గజ్జె ఆడె..


లోకాన్ని చూసి నేను లజ్జ వీడి వెక్కిరిస్తూ
నేడు కాలికి గజ్జెకట్టి బిడియంతో నర్తించగా
హోరుకు హడలిన మువ్వలు చిందరవందర  

అమాయకత్వంతో బిడియము జత కట్టేస్తూ 
కనుపాప రెపరెపల్ని భంగిమలిమ్మని కోరగా
వేసిన పాదముద్రలకు మువ్వలు అస్తవ్యస్థం

నాటి కలనైన నేనిప్పుడు కలతని రేకెత్తిస్తూ
పలుకుతూ వేస్తున్న ప్రతిపాదం వ్యర్థమవగా
చేస్తున్న నృత్యానికి మువ్వలు వంకర టింకర 

రూపులేని మమకారం ప్రలోభానికి గురిచేస్తూ
లేచిన ఆశల అవయవాలు ముక్కలు అవగా
తొక్కిసలాట తాండవంతో మువ్వలు విస్ఫోటం..  

28 comments:

  1. చాలా రోజులకు అక్షరాలతో ఆడుకున్నట్లుంది.

    ReplyDelete
  2. మీ భావాలు నర్తించ అక్షరాలు కలవరపడి కూడినట్లున్నాయి.
    చిత్రము మీ భావము పోటీ పడుతున్నాయి.

    ReplyDelete
  3. అమాయకత్వము
    బిడియము
    జతకడితే కొత్త ప్రయోగం

    ReplyDelete
  4. బాధతో అక్షరాలను గల్లంతు చేసారు.

    ReplyDelete
  5. భావాలను మువ్వలుగా చేసి లోకాన్ని కోపంతో ముచ్చెమటలు పట్టించేలా ఉన్నాయి మీ అక్షరాలు. చిత్రము మర్మమేదో దాచినట్లు అనిపిస్తుంది మేడంగారు.

    ReplyDelete
  6. గజ్జెలు ఘల్లుమనాలి ఇలా విసిరేస్తే ఎలా :)

    ReplyDelete
  7. అమ్మా ఇంతకూ అరంగేట్రం చేసావా?

    ReplyDelete
  8. మువ్వ సవళ్ళు ఆలకించే రమాధవ
    పిల్లనగ్రోవి వీనుల విందుగా కేశవ
    నర్తించే పాదాల లయగతుల తాళం
    ముఖ కవళికల మృదు స్వభావం
    దేహమనే కోవెలలో ఆత్మ స్థాపన
    అక్షరాలతో భావానికి నివేదన

    ~శ్రీత ధరణి శరణ్య
    హరే రామాచ్యుత గోవింద మాధవ

    ReplyDelete
  9. భావ అలజడి మువ్వలై మ్రోగే...

    ReplyDelete
  10. natanam aade le mayuri anukunna..nirustaha paricharu :)

    ReplyDelete
  11. గజ్జె గల్లుమంటుంటే
    గుండే ఝల్లుమంటుంది అన్నారు
    ఇప్పుడు ఇలా విస్ఫోటం అంటున్నారు
    ...ఒప్పుకోము

    ReplyDelete
  12. meeru ela unadi teliyadu but mee bommalu kavitalu super.

    ReplyDelete
  13. what happened madam
    we are missing your lovely poetry.

    ReplyDelete
  14. పద్మా లోకం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. చిందులువేసి కోపోధ్రేకాలకు గురైనంత మాత్రాన్న ఎవరినీ ఏవిధంగానూ మార్చలేవు. స్థిమితముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎన్నటికైనా మంచిది.

    ReplyDelete

  15. ఇంతకూ నటిస్తున్నారా లేక నర్తిస్తున్నారా?

    ReplyDelete
  16. మంత్రంవేసినట్టు నాట్యకళతో నడిచి చిందులు వేసారు సరే
    మాయ ఏమైనా చేసి మంచు ఋతువులని తీసుకు రండి!

    ReplyDelete
  17. కవిత్వంతో కత్తులు దూసినట్లుంది... అద్భుతం

    ReplyDelete
  18. నా భావనాట్యం వెదజల్లిన అక్షరమువ్వలను ఆస్వాధించి అభినందించిన అందరికీ అభివందనములు!

    ReplyDelete
  19. రూపులేని మమకారం ప్రలోభానికి గురి wah

    ReplyDelete
  20. గజ్జెల సవ్వడిలో మీ భావాలు అద్భుతమండీ.

    ReplyDelete

  21. లజ్జ వీడితే బిడియం యెట్లా వుంటుందమ్మీ :) మరీ చోద్యమే పద్మ పలుకులు :)


    చీర్సు
    జిలేబి

    ReplyDelete

  22. గజ్జెల సవ్వడి అమోఘం

    ReplyDelete