ధ్వంసం..

ఒక్కళ్ళమే బాగుపడితే ఒరిగేది ఏముందంటూ..
దేశాన్నుద్దరించే ఉత్తమ దారులెన్నో ధీటుగా చెప్పి
ఎడారాశల ఎండమావులతో దాహం తీర్చుకోమని   
ఊపిరి పీల్చలేని ఊహలతో ఓనమాలు దిద్దించకు!    

సాగర అలపై దీపంపెట్టి వెలుగు చూపుతానంటూ.. 
అంధకారాజ్ఞానానికి చరమగీతం ఆలాపిస్తానని చెప్పి
ఉదయించే సూర్యుడిలో ఉన్న వెలుగును చూసి  
మట్టిలో కలిసే నాకు మమతల మలినం పూయకు! 

సంప్రదాయాలూ విలువలని చంకలెగరేసుకుంటూ
ఆదర్శంగా జీవించి చూపిస్తానని అబద్దాలు చెప్పి 
నిజాలు నిర్మొహమాటంగా చెప్తానంటూ చిందులేసి
చరిత్ర చదివి చివరకు చావుకబుర్లు చల్లగా చెప్పకు! 

అన్నీ పాచిపోయిన పాతదుర్గంధపు ఆలోచనలంటూ..
విరబూసిన కొత్తపూల పరిమళాల పస తెలిసెనని చెప్పి
బజారంతా వెతికి మేధావికి ముసుగు దొరక్క మార్చేసి      
అదృష్టం మానభంగం కావించబడెనని సుడిని నిందించకు! 

28 comments:

  1. అక్షర శరములు విసిరారా?? వామ్మో.... అదరహో అర్పితా... మీ అధరాలు ఆక్రోశం కూడా పాలుకునా.. హమ్మమ్మా...

    ReplyDelete
  2. అద్భుత పదజాలం
    ఆలస్యమ్మైన అదిరింది.

    ReplyDelete
  3. అణుబాంబులా ఉన్నాయి మీ అక్షర అస్త్రాలు...అభినందనలు పద్మార్పిత/

    ReplyDelete
  4. ఎడారి ఆశల ఎండమావులతో దాహం తీరదు...బాగా చెప్పారు.

    ReplyDelete
  5. అదిఇదీచేయొద్దంటూపదములనురికించేసి
    పలికించినహృదయఘోషమదిలోఇరికించేశావ్
    కదిలించినతీరుఅద్భుతం
    పద్మార్పితవారి కవిత్వం సంచలనాత్మకం!!

    ReplyDelete
  6. అన్నీ పాచిపోయిన పాతదుర్గంధపు ఆలోచనలని క్రొత్త పరిమళాలు అద్దూఅమని చెప్పి అవసరానికి మాయచేసేవారు లోకంలో ఎందరో. ఆలోచనాత్మకమైన పదాలను పొందికగా అమర్చినారు.

    ReplyDelete
  7. కడలి పాతదే కెరటం కొత్త ఒరవడి
    ఆకాశం పాతదే మేఘాలు కొత్త ఒరవడి
    ఊహలు పాతవే ఆలోచనలు కొత్త ఒరవడి

    పాత కొత్తలో వ్యత్యాసం కేవలం కాలగమన మార్పు
    నిన్నటి పాతలో రేపటి కొత్తదనానికై నేటి సంఘర్షణ


    ~శ్రీ

    ReplyDelete
  8. It is hard to understand hard feelings.

    ReplyDelete
  9. మనిషి ముసుగు వేసుకుని బ్రతకడమే జీవితమని పెద్దలు చెబుతుంటారు. అందునా ఇప్పటి కాలం ముసుగులో ఉండాలనే ఇష్టపడుతుంది. మీరు ఎమోషనల్ టచ్ ఇచ్చి వ్రాసినా శృంగారాన్ని జోడించి చెప్పినా నిజాలు అబద్ధాలు కావు. నేటి కాలంలో అబద్ధాలే రాజ్యం ఏలుతున్నాయి కాదంటారా?

    ReplyDelete
  10. సాగర అలపై దీపంపెట్టి వెలుగు చూపుతానంటూ.. అంధకారాజ్ఞానానికి చరమగీతం ఆలాపిస్తానని చెప్పి మమతల దీపాలు వెలిగించాలని అనుకున్నా కొన్నిమార్లు పరిస్థితులు కలిసిరాక కుశలము కూడా అడగలేము. అలాగని మనం ఒక వైపు నుండి మాత్రమే ఆలోచిస్తే అన్నీ నెగటివ్ అనిపిస్తాయి. ఊగే అలలపై సాగే పడవ ఒడ్డు ఎప్పుడు ఎలా చేరుతుందో చెప్పలేము. చాన్నాళ్ళకు ఆలోచించి ఆలస్యమైనా చక్కటి వాక్యాలు పొందుపరిచినావు,,,,ఆయుష్మాంభవః-హరినాధ్

    ReplyDelete
  11. body ki ayina gayam kanna heart ki ayina gayanike badha ekkuva ani cheppinav. heart touching your poetry.

    ReplyDelete
  12. మీరు దేశాన్ని ఉద్ధరించే కంకణం ఎప్పుడు కట్టుకున్నారు? చాలామంది ఆ కార్యక్రమంలో మునిగితేలుతున్నారు. మీరు ఆ వంకతో పోస్టులు వ్రాయడం మానివేసినట్లు తోస్తుంది. అటువంటిది ఏమైనా ఉంటే తక్షణం ఉపక్రమించి యధావిధిగా కొనసాగించండి.

    ReplyDelete
  13. :) :) Laughing & :( :( Crying is called life.

    ReplyDelete
  14. హమ్మయ్య...కంఫర్మ్ చేసుకున్నాం మీ భావాలు ఇంకా బ్రతికి ఉన్నట్లు

    ReplyDelete
  15. మనసు గతి ఇంతే
    మనిషి బ్రతుకు ఇంతే

    ReplyDelete
  16. Very tough to understand.

    ReplyDelete
  17. నిజాలు నిర్మొహమాటంగా చెప్తానంటూ చిందులేసి
    చరిత్ర చదివి చివరకు చావుకబుర్లు చల్లగా చెప్పకు all are like this

    ReplyDelete
  18. sagara alalu vachipoetuntayi
    alage sukhadhukalu cheekati velugu olene
    nice powerful poetry from your end.

    ReplyDelete
  19. బ్రోచేవారు ఎవరు?

    ReplyDelete
  20. jeevitam ento klishtataram
    andulo bandhalu prema anuragalu kapadukovadam bahu kashtam.

    ReplyDelete
  21. పాచిపోయిన పాతదుర్గంధపు ఆలోచన

    ReplyDelete
  22. మది ధ్వంసం
    మెదడు విద్వంసం
    ఇదే జరిగితే..
    జీవితం నాశనం

    ReplyDelete
  23. అర్పిత నమస్సుమాంజలి అందరికీ_/\_

    ReplyDelete
  24. అన్నీ పాచిపోయిన పాతదుర్గంధపు ఆలోచనలంటూ..

    ReplyDelete