నీతో ఉంటా!

ప్రతీదిక్కూ వెతికే నీకు సమూహాన్న ప్రత్యేకమై
ప్రేమతోపలుకరించి అపురూపంగా చూసుకుంటా!

మతిలేని నా మది నీ చుట్టూనే పరిభ్రమిస్తున్నా
అది నీకు తెలిసినా తెలియకున్నా నిన్నంటుంటా!

అలజడి అంబుధిలో మునిగున్న నీకు ఆధారమై
ఆశగా పట్టుకుంటే విదిలించక ఒడిసిపట్టుకుంటా!

అంధకార పయోధిలో చిక్కున్న నీకు కాంతిరేఖనై
కంటిపాపలకే తెలియనట్లు నీ కంట్లో కొలువుంటా!

చింతల సాగరంలో మునిగిన నీకు చిరుహాసంమై
నిట్టూర్పులంటినీ నెట్టివేసి నవ్వుగా నిలచిఉంటా!

నీ చేష్టలకు విసిగి వేసారిపోయి ఊపిరి ఆడకున్నా
ప్రాణవాయువై పదిలంగా నిన్ను చుట్టేసుకుంటా!

కలల కడలిలో తేలియాడియే నీకు స్వప్నపుంజమై
కలత నిదురలా కాక నిశ్చల నిదురనై నీలోఉంటా! 


19 comments:

  1. యెడబాటు మనలేని జత
    మనషుల నడుమనే కత

    రేపటి ఆశల వీచిక
    నేడు అడియాశలతో పోరుక

    కదిలే కాలానికి ప్రత్యామ్నయం
    మనకు మనమే సాగించాలి సంయమనం

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. Amidst the Tempest, with High Seas, Torn Sail and Broken Oars, The Sailor Continued his Detrimental Voyage, as he had no optimal choice left.

      Delete
  2. నాతో ఉంటే చాలు.... ❤️❤️❤️

    ReplyDelete
  3. ఇన్నాళ్ళు మాయమైపోయి...ఇప్పుడు నీతోనే ఉంటానని పరకాయ ప్రవేశం చేస్తారా ఏవిటీ

    ReplyDelete
  4. నీతోనే ఉంటాను నీకోసం ఉంటా అని అప్పుడు ఎందుకు చెప్పావు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగవలసింది. ఇలా వదిలివేస్తె ఎలా?

    ReplyDelete
  5. ఏది అధిక మొత్తంలో ఉండరాదు
    అది ప్రేమ అయినా ధ్వేషం అయినా
    మనకే ముప్పు అలాగైతే

    ReplyDelete
  6. Padma...Love research product this is.
    Nice pic and presentation.

    ReplyDelete
  7. ఇన్నాళ్ళు మాయమైన భావాలు నేను చిగురించే... అద్భుతం

    ReplyDelete
  8. అంధకార పయోధిలో చిక్కున్న నీకు కాంతిరేఖనై
    కంటిపాపలకే తెలియనట్లు నీ కంట్లో కొలువుంటా!
    అద్భుత పంక్తులు పద్మార్పిత.

    ReplyDelete
  9. కలల కడలిలో తేలియాడియే స్వప్నపుంజం

    ReplyDelete
  10. mee pada panktulu mee perulage adbhutam

    ReplyDelete
  11. మనసుక్ మతి ఉండదుగా అందుకనే పరిపరి విదాలుగా ఆలోచించి పప్పులో కాలువేస్తుంది.

    ReplyDelete
  12. మతిలేని నా మది

    ReplyDelete
  13. కలల కడలిలో..adurs

    ReplyDelete
  14. ప్రేమ భావం పొంగిపొర్లిన వేళ

    ReplyDelete
  15. నమస్సులు _/\_

    ReplyDelete