"రాంగ్ కనెక్షన్"


నచ్చిందా....నచ్చితే నొక్కు నొక్కు నొక్కంటావు 
నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో నొక్కి చెప్పంటావు
నొక్కి నొక్కి నొక్కించుకోవడం నీకు మజా అయితే 
నవ్వించాలని "కీబోర్డ్" నొక్కడం నాకు అలవాటు! 

మెచ్చితినా చూసి....మెలికలు తిరిగిపోతుంటావు
మెల్లగా ముగ్గులోకి దింపే ప్రయత్నం చెయ్యబోతావు
మతలబులేని నేను నువ్వు సైయ్యన్నావని సైయ్యంటే  
మనసు "మానీటర్" ఒకటనుకున్నామంటే పొరపాటు!

మాటా మాటా కలిసెనా...ప్రపంచమే గుప్పెటంటావు 
మాటల్లో కనబడ్డ నైసర్గిక రూపం నగ్నంగా కోరతావు
వావీ వరుస విస్తీర్ణాలను తెలుసుకునే గుద్దులాటలో
నీదీ నాదీ "నెట్ కనెక్ట్" కాకపోవడం మన గ్రహపాటు!
       

20 comments:

  1. నేటి మెకానికల్ లైఫ్ లో అన్నీ యాంత్రికాలే కదా
    ఇక ఏ బంధమైనా అంతే అదే విధముగా సాగుతుంది.

    ReplyDelete
  2. Wrong number dial chesina wrong connection vastundi.

    ReplyDelete
  3. ee connection twist endo artham kaale

    ReplyDelete
  4. నచ్చితే నొక్కు నొక్కు నొక్కంటావు..ఏదో అనుకుని నొక్కితే ఏదో అవుతుంది
    మీరు మొత్తానికి బహుచతురులు :) :) :)

    ReplyDelete
  5. నిఘూడమైన భావాన్ని దాచి సింపుల్గా తేల్చేసారు. మీరు ఆలోచించే ధోరణిలో చాలా మార్పు వచ్చినట్లు అనిపిస్తున్నది.

    ReplyDelete
  6. ఒకప్పుడు సన్నాయి నొక్కులు ఎదుటివారిని మెప్పించే విధంగా ఉంటే ఇప్పటి నొక్కుళ్ళు పలరింపులు అయినవి. అన్నీ మొబైల్ కీబోర్డ్ నొక్కుళ్ళే లేదా ఫోటోలు చూసుకుని మురిసిపోవడాలే. ఆలోచిచే విధంగా వ్రాసారు పోస్ట్.

    ReplyDelete
  7. మాటల్లో నైసర్గిక రూపం నగ్నంగా..సూపర్

    ReplyDelete
  8. మెల్లగా ముగ్గులోకి దింపే ప్రయత్నం ఇది ఇద్దరి ప్రమేయం లేకుండా జరుగదు. మీరు ఎప్పుడూ మగవారినే తప్పు పడితే ఎలా చెప్పండి. మొత్తానికి మగవారు దుష్టులు ఆడవాళ్ళు మహా నీతిమంతులని మీ ఉద్దేశ్యం అనుకుంటాను. ఇది చాలా అన్యాయమండీ.

    ReplyDelete
  9. Network problem
    worthless
    No use :)

    ReplyDelete
  10. రెచ్చగొడుతున్నారా లేక రెచ్చిపోతున్నారో తెలియలేదు కానీ ఎక్కడో ఏదో మిస్స్ చేసి వ్రాసిన ఫీల్. బహుశా మీ భావాలు కూడా మెకానికల్ అయిపోయినవి అనుకుంటా.

    ReplyDelete
  11. మాంచి హుషారైన మొదలు అనుకుంటే చివరికి నిస్సారంతో ముగించారు..ప్చ్ ప్చ్ ప్చ్.

    ReplyDelete
  12. అహ హా హా సత్యవాక్యాలు.

    ReplyDelete
  13. చాలా రోజులకు కవ్వించే కవిత్వం రాశారు...
    మనోహరం .... సలాం... మేడమ్

    ReplyDelete
  14. "సర్వర్ నాట్ రెస్పాండింగ్"
    "బ్యాడ్ రిక్వెస్ట్ కరప్ట్ ఆర్ రిలొకేటేడ్ ఆర్ లింక్ ఎర్రర్"

    టపి టపి యంత్రమని మొదటి సారి హెచ్ పి పవిలీయన్ డెస్క్ టాప్ పీసీ ను 21.12.1999 లో చుట్టాలింటిలో కనుగొన్నాను. అప్రయత్నంగ వెరొకరింట 19.04.2002 న చూశాను. అప్రయత్నంగ 03.02.2003 న మా ఇంట తొలి క్వెర్టి డెస్క్ టాప్ వెలసింది. 10.12.2007 నాటికి సోని వాయో ల్యాప్ టాప్ కొలువు దీరింది.. సునాయాసమై తొలుత "కనెక్ట్" అయ్యిందప్పుడే మాయాంతరజాలమున.. 26.02.2015 నాటికి డెల్ ఇన్స్ పిరాన్ ఇలెవెన్ టూ-ఇన్-వన్ టచ్ ల్యాప్ ట్యాబ్ రానే వచ్చింది.

    ఉత్తరాల భౌతికత్వాన్ని క్రమేపి ల్యాండ్ లైన్ చేజికించుకుని.. వాటి స్థానాన కంప్యూటరొచ్చి.. అనతి కాలం లోనే ల్యాప్ టాప్ పీసీలొచ్చి.. వాటిని తలదన్నుతు మొబైలొచ్చి.. గణనయంత్రాలనే కాదు నిత్యవసరాలై వెలసిల్లె కాసిన్ని యంత్రాలను సైతం దిగమింగి హై స్పీడ్ డేటా కాలం రానే వచ్చిందని మురవాలో.. మొబైల్ బారిన చిన్న చితక తేడలేకుండ వ్యసనంగా మారుతున్నా లెక్కచేయకుండ బంధాలన్ని ఓ మోస్తరుగా సన్నగిల్లుతున్నాయని బాధ పడాలో తెలియని అగమ్యగోచర అయోమయ గందరగోళ పరిస్థితి..!

    యాంత్రిక జీవనం నుండి ఆటవిడుపు ఆవశ్యకం
    అపుడపుడు టపిటపి కీబోర్డ్ సౌండ్ వదలి ఆప్యాయంగ కుటుంబంతో గడిపితే
    ఆరోగ్యానికి ఆహ్లాదానికి అంతులేదు.

    Nokia 1100 (20.02.2005)
    Nokia 6600 (15.01.2007)
    Nokia 5233 (28.07.2010)
    Nokia 701 (14.08.2012)
    Samsung Galaxy Grand 2 (05.05.2014)
    Samsung Galaxy Note 4 (19.10.2015)
    Samsung Galaxy A9 (09.02.2019)

    ~శ్రీ

    ReplyDelete
  15. కవ్వింపు లేదు కమ్మని వాక్యాలూ లేవు
    ఏదో ముఖస్తుతికి రెండు ముక్కలు వ్రాసి
    చాలు చాల్లే పొమ్మన్ని విసిరి కొట్టినట్లు
    హ హ అహా, భయపడకండి నాకు అనిపించింది ఇది.

    ReplyDelete
  16. నచ్చితే నొక్కు నొక్కు
    నచ్చకున్నా నొక్కు
    నీకు నచ్చితే నువ్వు నొక్కు
    ఎవరికి నచ్చితే వారు నొక్కు
    ఇప్పుడంతా నొక్కుడే
    కీబోడ్ నొక్కుడు
    మనిషి మనసు నొక్కుడు
    అంతా నొక్కుడు నొక్కుడు

    ReplyDelete
  17. నొక్కి నొక్కి చేతులు పడిపోయుంటాయి 😜

    ReplyDelete
  18. అందరూ ఎంతో అభిమానంతో నొక్కి నొక్కి వక్కాణించారు...నచ్చినా నచ్చక పోయినా మీ అందరి అభిమానానికి పాత్రురాలినై ఇలా సాగిపోవడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

    ReplyDelete