మార్పు తప్పక వచ్చునని కనురెప్పలాడించి
కొత్తకోరికలను పాత అందాలతో ముస్తాబుచేసి
వసంతంలో వర్షం కోసం ఎదురుచూడ్డం కదా?
కోకిలలన్నీ పావురాలుగా మారి ఆకశాన్నెగసి
ప్రేమలేఖల్లోని అక్షరాల్ని రాయబారం అందించి
వాడిపోయిన వలపుసెగను వింజామరతో రాజేసి
మండుటెండలో మంచుముద్దని కోరినట్లు కదా?
గాలితెమ్మరలు ఋతువులన్నిటితో బాసట చేసి
పువ్వుల్లో దాగిన తీపిని తేనేపట్టుగా రంగరించి
జుర్రుకోకుండా జారిపోరాదంటూ మైనంతో మూసి
కాగడాతో కాల్చి కరిగిపోకనడం అన్యాయం కదా?
నిర్జనమైన వనంలో పరిమళ పుష్పాలను చూసి
అందమైన లోకమన్నాదని ఆస్వాదించి రమించి
వికసి విప్పారినంతకాలం దగ్గరుండి ఆపై విసిరేసి
నేలరాలిన పుప్పొడితో సంపర్కం కుదరదు కదా?
నేలపై రాలిన పుప్పడి రేణువులతో సంపర్కం సంభవం కాదని అద్భుత మర్మరహస్యాన్ని చెప్పారు.
ReplyDeleteనిగూఢ అర్థం జనించిన కావ్యచిత్రం.
అనంతభావాలు మీ సొత్తు
ReplyDeleteవాటిని దాచి ఉంచకండి.
ఒక్కో లైను ఒక్కో జీవిత సారం... శబ్బాష్
ReplyDeleteartham chesukune knowledge ledu
ReplyDeletebomma lo pain kanabadutunnadi
కొత్తా పాతల కలసి కవిత..ఎంతో భ్యవమైన భావన .
ReplyDeleteజీవితం ఓ పడవ ప్రయాణం
ReplyDeleteకొత్త దారులు కనబడాలంటే పాత దారి గుండానే పయనం
ఒక్కోసారి రాగద్వేషాల అల్లకల్లోలం ఒక్కోసారి భావోద్వేగాల గందరగోళం
కొత్త పాత నడుమ జీవితం
ఔపాసన పెట్టుకునే సాధనం
ఆశ అడియాశ నడుమన విభేదం
హై లెస్.. సో ,లే లో.. హై లెస్ సా..! High Less.. So, Lay Low.. High Less Saw..!
DeleteAnd the Tides Started Flowing High and Low through Crests and Troughs.. So is Life.. In its ups and downs.. amidst happiest moments and frowns..!!!
ఎన్నో రోజుల తరువాత ఎద కవాటాలు తెరచినట్లున్నారు.
ReplyDeleteఅంతరంగ భావాలు సున్నితమైన వాక్యాలే అయినా మనసుని ఘాటుగా తాగే విధంగా వ్రాస్తావు.
ReplyDeleteanta chadivina artham kani prashna meru.
ReplyDeleteమాయమైన భావకెరటాలు మళ్ళీ ఎగసి పడినట్లు ఉంది.
ReplyDeleteఇంతకు ఏమైపోయినారు ఇన్నాళ్ళు???????
Ela unaru Padmarpita?
ReplyDeleteసులభంగా
ReplyDeleteఅర్థ్మయ్యేలా
డైరెక్ట్ వాడుక భాషలో వ్రాయండి.
జుర్రుకోకుండా జారిపోరాదంటూ మైనంతో మూసి
ReplyDeleteకాగడాతో కాల్చి కరిగిపోకనడం అన్యాయం కదా?
well questioned.
manishi eppudu enduku ela maratado cheppadam kashtam.
ReplyDeleteనేలరాలిన పుప్పొడితో సంపర్కం కుదరదు? :)
ReplyDeleteకొత్తకోరికలను పాత అందాలతో ముస్తాబు చేసి అందమైన భావఝరి.
ReplyDeleteక్రొత్తా పాత అందాల మేలు కలయిక కదా జీవితం అంటే...చాన్నాళ్ళకు వ్రాసి మెప్పించారు.
ReplyDeletekota aina pata aina love always gives pain.
ReplyDeleteprema vaddu pelli no ante anta happy.
Life is always complicated.
ReplyDeleteKirikraaaQQQ
ReplyDelete
ReplyDeleteస్పందించిన ప్రతి హృదయానికీ వందనములు_/\_