బద్మాష్ లెక్కలేస్తివంటే బొక్కలు ఇరగదీస్తరోయ్
శరీరం సలపొద్దంటే నువ్వు సక్కగ ఉండాలోయ్బ
బధ్రంగుండు లేకుంటే బ్రతుకు బస్ స్టాండేనోయ్!
అస్తిపంజరంలో ఎముకలు 206 ఉంటాయిరోయ్
టిబియా ఫీమర్ ఫిబియాలంటే పెద్దబొక్కలేనోయ్
పాతిక ముక్కలు జేస్తినంటే లెక్కపెట్టుకోలేవోయ్!
కంటిసాకెట్ సిన్నదాన్ని చూసి చిందులేసేనురోయ్
కామంతోచూసి కన్నుకొడితివంటే కరుసైపోతావోయ్
కోకిక్స్ ఎముకలా కుదురుగుంటే నీకు మంచిదోయ్!
గుండెను దాచేటి పక్కటెముకలు జర జాగ్రత్తరోయ్
చిన్న ఇంకస్ ఎముక ఇరిస్తినంటే చెవిటోడివేనోయ్
చెత్త చిల్లరి వేషాలు నాకాడేసి బద్నాం కాకుండోయ్!
మెదడు ఎముక క్రానియం కాస్త కష్టతరమైనదేరోయ్
కంత్రీకతర్నాక్ పనులు చేస్తివంటే కుమ్మి పడేస్తానోయ్
నాతో పెట్టుకోమాకు చూర్ణం చూరా అయిపోతావోయ్!
మాండిబుల్ దవడెముక మాటలు జారనీయకురోయ్
వెన్నుపూసనై వెనకుంటా వేలుపట్టుకు నడిపించోయ్
మొండిగ వాదించమాక మనసుతో నన్ను గెలువోయ్!
శరీరం సలపొద్దంటే నువ్వు సక్కగ ఉండాలోయ్బ
బధ్రంగుండు లేకుంటే బ్రతుకు బస్ స్టాండేనోయ్!
అస్తిపంజరంలో ఎముకలు 206 ఉంటాయిరోయ్
టిబియా ఫీమర్ ఫిబియాలంటే పెద్దబొక్కలేనోయ్
పాతిక ముక్కలు జేస్తినంటే లెక్కపెట్టుకోలేవోయ్!
కంటిసాకెట్ సిన్నదాన్ని చూసి చిందులేసేనురోయ్
కామంతోచూసి కన్నుకొడితివంటే కరుసైపోతావోయ్
కోకిక్స్ ఎముకలా కుదురుగుంటే నీకు మంచిదోయ్!
గుండెను దాచేటి పక్కటెముకలు జర జాగ్రత్తరోయ్
చిన్న ఇంకస్ ఎముక ఇరిస్తినంటే చెవిటోడివేనోయ్
చెత్త చిల్లరి వేషాలు నాకాడేసి బద్నాం కాకుండోయ్!
మెదడు ఎముక క్రానియం కాస్త కష్టతరమైనదేరోయ్
కంత్రీకతర్నాక్ పనులు చేస్తివంటే కుమ్మి పడేస్తానోయ్
నాతో పెట్టుకోమాకు చూర్ణం చూరా అయిపోతావోయ్!
మాండిబుల్ దవడెముక మాటలు జారనీయకురోయ్
వెన్నుపూసనై వెనకుంటా వేలుపట్టుకు నడిపించోయ్
మొండిగ వాదించమాక మనసుతో నన్ను గెలువోయ్!
ఎండాలం ఆరంభంలో ఎద వేడి పుట్టించే వాక్యాలు వ్రారు అర్పితగారు. కుడోస్ జవరాలి అక్షరమాలకు.
ReplyDeleteayyooo ayyooo chitakottesinaru
ReplyDeleteఇంతకూ ఇరగ్గొట్టింది ఎవరినో?
ReplyDeleteఇరగ గొట్టబోయేది ఎందరినో?
Solid class to whom dear.
ReplyDeleteకొరడా ఝళిపించి చురకలు పెట్టారు...బాబోయ్ భద్రం బ్రదర్
ReplyDeleteజీవితం చూట్టు ఆశలు అడియాశలు
ReplyDeleteభావోద్వేగాల నడుమ రాగద్వేశాలు
సిర ధమనుల ను దాచే కండర యముకలు
శిథిలమైన అవయవాలకు పెళుసుబారే అస్తిపంజరాలు
ఒకరికొకరై కడదాక మెదిలితే నవరసాలు
కోపోద్రిక్తత కనుమరుగున పడితే అన్యోన్యతలు
అపుడుపుడు నమ్మినా నష్టమే అడపదడప కావలసినా కష్టమే
పేగు బంధానికి విలువ కాటిలో కట్టే కాలే ఘడియ దాక
వేగు చుక్క తళుకు విలువ నిశీధిన మెఱిసే దాక
ఆర్థోపెడిషియన్ మొదలు జెనెరల్ సర్జన్ దాక
చమురు కొండెక్కక మునుపే దీపాన్ని కాపాడే కరములు
తెలిసి తెలియక నడిచే దారిలో అపుడపుడు రాళ్ళు రప్పలు
కాని పాదం ధూళి తాకితే రాయైనా ముక్కలగును ముళ్ళు సైతం పూలగును
కాలమే సాక్షి కాలానికే కష్టాన్ని పరిచయం చేయటం తెలుసు
మరల ఆ కాలక్రమంలో నష్టాన్ని నివారించటం తెలుసు
ఏదేమైన ఈ ఊపిరి లయగతుల లోలకడోలక మనసు మందిరాన
భావాలకు కొదవ లేదు.
~శ్రీత ధరణీ
ఎముకలుండటం గొప్పకాదు
ReplyDeleteలేకుంటేనేగొప్ప
ఆమెచేతికి ఎముకలేదు..ఆమె దానంచేసినట్లు మరెవ్వరూ చేయలేరు.గొప్పదానశీలి!!
ఎముకలచిట్టా.
పెట్టింది కవయిత్రి మహాదిట్ట!!
https://kshatrasahityamblogspot.blogspot.com/2020/02/blog-post_23.html?showComment=1582962389638&m=1#c751414325167790397
ReplyDeleteఓహ్ చితకబాదుతానని నాటుపదాలను నీటుగా చెప్పినారు.
ReplyDeleteఅవునమ్మా! ఆ కోణంలో అర్థం చేసుకుంటే
Deleteఎముకలిరిచేస్తానన్నట్లు అవగతమౌతోంది.
మదిలోని భావాలనుపంచుకున్నది కవయిత్రి ఇలా
కవితాధార బావుంది భావానికితగినట్టుపదాలపరుగులతో
మనిషికి 206 ఎముకలుంటే
ReplyDeleteపాతిక ముక్కలు చేస్తిరి ఒక్కో ఎముకను
లెక్క అక్షరాల్లో తేలుతుందేమో కాని ఎముకలు నుజ్జు నుజ్జు
ఎముకలతో పాచికలు చేసుకుని ఆడుకుంటారు, నేటితరంలో అటువంటివారు జాస్తి. మీరు ఎముకలు విరగ్గోట్టి కూర్చో పెట్టవచ్చని తక్కువ అంచనా వేయకండి. కీడెంచి మేలెంచాలంటే...మనమే జాగ్రత్తలో ఉండడం మంచిదేమో! కొట్టనేల కొట్టి తిట్టించుకోనేల చెప్పండి.
ReplyDeleteనా ఎముకలన్నీ కీళ్లు కీళ్లు విరిగిపోయాయి... పుత్తూరు వెళ్లి కట్టు కట్టించుకోవాలి. .ఈ దెబ్బకు
ReplyDelete
Deleteరండి రండి ఇరవై శాతం డిస్కౌంటిప్పిస్తా ఫీజులో :)
chittadi chittadi
ReplyDeletezinthaka thakaa thkaaaa
హా...చాల రోజులకు మీ మార్క్ పోస్ట్ చూసాం
ReplyDeleteసంతోషం ఇకపై మరిన్ని పోస్ట్లతో అలరించాలని ఆశ.
ఎవడా బద్మాష్? చెబితే నా గన్ తో షూట్ చేస్తా :)
ReplyDeleteతిట్టడాలు విరగ్గొట్టడాలు..మీ తరువాతే అన్నట్లుంది.
ReplyDeleteవామ్మో నేను ఏమిజేస్తిని?????????????????????
ReplyDeleteఎదలో కలిగిన వలపు
ReplyDeleteఎముకల్ని చేసె పిప్పు
Nice counter to teasers.
ReplyDeleteWow its thrill :)
ReplyDeleteOrinayanoe gitlabhi kottetolli unaraa
ReplyDeleteఇరగదీసారు..ఇంతకన్నా ఎక్కువ ఏం వ్రాయలేను.
ReplyDeleteIts amazing..ha ha ha
ReplyDeleteunique poetry
ReplyDelete