కులం కంపులో పొర్లి అక్కడే దొర్లుతూ
రోడ్డుపై కాళ్ళు కడుక్కుని శుభ్రపడటం
ఇంట్లో తిని వీధిలో ఏరగటం ఏమో..
ఇంటిని ఉద్దరించక ఊరినేం ఉద్దరిస్తారో!
తిన్నాం పడుకున్నాం లేచాము అంటూ
ఎవరికివారే స్వార్థపు శ్వాసతో బ్రతకటం
వారి పెంట వారే వాసన చూడ్డమేమో..
మనకంపు ఎదుటివాళ్ళెలా భరించగలరో!
మతమలినం మనసుకు పులుముతూ
మతాన్ని మనువాడి నీతులు చెప్పటం
మన మలము మనం తినటం ఏమో..
తనది కడ్డుక్కోక వేరొకరిదేం కడుగుతారో!
దేవుడూ లేడు దెయ్యమూ లేదు అంటూ
గాలికి ఊడిపడ్డామని చెప్పుకు తిరగటం
నిడారంబర నాస్తికత్వానికి నిదర్శనమేమో..
పంచభూతాలను సృష్టించిన కర్త ఇంకెవరో!
Wonderful message given in poetic way...kudoos
ReplyDeleteThank you Vanajagaru.
DeleteTalava koodadu anukuni talachukune varilaa janam kuda vaddu vaddu antoone talachukuni rasuku poosukuntaru. ide manushula naijamu. binnamaina subject bagundi.
ReplyDeleteKulam matam anevi vaddanna antukune gajji anipistundi.
Deleteరాష్ట్రంలోనే కాదు దేశమంతా కుల-మత రాజకీయాలే చూస్తున్నాం. ఏ కులంవారు ఎంత కృషిచేసినా అంతిమంగా అన్ని కులాల మద్దతు ఉన్నవారే అధికారం చేజిక్కించుకుంటారన్నది వాస్తవం. ఇవి అన్నీ కూడా రాజకీయ నాయకుల ఎదుగుదలకే కానీ సామాన్యమానవులకు ఏ విధమైన లబ్దిని కలిగించదు అనేది వాస్తవికత.
ReplyDeleteఅందరు కులాలను తిట్టే వారే ? మన దగ్గరినుండి కుల పట్టింపులు మానేస్తే మార్పు రాదా !
manasa భారతీయ సమాజంలో కులం కంపు నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రాచీనకాలం నుంచి ఆధునీక కాలం వరకు అదే తీరు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన వారి మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. కులం పిచ్చితో ఉన్మాదులుగా మారుతున్నారు. టెక్నాలజీతో అంతరిక్షంలో అడుగు పెడుతున్నా ఇంకా కులం గోడాలను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. మనము వద్దు అనుకున్నా కులం మనల్ని విడిచిపెట్టదు. రిజర్వేషనులను ఎత్తివేసి అప్లికేషన్స్ లో కులం కాలం తీసివేయాలి అప్పుడు కొంత వరకు బాగుపడుతుందేమో.
DeleteRamprasadgaru...మీరు వ్రాసింది నిజమే అయినా...manasagaru చెప్పిన విధంగా ఆలోచించడం కరెక్టు అనిపిస్తుంది. ఏదైనా మార్పు మన నుండి మెదలవ్వాలి అనేది నేను కూడా సమర్ధిస్తాను.
Deleteఅందమైన చిత్రానికి అనుగుణంగా అనురాగ హరివిల్లులాంటి అక్షరాలు వ్రాయక ఎందుకు చెప్పండి ఈ కులమతాల పై వాదోపవాదాలు.
ReplyDeleteఎప్పుడూ ప్రేమ ప్రేమా అంటూ ప్రాకులాడ్డం ఎందుకని ఎందరో చెప్పింది విని ఇలా...
Deleteఅక్షరాలు ప్రక్కదోవ పట్టినట్లు ఉన్నాయి.
ReplyDeleteఇంకా నయం నేను ప్రక్క దోవ పట్టాను అనలేదు:)
DeleteTHINK
ReplyDeleteThink
think
thinking
Deletethinking
thinking
ఏ రంగంలో అయినా కులాల కంపు మామూలుగా ఉండదు. అది రాజకీయం అయినా..సినిమాలు అయినా మరొకటి అయినా అన్నీ కులాలతో కంపు కొట్టేస్తోంది. ఇది ఈ ముఖపుస్తకంలో కూడా ఎగబ్రాకింది...ఇక చెప్పుకోడానికి ఏముందని.
ReplyDeleteమీరు కూడా ఆ కంపులోనే ఉంటే కష్టం కదండీ.
Deleteanavasaramaina vishayala joliki velithe addam book avutamu :)
ReplyDeleteammo...nannu alert chestunnaaraa :)
Deleteరూట్ మార్చారు ఏమిటో విశేషం వింత?
ReplyDeleteనా రూట్ ఎప్పుడూ సెపరెట్ :)
Deleteనిడారంబర నాస్తికత్వానికి నిదర్శనమే
ReplyDeleteనిదర్శనం చూపనిదే నీడ సాక్ష్యాన్ని కూడా ఎవరూ నమ్మరుగా..
Deleteస్థాయిని చెప్పుకోవడానికి కులాన్ని/మతాలను వాడుకునే సమాజం మనది. నేను ఫలానా అని చెప్పాలంటే చేసే పనిని కాకుండా, కులం పేరును అర్హతగా వాడుకుంటూ పబ్బం గడుపుకునే లోకంలో జీవిస్తూ ఇక వీటిపై చర్చించటం అనవసరం ఏమో ఆలోచించండి. ప్రేమ గురించి వ్రాసేమీరు ఇలాంటివి వ్రాస్తే మీ అభిమానులు హర్షించరు పద్మార్పిత.
ReplyDeleteనిజమైన టాలెంట్ ఉన్నవారికి ఏ ఫ్రూఫ్ లు రికమండేషన్లు అక్కలేదని నేను అనుకుంటాను.
Deletekulam matam evarini uddarinstayi
ReplyDeleteprema abhimanam anuragam chupinchi
rayandi madam...photo adurs.
pream abhimanam matram evarini uddaristayi cheppandi. :)
Deleteఆచో వియ కేలేన్ లకీ వీస్ పద్మ.. పణన్ అసల్ ఆచ్చో ఛేయి.. అసోయి లకగ కూణీ.. మన యాన్ లాగోకోని.. సే హూయే జకో కన్నాయి కన్నాయి దగరజావచ.. సే మనక్యా హను కేలేనజ్ బంచణు..అత్రాజ్.. అజ్జేక్ వణా కేరోచూఁ అసల్ ఆచ్ ఛేని మ్యాడమ్ తమార్ ఈ కవిత.. కాఁయి కేలేర్ ఛేంతి
ReplyDeleteదీని అర్థం ఏమిటి?
DeleteSridhargaru...అందరికీ అర్థమయ్యే భాషలో వ్రాస్తే మిమ్మల్ని ఇలా అడుగరు కదండీ....
Deleteనిజమే సుమండి పద్మ గారు.. ఐతే పై వ్యాఖ్య కు బదులివ్వటం జరిగింది..
Deleteఎవరినో ఎత్తిపొడుస్తున్నట్లు ఉంది.
ReplyDeleteనన్ను నేనేమో అనుకుంటే పోలా :)
Deleteభారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ కుల వ్యవస్థలో భారతీయ సమాజం వర్గ సమూహాలుగా, తరగతులుగా విభజింపబడుతోంది.సంస్కృతిపరంగా , నాగరికత ఎంతగా ఎదిగినప్పటికినీ ఇంకను మన సమాజంలోకుల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మతాల పరంగా ప్రభావం కూడా అధికమే అని చెప్పుకోవచ్చు.
ReplyDeleteఅవును లెస్స మాటలు.
Deleteదేవుడూ లేడు దెయ్యమూ లేదు evaru annaru?
ReplyDeleteadi unte idi untundi :)
Deleteకులం కులం అంటూ పంతాలు పెంచుకోకు
ReplyDeleteమతం పేరిట మంతనాలు జరిపి మారణహోమం సృష్టించకు
మనిషివి అయినందుకు మానవత్వంతో బ్రతుకు...
"బ్రతుకనేదే మూడు నాళ్ళ ముచ్చట (బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం). ఈ మూడిట నలిగి సాన పడుతు ఉండటమే జీవితం. ఇందోలు కలహాలు విభేధాలు సృష్టించి. ఉన్న కొద్ది జీవిత కాల వ్యవధిని చేజేతుల నాశనం గావించటం మంచికీ హేతుక కాదని నా అభిమతం పద్మ గారు. పదాల అల్లికలో దోషం లేదు. అర్థం వ్యర్థం కాకుండ ఉండటం మంచికి నిదర్శనమే కదా మ్యాడం గారు" అనేదే నా పై వ్యాఖ్య తాత్పర్యం గులుగు గారు.
Deleteపైపెచ్చు నానాటికీ సన్నగిల్లుతున్న మానవీయ బంధాలపై ఘాటుగానే సిరను ఒలికించి కలాన్ని ఝళిపించారని టుకీగా
Gulugu garu.మంచి మాట చెప్పారు.
DeleteSri[dharAni]tha మీ కమెంట్స్ విశ్లేషణా నాకు నచ్చింది. థ్యాంక్యూ
Deleteఅవసరమా అనిపించేలా ఉంది.
ReplyDeleteకొందరికి అవసరం ఏమో...
Deleteనిజమే ఎవరి కంపు వారికి ఇంపు.
ReplyDeleteఒప్పుకున్నట్లేగా..
Deleteకులం మతం మనకు జాఢ్యాలు
ReplyDeleteఅవును అనిపిస్తుంది ఒకోసారి...ఎంత పట్టించుకోక పోయినప్పటికీ
Deletekonni words hard to digest.
ReplyDeleteoverall bagundi.
thank you
Deleteఎందుకంతటి ఆవేశం మీలో.. పరిష్కారాలు చెప్పండి.
ReplyDeleteపరిష్కారం చెప్పేంత జ్ఞానిని కాను...అలాగని అన్నింటినీ అజ్ఞానం ముసుగులో ఆచరించను. నా వరకూ నాకూ ఎటువంటి కులమత పట్టింపులూ లేవు అసలు అవి ఉన్నాయనే విషయం కూడా మరచి ప్రేమతో బ్రతకాలి అనుకుంటాను...అలాగే బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడూ మనం వద్దన్నా సమాజం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఇటువంటివి...అప్పుడు ఆవేశం చెంది రాసుకునే నా భావాలు.
Delete