ఛీర్స్ టు లైఫ్..

క్రిందికీ పైకీ తైతెక్కలాడే లైఫ్ గురించి చింతేల
ఎప్పుడు ఊగి ఊడేనో నీకెందుకు తెలియాలా
హృదయంపై భారమెందుకు ఎక్కువ వేయాలా
నిరాశని నిషాలో ముంచి రెండు పెగ్గులేయాల
ఆనందాన్ని నిమ్మసోడాలా కలిపి లాగించాలా!

పెగ్గుపై పెగ్గేసి అన్నీ మరచి చిందులేసెయ్యాల
రమ్మో బీరో విస్కీ లేకుంటే నాటుసారా తాగాల
నంజుకి చికెన్ జీడిపప్పు లేదా గుడాలు తినాల
కష్టాలన్నీ కాక్టేల్ మాదిరిగా కలిపికొట్టి లాగించాల
ఏదున్నా లేకున్నా ఉన్నదాంతో సర్దుకునుండాల!

నషాని నీతులు చెప్పి ఎక్కిన కిక్కును దించనేల
వీలైతే ఐస్ ముక్కలేసి మరో పెగ్ వేసుకోమనాల
ఎత్తిన సీసా ఖాళీచేసి గాలిలోతేలి ఖుషీతో ఊగాల
ఎప్పుడూ బుద్ధిసూక్తులు చెప్పక జల్సా చెయ్యాల
ఛీర్స్...చెప్పి మందుకొట్టి లైఫ్ నే మరచిపోవాలా!   

29 comments:

  1. వాహ్..పద్మగారు
    అక్షరాలతో సగము కిక్ ఎక్కి
    చిత్రంతో పరిపూర్ణ నిషా ఎక్కింది.

    ReplyDelete
  2. జీవితం మొత్తం రెండు పెగ్గులు, ఆరు జీడిపప్పు బద్దలు అనుకునేంత సులభం ఆనందం మరి ఎందులోనూ లేదు అన్నంత మత్తు కిక్కు ఎక్కించావు.



    ReplyDelete
  3. zindagi ka nashaa bahut khoob samjaaya.

    ReplyDelete
  4. Mondestu chindai ra, chindestu mondai ra.🍺🍻🥂🥃🍾

    ReplyDelete
  5. మాడం మీరు అసాధ్యులండి. అన్నీ చిత్ర విచిత్రాలు చేస్తారు.

    ReplyDelete
  6. మందుకొట్టి చిత్తుతో చిందులుయ్ వేసెయ్
    ఇలా స్త్రీ చెప్పింది అంటే ఇంక చిందులకు కొరత ఉండదు రేపు బోనాల్ పండుగ ఆదివారం కలిసివచ్చింది. చిందులకు కదవు లేదు అంతా హుషారు హుషారు. ఊలలా ఊలలా :)

    ReplyDelete
  7. ఆహా ఓహో
    అచ్చెరువు
    అద్భుత
    అమోఘం
    ఆచరణయోగ్యం

    ReplyDelete
  8. బ్లాగ్ అదిరింది
    మీ వ్రాతలు భలేనచ్చేసాయి.

    ReplyDelete
  9. పాణమున జివిత ముపై ఇరకతి కలగ ఏలలో నషాలాని కెక్కే బుద్వీజర్ ఎందకు..
    పేమ అనే దినసు లేదని జీవిత పుస్తకాన కాయితాల్ లేవని మెక్ డవెల్ ఎందకు..
    మనసు స్తిమితంగా లేదని ఇసుగులో మూడాఫ్ ఔతే మరి స్మిర్నాఫ్ ఎందకు..
    రాగదువేషాల్ కలగా పులగ మౌతే అరచి గోల బెట్టి బంధానికి వెలివేసే నార్కోటిక్స్ కి దగ్గరయ్యి సివరాకరున అందరున్నా అనాథగా మిగలటం ఎంత వరకు సమంజసం.. తెలసి తప్పటడుగేస్తారు ఎందుకు..

    సంసారమనే బంధం గట్టిగా ఉండాలంటే పొగాకు, తాగుడు లను జీవితానికి ఆపాదించుకోకుండా ఉంటే ఉన్న జీవితకాలం గౌరవం, మర్యాద..
    తాగుడుకి బానిసైన మరునిమిషం వారి జీవితాన్నే గౌరవించలేని వారు.. పరుల మనోభావాలను అర్థం చేసుకోలేరు, గౌరవాన్ని కాపాడుకోలేరు.

    గోవిందరమణ గరుడగమన

    ~శ్రీత ధరణి శరణ్య

    ReplyDelete
  10. లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి అంటే కాంటాక్ట్ పద్మార్పిత :)

    ReplyDelete
  11. ‘మందుబాబులం.. మేం మందుబాబులం.. మందు కొడితే మాకు మేమె మహారాజులం.’ అని మందు కొట్టి మత్తుగా పడుకుంటారు. మందుల్లో పలురకాలు.. హాట్, కూల్ అని. ఏదైనా మితిమీరక పరిమితం అయితే పర్వాలేదులెండి.

    ReplyDelete
  12. కోతి కల్లు తాగి చిందులు వేసినట్లు మందుకొట్టి చిందులు వేద్దాం

    ReplyDelete
  13. ఛల్ ఛలో జీ దో పెగ్ లేలే

    ReplyDelete
  14. మీరూ మందుబాబులతో చేరి తైతెక్కలు ఆడతారా
    నమ్మ సక్యంగా లేదండి. ఏదైనా లైఫ్ ఎంజాయ్ చెయ్యండి.

    ReplyDelete
  15. chilled & thrilling concept.

    ReplyDelete
  16. salam to ur wonderful thoughts
    super picture

    ReplyDelete
  17. ఛీర్స్ టు యు అండ్ యువర్ పోయట్రీ....

    ReplyDelete
  18. కళ్ళకు చప్పగా..
    నాలుకకు ఉప్పగా..
    చెంపలకు చల్లగా..
    గుండెకు బరువుగా..
    మెదడుకు గురువుగా..
    నలుగురికీ నవ్వుగా..
    ఉండేదే కన్నీటి రుచి!

    ReplyDelete
    Replies
    1. చాలా బావుందండి..!!
      అయితే..
      కళ్ళకు చప్పగా బదులు కళ్ళకు చెమ్మగా అంటే ఎలా ఉంటుందంటారు..?

      Delete
  19. జీవితపు మత్తులో తూలమంటారు :)

    ReplyDelete
  20. అభిమానిస్తున్న అన్ని హృదయాలకూ అభివందనములు.

    ReplyDelete
  21. లైఫ్ ఒక సారా
    ఆనందించు మనసారా

    ReplyDelete
  22. ఇది ప్రేమ విఫలం అయ్యి వచ్చిన కవితేమో...

    నాది సందేహం అంతే తప్పైతే మన్నించు.

    ReplyDelete
  23. అద్భుతమైన ప్రతిభ మీలో.

    ReplyDelete
  24. మీ కవిత అద్భుతం..! అభినందనలు..!

    ReplyDelete