అడుక్కుంటున్నా..ఆరుగంటలు నిద్రను దానం చేస్తారా?
ఆశ్చర్యపోకండి..నిజంగానే నిద్రను దేహీఅని అడుగుతున్నా
కుదిరితే ఆరుగంటలు లేదంటే కనీసం అరగంటైనా సరే..
అరగంటా గంటా అడుక్కుంటే కలిపి ఆరుగంటల పైనే కదా!
అడగంది అమ్మైనా పెట్టదంటారని..అడుగుతున్నా ఇస్తారా?
కళ్ళు ఎన్నిగంటలు మూసుకున్నా ఆలోచన్లని అణచుకున్నా
గతం వర్తమానంతో కలబడి భవిష్యత్తుతో బేరం కుదరక..
శరీరం పక్కపై అటూఇటూ దొర్లి పొర్లినా నిద్రపట్టి చస్తే కదా!
అప్పుడెప్పుడో హాయిగా నిద్రపోయా..మరోసారి నిద్రపోనిస్తారా?
నిద్ర నావైపు కన్నెత్తి చూడకున్నా కౌగిలించుకోమని అంటున్నా
మీ దగ్గర మిగిలిన చిన్నా చితకా నిద్రని కాస్త బిచ్చం వేస్తే..
మెదలక మదితలుపులు మూసి ఆదమరచి నిదురపోతా కదా!
అందరూ నిద్ర ఆరోగ్యసూత్రమని చేప్పేవారే..అది ఇవ్వలేరా?
నిశిరాతిరితో రమించి అలసిపోయి వెన్నెల్లో వెల్లకిలా పడిఉన్నా
రానని మారాం చేస్తున్న కునుకుని ఒప్పించి నాపైకి తోస్తే..
నా వ్యధలవేటుకు బలైన నిద్రతో సంభోగమే చేసి తరిస్తా కదా!
Duty lo nidra?
ReplyDeleteSo beautiful Painting
Night duty lo no nidra :)
Deleteనిద్ర లేమి ఎంత భారమో తెలిసినా ఇవ్వలేని దౌర్భాగ్యం. మీరు పైకెళ్ళి వేరెక్కడైనా ప్రయత్నించాలి.
ReplyDeleteఓహ్..మీరు కూడా నాలా నిద్రను దేహీ అని అడుక్కుంటారా?
Deleteమేము కూడా మీవలెనే నిద్ర కరువై కొట్టుకుంటున్నాము. మీకు గుప్పెడు భిక్ష దొరికినచో మాకు చిటికెడు విదిలించవలెనని విన్నపములు. హ హ హా
ReplyDeleteఅడుక్కునే వానికి బుడబుక్కలోడు తోడు అంటారు ఇదేనేమో:)
Delete
ReplyDeleteనిద్ర రా లేదా? జిలేబి పద్యాలను చదవండి :) ఠా అంటూ నిద్ర తన్నుకొచ్చేస్తుంది లవ్వాడుతూ :)
జిలేబి
జిలేబి పద్యాలు చదువుతుంటే
Deleteఒళ్ళంతా జిల్లు జిల్లుమంటది..
చదివేకొద్దీ మరింతగా చదవాలనిపిస్తది
చదువుకుంటూపోతే అంతం ఎక్కడుంది
ఇక నిద్రకు లవ్వుతో పనేముంది చెప్పండి!? :)
మీరిట్లా నిద్రతో సంభోగం చేసేస్తా అని భయపెడితే నిద్ర మాత్రం నిర్భయంగా రాత్రిళ్ళు సంచరించగలదా?!
ReplyDeleteనిద్ర కూడా నాలా నిర్భయురాలే...
Deleteనాలాగే అదీ తోడికోసం వెతుక్కుంటూ నా దరికి వస్తుందేమోనని ఆశ.
మాకు మాత్రం బెడ్ ఎక్కగానే నిద్రాదేవి తన్నుకొస్తుంది.
ReplyDeleteమీరు యమలక్కీ అండీ
Deleteచాలా కాలం అయ్యింది మీ పంధా కవితలు వ్రాసి.ఆలొచనా విధానం మారినప్పటికీ చిత్రం బాగుంది సుమ్మ్\ఆ మంచి
ReplyDeleteమనిషి ఎల్లకాలం ఒకేలా ఆలోచించడు కదండీ!
DeleteNice beautiful Painting
ReplyDeleteThank you Harsha
Deletelove ledu enduku
ReplyDeletenidraku love yendu
Deleteఎన్నో ఎన్నెన్నో నిదురలేని రాత్రులు గడిపిన వైనం ఈ ధేహీ అంటూ అర్ధించడం..అవునానండీ
ReplyDeleteఇది మరీ బాగుంది...ఏదైనా అనుభవిస్తేనే రాయగలం అంటారా?
Deleteకునుకుచేపలంటూ గతంలో వివిధ ఆంధ్రజ్యోతి సాహిత్యపేజీలో లబ్దప్రతిష్టులైన కవిగారి కవిత ..నిద్రపైనే వెలుగుచూసింది.
ReplyDeleteమీ కవిత మాత్రం స్పష్టమైన భావస్ఫూర్తితో హృదయాలను వశీకృతంచేసుకుని ప్రశంసలను గెలుచుకుంది
మీ పొగడ్త నాకు యమ స్పూర్తినిచ్చేసింది. థ్యాంక్యూ.
Deleteగతం వర్తమానంతో కలబడి భవిష్యత్తుతో బేరం కుదరక..అమోఘం.
ReplyDeleteభవిష్యత్తుతో బేరం కుదిరితే భేష్...పండగే పండుగ
Deleteరానని మారాం చేస్తున్న కునుకుని ఒప్పించడం ఎవరి తరమూ కాదు.
ReplyDeleteఅది రానన్నదనే అడుక్కుంటున్నది ఎవరైనా ఉన్నవారు చెబితే వింటుందేమోనని :)
Deleteకునుకు రాని కన్నులు కలత చెంది కన్నీరవగా
ReplyDeleteకనులా నీరే చెంపను తాకేవేళ ఆవిరవగా
మదిలో మెదిలే భావాలన్ని లోలోపలే మౌనం దాల్చగా
ఆలోచనలన్ని అగమ్యగోచరమై హడలిన మనసు ఏమారగా
నిదుర మరచిన కన్నులు అలసిన వేళ అయోమయమేగా
~శ్రీ
కలకలం
Deleteజనారణ్యంలో మునుపెన్నడులేని కల్లోలం
దగ్గు జలుబు జ్వరం
కలిగేను ఏదో ఒక రోజు కనికరం
శానిటైజర్ మ్యాస్క్ పరిశుభ్రత
తగ్గించేను వ్యాది ప్రబలత
ఆయురారోగ్యాలతో వర్దిల్లాలి అందరం
భయం వలదు కలసికట్టుగా పోరాడితే ఆయుర్ధాయం
#CoViD
Nidura Ledhu
DeleteKunuku Ledhu
Manassanthi e Ledhu
Kunukuleka Kallu Saitham Mantapoyenu
CoViD Scare, CoViD based Famine Under making Scare*,
Prapanchamantata Vyaapti Chendina Ee "Pitta Koncham Kootha Ghanam"
kaastha
Bediri Chella Cheduraina Maanavaalini Vadilellali Aayuraarogyaalatho
*assumption only
నిదుర మరచిన కన్నులు అలసిన వేళ అయోమయమేగా...నిజమేగా!
Deleteకలవరపడనేల
కలతచెందనేల
కలవకుండానే..
ఎవరికివారే కర్ఫ్యూకి
కట్టుబడి శుభ్రంగుంటే
కరోనా రాదు చెంతకు
చింత వలదు మనకు!
**Andaroo baagundaali
Andaroo baaguntaamu**
Nidralemi gurinchi lets discuss :)
ReplyDeleteWhy discussion??
DeleteBeware of Corona
And maintain distance :)
నిద్ర బిచ్చం వేసాను
ReplyDeleteనిద్ర పొండి హాయిగా
మీరొక్కరే కనికరించి కునుకునిచ్చారు.
Deleteనీలాల కన్నుల్లో మెలమెల్లగా .. నిదుర రావమ్మా రావే ..
ReplyDeleteనిండార రావే ... నెలవంక చలువల్లు వెదజల్లగా ..
నిదుర రావమ్మ రావే ... నెమ్మదిగా రావే ...
జోలపాట ఎంత మధురమో
Deleteనిదుర అంత కఠినం :) :)
ఆలోచనల్లో మునిగి తేలుతుంటే ఎంత కావాలనుకున్న నిద్ర పట్టదు.
ReplyDeleteఅందుకే ఆలోచించక హాయిగా నిదురపోవలె :)
Deletenidranu melkolpina vidhanam bagundandi
ReplyDeletenaaku niduranu prasadinchamante mealkolpadam eamiti :)
Deleteఅడుక్కుంటే దొరికేది అయితే దేశంలో అడుక్కునేవాళ్ళే ఎక్కువ కనబడతారు పద్మార్పితా.
ReplyDeleteఅదే కదా ఇప్పుడు అడుక్కునే వాళ్ళే అధికమయ్యారని తెలిసింది. అందులో మీరూ నేనూ కూడా :)
Deleteవ్యధలవేటుకు బలైన నిద్రతో సంభోగమే చేసి...outstanding
ReplyDeleteఏమో...అలాగైనా నిద్ర వస్తుందని ఆశ.
Deleteనాయనా పద్మార్పితవారూ..ఇంకా నిద్రకోసం పోరాడుతున్నావా తల్లీ..
ReplyDeleteనిదుర రాకపోవటం వలనమిగిలిన సమయాన్ని సద్వినియోగంచేసుకుని మీరుమాకో అమృతతుల్యమైన కవితనందిస్తారని ..నేనైతే ఎదురుచూస్తున్నా..
ఎందుకంటే..బ్లాగుల్లో మంచి కవిత అంటే మీ కలం నుండి రావాల్సిందే..అంత..విశిష్టమైన కవితాభావంశైలి మీది..కరుణించండి.మీరు.స్త్రీలో పురుషులో నాకు అనవసరం..కానీ మంచి కవిత్వం మాత్రం మీ సత్త్వం!!
అయ్యా మీరెవరూ..నిద్రపట్టక నా ఆలోచనలు పరిపరివిధముల ప్రయాణించగా..దాని పర్యవసానమేగా నా ఈ భావాలు వాటి అక్షర రూపాలు..
Deleteమీ అందరి అభిమాన స్పందనలు నాకు ఎంతో ఉత్సాహం అదే నా తోడూ నీడా..మీరు చదువుతూ ఉండంది నేను రాసేస్తూ ఉంటాను...నన్ను అమ్మాయ్ అనండి చాలు...ఎందుకంటే నేను అచ్చంగా అమ్మాయినే అందునా పద్మార్పితను ధన్యవాదాలు.
నిద్రతో సంభోగం ఏమిటి నా తలకాయ?ప్రతి అడ్డగాడిదా శెభాష్ శెభాష్ అంటుంటే స్వయంతృప్తి పెరిగిపోయిందా ఏంటి!
ReplyDeleteతలకాయని ఎందుకు పాపం మధ్యలోకి తెస్తారు..
Deleteసంభోగం అంటే కేవలం సెక్స్ అనే ఎందుకు అనుకోవాలి? నిద్రపట్టాలేగాని దాన్ని అంతర్లీనంగా ఆలింగనం చేసుకుని హాయిగా నిదురపోతాను అంటున్నాను అనుకోవచ్చుగా..
శభాష్ అన్నవాళ్ళని అడ్డగాడిదలు అంటే పాపం వాళ్ళు ఛీ అన్నవాళ్ళు ఛింపాజీ ముఖాలు అంటే బాగుండదు కదండీ!
ఎవరి తృప్తి వారిది..అందరికీ అన్నీ నచ్చవుగా!
నిద్రంటూ పట్టాక ఇంక అంతర్లీనాలూ ఆలింగనాలూ అవసరమా?ఏదో ఒకటి రాసెయ్యాలి, ఏదో ఒకలా తప్పుల్ని సమర్ధించుకోవాలని కాకపోతే!
Deleteనిద్రనైనా కాకపోతిని
ReplyDeleteమాటలు నేర్చారు!!
Deleteఈయన (విష్వక్సేనుడు) సెటైర్ వేయడంలో దిట్ట..ఎందుకో ఆలస్యంగా వచ్చారు.
Delete@ విష్వక్సేనుడు వినోద్ జీ..అబ్బా ఆశ దోస అప్పడం☺️
Delete@ సూర్యగారు..వినోద్గారికి మాటలు కొదవనా😀
@ నీహారికగారూ..మీకు తెలియని విష్వక్సేనులవారా!!!😊
నిద్రించడం ఒక భోగం. నిద్ర పట్టడం ఒక యోగం. కునుకు పట్టక పోవడం ఒక రోగం.
ReplyDeleteనిజమ...ఇది ఒక రోగమే
Deleteపడుకున్న వెంటనే నిద్ర బాగా రావాలంటే పుస్తక పఠనం బాగా సహకరిస్తుంది ట్రై చెయ్యండీ.
ReplyDeleteపుస్తకం పట్టుకుంటే నిద్రపట్టేది స్కూల్లో సంగతి😂
Deleteప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవరంటే ఎక్కడ పడుకున్నా గాఢంగా నిద్రపోగలిగినవాడే. ఆధునిక యుగంలో నిద్ర కూడా బంగారమైపోయింది. నిదంక లేమితో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. లేనివాడు యాచించినా భిక్ష వెయ్యలేడు.
ReplyDeleteసింపుల్ గా నిజం చెప్పి చేతులెత్తేశారు.
Deleteమీ నిద్రకు మీరెవరో తెలియనట్టుంది
ReplyDeleteఅది మీతో ఆడుకుంటుంది
మీకు నిద్ర శాపమైనట్టుంది
అందుకే అది మిమ్ము చూసి నవ్వుతుంది
మీరు ఇదే విధంగా అడుక్కుంటే
మీ బ్రతుకు దుర్లభం అవుతుంది..
అయ్యబాబోయ్ అలా శపించేస్తే ఎలాగండి.
Deleteరాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం..నిద్రించడానికి నాలుగు గంటల ముందు వ్యాయామం చేయడం వల్ల కూడా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.
ReplyDeleteప్రతి ముగ్గురిలో ఒకరు ఈ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అయితే చాలా మంది ఏదో కారణంతో నిద్ర రావడం లేదని భావిస్తుంటారుగానీ.. నిద్రలేమితో బాధపడుతున్నట్లుగా గుర్తించలేరు. ఎందుకంటే ఈ సమస్య ఒక్కో వ్యక్తిని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిలో ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా అలసిపోయినా సరిగా నిద్ర రాకపోవడం, మగత నిద్ర, పడుకున్నా కూడా మాటిమాటికీ లేవడం, శరీరం పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నా మెదడులో ఏవో ఆలోచనలు కొనసాగుతుండడం. నీది ఖచ్చితంగా అతిగా ఆలోచించడమే.
ఏమీ ఆలోచించకపోతే అడుక్కోవలసిన అవసరం రాదు నిద్రను.
గురువుగారూ.. మీరు ఇప్పుడు కూడా పాఠ్యాంశాన్ని భోధిస్తున్నట్లే ఉంది.
Deleteచాలా బాగారాస్తారు మీరు
ReplyDeleteథ్యాంక్యు
Deleteశాస్వితంగా నిద్రపోయేలా ఉంది లోకం
ReplyDeleteఎటుచూసినా కరోనా వైరస్ ప్రజ్వలింపులే
జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు
అదో మనమో ఎవరో ఒకరు ఒడిపోవాలిగా..
Deleteమేము కూడా అడుక్కునే పరిస్థితి ఇప్పుడు కరోనా కలవర పెడుతుంటే నిద్ర కరువైంది.
ReplyDeleteఅందరూ అడుక్కుంటే ఎలాగండీ.
DeleteSo nice
ReplyDeletethank you
DeleteSleep well
ReplyDeleteOh..sure
Deletewow amazing thoughts
ReplyDeleteExcellent One
ReplyDeletethank Q
Deleteనిద్ర పట్టిన వారు అదృష్టవంతులు
ReplyDeleteఎందుకు పట్టలేదో తెలుసుకున్న వారు జ్ఞానులు.
దురదృష్టవంతుల్లో ముందు
Deleteజ్ఞానుల్లో చిట్టచివరా ఉన్నది నేనే
హైక్లాస్ యాచించడం అంటారు.
ReplyDeleteఅంతేగా
DeleteSleepless nights are terrible dear.
ReplyDeletewell experience :)
Deleteఎంతందంగా అడుక్కున్నారు
ReplyDeleteఅడుక్కోవడం కూడా ఒక కళ.
DeleteVery nice post
ReplyDeletethank you
Deleteso lovely imagination
ReplyDeletethank you
Deletethank you
ReplyDeleteSimply superb
ReplyDeleteSuper
ReplyDeleteExcellent narration
ReplyDeleteSuper..
ReplyDelete