అవిటి ఆలంబన

నిశ్చింతగా నిదుర పోలేని ఇద్దరమూ..
సమయాన్ని సవాలు చేసి కలువబోయి
విశ్రాంతి ఎరుగని హృదయాలను విడగొట్టి
రాసుకున్నదేమిటో పూసుకున్నదేమిటో!?

పశ్చాతాపపడని మన గుండెలు రెండూ..
మనస్పర్థలకు స్థానమీయక సర్దుకుపోయి
భారమైన భావాలను కనపడనీయక చుట్టి
ఎప్పటికీ విడిపోలేమన్న ధీమా ఏమిటో!?

నిర్దయకాలాన్ని నిలదీయలేని మనమూ..
తటస్థంగుండాలని సముదాయించుకోబోయి
ఒకేదారిన ఎదురెదురుగ అడుగువేసి ఢీకొట్టి
నిదురలేని కళ్ళకి కలలుచూపడం ఏమిటో!?

నేతనేసిన ఆశలు తీరవని తెలిసీ ఇద్దరూ..
బ్రతికి ఉన్నామన్న భ్రమను మభ్యపెట్టబోయి
నీరుగారిన నమ్మకము నాచుపడితే గిలక్కొట్టి
ఒంటరిని చేసి తోడు ఉన్నాననడం ఏమిటో!? 


17 comments:

  1. కాలముతో ఎవరూ చలగాటం ఆడలేరు,,,,
    చాలా రోజులకు మరో వేదనాభరిత కవితతో.

    ReplyDelete
  2. Deepest solo feelings I think. Nice blog to watch.

    ReplyDelete
  3. మనస్పర్థలకు స్థానమీయక సర్దుకుపోయి...సర్దుకుపోవటం అనేది అందరికీ సాధ్యం కాని పని.

    ReplyDelete
  4. Padmarpita ji...virahamoe, vedanoe, reamanoe, edoe okavrayandi antea kani maneste elaa?

    ReplyDelete
  5. ఎదలోని గుట్టును అక్షరాల్లో పెట్టారు.

    ReplyDelete
  6. రాసుకున్నది చెరిగిపోదు.. పూసుకున్నది చెరిపినా పోదు..
    కలకాలం కాలానికీ పోటి పడలేము.. కాలాతీతమై నిలువజాలము..
    కునుకు పడక ఎఱ్ఱబడ్డ కనుపాపలు.. నిదురే లేక వసివాడిన కన్నులు..
    గ్యటి గ్యమణ్యం టెళ్సిణ మణిసికి.. ఆచలు ఖోరికెళ మణుసుకి లంకె కట్ట గ్యాలమ్య ఎపటికి..

    ఇరహ యేదన కొట్టి ఒచ్చినాగున్నాది అమాంతం మీ కవితలో పడ్మ్యా గార్

    ReplyDelete
  7. Life yevvarikee urike radu..andulo godavalu kotlatalu tittukovatam enduku andaru navuthoo unnanta varak happy ga undalianukune policy ni adopt chesukunte manchidi kada ani. specilly premaokkari paina chupiste adi pain andari paina chupinchadamu appudu universal love never harm anyone.

    ReplyDelete
  8. ఈ వేదనకు అంతం లేదు.

    ReplyDelete
  9. నీరుగారిన నమ్మకము?

    ReplyDelete
  10. వ్యధలను అక్షరాల్లో పొందు పరచినంత సులభంకాదు మరచిపోవడం అనిపిస్తుంది మీ పోస్ట్ చదువుతుంటే.

    ReplyDelete
  11. విశ్రాంతి ఎరుగని హృదయాలను విడగొట్టి-NICE

    ReplyDelete
  12. రాసేసారు...ఇంక నిశ్చింతగా నిదురపొండి.

    ReplyDelete
  13. పశ్చాతాప పడిన గుండెలు రెండూ..ఎప్పుడూ భారమే కదా

    ReplyDelete
  14. Padmarpita garu are you okay?

    ReplyDelete
  15. Madam no postings and no reply for my message.
    Are you OK?

    ReplyDelete
  16. LIFE IS BLANK WITHOUT YOUR THOUGHTS...SO BE ON LINE ANGTHING :)
    WRITE
    WRITE
    WRITW
    WRITE
    WRITE
    WRITE :) :) :) :)

    ReplyDelete