంగా ప్రయోగం సాగనీయి ఆపకు!   

సరససల్లాపాలకి సారధ్యం వహించిన వెర్రినావోడా
సాంకేతిక పరిజ్ఞానమే పెరిగి ఫలితం దక్కిందంటే
చంద్రునిపైనున్న అవాసాలు చెరిసగం కాదనకు!

అన్నింటా వినోదం విలాస వైవిధ్యాన్ని కోరేవాడా   
సవ్యముగా సాగి చంద్రయాన్-2 సక్సెస్ అయితే
నీ నా శోభనం చంద్రమండలంపైనే ఇప్పుడడగకు! 

30 comments:

  1. గందరగోళం సరళికృతమవగా లయగతుల వేళాకోళం
    జియోసింక్రనస్ లాంచ్ వెహికిల్ మార్క్ ౩ పై చంద్రమండలాన్ని మరో మారు శోధించటానికి పయనమయ్యే రోదసి నౌక లోగల చంద్రయాన్ ౨, ప్రజ్ఞాన్, విక్రమ్ ఉపగ్రహాల సాంకేతికతకు ఇస్రోవారికి అభినందనలు.. అలాగే పద్మార్పిత గారికి కూడా..!

    ~ధరణి శరణ్య "చూచూలు"

    ReplyDelete
  2. మీ మార్క్ చాలా రోజులకు ప్రతిబింబించింది.

    ReplyDelete
  3. మీ బుర్రలో గుజ్జుకి అభివందనములు
    టైంలీ పోస్ట్...కిరాక్ ఉంది

    ReplyDelete
  4. చక్కని చుక్క ఏమి చెప్పినా బాగు బాగు kudosuloo

    ReplyDelete
  5. keka post
    arpitagaru
    aripincharu

    ReplyDelete
  6. చిత్రం భళారే విచిత్రం మీ ఆలోచనలు

    ReplyDelete
  7. చలోరే చల్ సాథీ చల్ అని భీ పాడుకుంటారా ఏందీ
    ఏంది కధ గిట్ల

    ReplyDelete
  8. సక్సెస్
    సక్సెస్
    సక్సెస్
    waiting for results :)

    ReplyDelete
  9. madam mee route separate.ha ha ha :-)

    ReplyDelete


  10. అక్కడేమో ఓ ఆసామి చంద్రునికి క్యారేజీ కట్టే ప్రయత్నంలో
    నాణ్యమైన ఫ్యూయల్ పంప్ వెతుకులాటలో పడి వున్నారు :)

    మీరేమో ఇక్కడ శోభనం ఆక్కడే ఆ చంద్రుని‌పైనే అని‌ నిర్ధారించేస్తిరి :)


    క్యారేజీ వచ్చేనా ? శోభనం జరిగేనా ?


    ప్చ్ ! ఏవిటో ఇచిత్రం గా వుండాది :)


    బొమ్మ వడ్దాది పాపయ్య అప్పుడెప్పుడో స్వాతికో చందమామ కో వేసినట్టుందే ?



    జిలేబి

    జిల్

    ReplyDelete
  11. ఛల్ ఛల్ మంటూ ఇప్పుడు పరుగులు పెడితే ఎప్పటికో చేరుకుంటారు. అప్పటికి ఏది ఎట్లు జరుగునో ఆ చందమండలానికే ఎరుక. ఛల్ ఛల్ పరుగు ఆపకండి...పరుగో పరుగు.

    ReplyDelete
  12. bomma rammana rani varu evaru.

    ReplyDelete
  13. ఇక్కడ ఇస్రో ఇరకాటంలో అక్కడ మీ కవితాజంట శోభనం ఓహో ఆహా ఏమి కనుల విందు

    ReplyDelete
  14. ఇంతకూ పెళ్ళి అయ్యిందా లేక...

    ReplyDelete
  15. అమ్మో... బొమ్మలో ఈ అమ్మాయికి కండలే అనుకున్న బుద్ధిబలం కూడా కొండంత ఉంది.
    చాలా రోజులతర్వాల ఇలాంటి కవిత రాసారు...
    Let's go to చంద్రమండలం!

    ReplyDelete
  16. heeeeeeeeeeeeeee ha heeeeeeeeee

    ReplyDelete
  17. చంద్రయాన్-2 అంతరిక్ష పరిశోధనకు హాస్యాన్ని జోడించి అందించిన సమాచారం ప్రశంసించదగినట్లుంది.

    ReplyDelete
  18. అసంపూర్తిగా పూరించిన పంక్తులవోలే ఉంది మీ కవిత
    చిత్రము కడు రమ్యం పద్మార్పితగారు.

    ReplyDelete
  19. adurs madam mea post

    ReplyDelete
  20. కొలతలు కొలిచి
    చంద్రమండలాన్ని చుట్టి రండి.

    ReplyDelete
  21. ఛల్ ఛల్ చక్కనోడా

    ReplyDelete
  22. చంద్రయాన్-2 సక్సెస్
    you also proceed ;)

    ReplyDelete

  23. పద్మార్పిత..ప్రణమిల్లి చేస్తున్నా అభివందనం _/\_


    ReplyDelete
  24. papayya gari chitramu bagundi

    ReplyDelete