వినోదించి వజ్రాలవడ్డాణం చేయిస్తానంటివి నాడు
విశ్వమంతా చూసి విసుక్కుంటున్నావు నేడు!
మరులెన్నోగొల్పుతూ మునివేళ్ళు పిసికేస్తూ..
మాయమాటల్తో మాటీలు పెడతానంటివి నాడు
మదంతీరితే మాయతొలగె అంటున్నావు నేడు!
చిలిపి చేష్టలతో చిత్రంగా చెక్కిళ్ళు నొక్కుతూ..
చంకలు ఎగరేసి చంద్రహారం వేస్తానంటివి నాడు
చెప్పింది చేయలేనంటూ చతికిలబడ్డావు నేడు!
అందాన్ని తనివితీరా చూసి ఆహాని ఆరగిస్తూ..
అరవంకీలు రెండెరవేసి అక్కడ నొక్కితివి నాడు
ఆ అందాలే చూసి అలసితినంటున్నావు నేడు!
ముద్దొస్తున్నానంటూ ముద్దుపై ముద్దు పెడుతూ..
ముక్కెరే కాదు నత్తూ నా సొంతమేనంటివి నాడు
మోజు తీరినాక ముడుచుకు పడుకున్నావు నేడు!
ఏవంకన ఏఆభరణం అడుగుతానోనని ఆలోచిస్తూ..
అరవైకేజీల అసలు బంగారానికి తెలియలేదు నాడు
మతిలేనోడ్ని మన్నించు బంగారమంటున్నావు నేడు!
అందరూ అదే బాపతు అనుకోకడి.
ReplyDeleteఇజమైన ప్రేమికులూ ఉంటారండోయ్.
Ornaments based post with meaningful sentences.
ReplyDeleteఅవసరానికి వాడుకునే వారు అంతే..మంచి పోస్ట్.
ReplyDeleteబంగారానికి నగలతో అవసరంలేదని మనసుతో చెబితే ఈ ఆడవారు నమ్మరు అనుకుంటాడు పాపం :)
ReplyDeleteఇంతకూ ఏమీ చేయించకనే మురిపించాడు..అహ హా హా
ReplyDeleteమిమ్మల్ని నిలువెత్తు మేలిమి బంగారం అని అన్నా... తిడతారెంటి సుమండీ
ReplyDeleteమతిలేనోడు "బంగారం" అని కూడా పిలిచాడు కదా ?
Deleteఇంకేం ఇంకేం కావాలే....
చాల్లే ఇక చాల్లే...
మరేఁ.. భార్య మనసు అర్దం చేసుకునేంతగా పరిపక్వత చెందాలి భర్త యని శెలవిచ్చినారా పద్మ గారు.. భర్త గాంభీర్యంలో కూడ లోతైన ఆప్యాయత దాగి ఉంటుందని మీకు తెలియనిదా చెప్పండి.. సరికొత్తగా రచించినారు.. కాకపోతే నూటికి ముడు పదుల మగవారు అర్దం చేసుకోరు.. అదే నూటికి నాలుగు పదుల ఆడవారు అర్దం కారు.. ఏంతైనా.. ఆలుమగలన్నాక అడపదడప గిల్లికజ్జాలుండాలంటున్నారా.. ఏదైనా శృతిమించితే అంతే సంగతులని సుతిమెత్తగ కవితలో చెప్పిన తీరు ప్రశంసనీయం..
ReplyDelete~ధరణి
ReplyDeleteతెలివై నోడండీ మా
వ! లిప్పు లిప్పుకి నడుమ కువకువ యనంగన్
సలలితముగ మాటల మూ
టలతో కనుగప్పినాడు టవలి తెలియకన్ :)
జిలేబి
ఓసి నాతింగర బంగారమా !
ReplyDeleteమూసీ మూయని స్థితిలోని అరమోడ్పు కళ్ళకు తెలుసా ?
యేయే బాసలాడేనో ,
ముక్కు మూసుక జపం చేసుకునే మునిలాంటి వాడికి
ముకుతాడేసేవు . ముందరి కాళ్ళకు బంధం వేసేవు .
సంసార సాగరంలోకి తోసేసేవు . ఇపుడేదీ దారి ?
రసవత్తర ప్రణయంలో బంగారం అడ్డుకదండీ అందుకే వద్దని కామోసు...అర్థం చేసుకోవాలి
ReplyDeleteఆడవాళ్ళు బంగారానికి లొంగిపోయే రకాలు..పసిగట్టి పడేసిన వాడు నిజంగా తెలివైనవాడు.
ReplyDeleteమీ అక్షర ఆభరణాలకు అభినందనలు.
ReplyDeleteవారానికి ఒకరకంగా రాసే మీరు మున్ముందు మేరు పర్వతం వలె ఎదిగిపోవాలని కోరుకుంటున్నం.
ReplyDeleteమీ బాణీలో సాగిన మరో రసాబాస రాసలీల.
ReplyDeleteఆభరణాలు ఎర చూపించి ఆడవారిని అవసరానికి వాడుకుకునే వదిలివేసే ప్రబుద్ధులకు మచ్చుతునక మీ కవితానాయకి ప్రియుడు. మా మంచోడు.
ReplyDelete"అందాన్ని తనివితీరా చూసి ఆహాని ఆరగిస్తూ" అహం ఆరగించడం ఏమిటది అర్థం కాలేదు.
ReplyDeleteమిగతా అంతా బాగుంది.
మీరు చాలా విలువైన ఆభరణం అని తెలిసి చేయించలేదు.
ReplyDeletenijamga nijame
ReplyDeleteమీరు మీ కవితల్లో చాలావరకు తిడుతున్నారో మెచ్చుకుంటారో అర్థం కాదు. పెయింటింగ్స్ ఒకటిని మించి మరొకటి పెడతారు.
ReplyDeleteఇప్పుడు బంగారం కొనమని అడుగితే సన్యాసుల్లో కలవడమే ఉత్తమమని వెళ్ళిపోతాడు జాగ్రత్త :) :)
ReplyDeleteఆత్మీయులందరికీ
ReplyDeleteపద్మార్పిత..
అభివందనములు!_/\_