నీ రోగం కుదుర్చుకో...

జీన్స్ ప్యాంట్లో నొక్కబడ్డ పిర్రల్ని చూసి పిచ్చెక్కేస్తుందని
జాకెట్ హుక్కుల మధ్య రొమ్ములు బిగుసుకున్నాయని
చీరకట్టులో వంపుసొంపులు వద్దనుకున్నా పదిలమేనని
చుడీదారు వేసి చున్నీ చుట్టుకుంటే చూడ్డానికేం లేదని
మిడ్డీలు వేసినా జబ్బలషర్ట్ చూసినా బాడీషేక్ అవునని
లంగా జాకెట్టు పై పైట కప్పుకోకుంటే పై ఎద పొంగునని
బికినీబాడీలు భారతీయ సంస్కృతి ఎంత మాత్రం కాదని
మ్యాక్సీలు రాత్రుళ్ళు వేసుకుని ముడుచుకు పడుకోమని
స్త్రీ వస్త్రధారణపై వెయ్యినొక్క వ్యాఖ్యలు వల్లించే వీరులారా
చూస్తేనే కారిపోయేంత వీక్ అన్నమాట మీ వీర్యకణాలు!

నిండుగ చీరకట్టి నుదుట బొట్టు పెట్టుకుంటే పత్తిత్తులని
ప్యాంటుషర్టు వేసుకుని బయటకు వెళితే పోరంబోకుదని
కాళ్ళకు మెట్టెలు మెడలో మంగళసూత్రాలే ముత్తైదువని
ఆడది ఎప్పటికీ తానుగా ఉండకూడదా అలంకరించుకుని
ఇంటిపట్టున వండి వడ్డిస్తే ఆమెను ఆహా గొప్ప సతి అని
బయట పనిచేసి ఇల్లు చక్కబెట్టుకున్నా బరితెగించిందని
పాటుపడే దానికన్నా పరాన్నజీవైన పెళ్ళామే బెల్లామని
తెలివితేటలే కాదు అన్నిటా ఆమె ముందున్నా అదిదని
మాట్లాడ్డమే మగతనం అనుకునే మెండైన మగవాళ్ళారా
చూసేచూపు ఆలోచనా ధోరణి మార్చి సర్దుకో నీగుణాలు!

22 comments:

  1. రెబల్ పోస్ట్ /\

    ReplyDelete
  2. పచ్చి నిజాలు పరిపక్వ పదాల్లో.

    ReplyDelete
  3. అంతా నేరం మగవాళ్ళదే అంటే ఎలాగండీ.
    ఆడవాళ్ళకు ఆడవాల్లే శత్రువులు కాదంటా?

    ReplyDelete
  4. అందరూ ఒకేలా ఉండరు. అయినా మీరు వ్రాసింది పూర్వకాలం మాటలు ఇప్పుడు ఎవరూ ఏవ్వరినీ లెక్కపెట్టటంలేదండీ.

    ReplyDelete
  5. అబ్బా... కొట్టావుగా దెబ్బ!!
    దెబ్బకి వీర్యకణాలు వణికిపోయాయి 😁

    ReplyDelete
  6. ఈ ప్రశ్నలు కేవలం మగవారినే కాదు ఆడవారిని కూడా అడిగితే బాగుంటుంది కదా పద్మార్పితా.

    ReplyDelete
  7. inta ghatuga cheppavalasina enta undo alochinchandi.
    Vastralu vesukovadam samkrutiki chihnam ga undali kada

    ReplyDelete
  8. మగాళ్ళు అందరూ అంతలా దిగజారలేదు పద్మగారు.

    ReplyDelete
  9. ఆడది ఎప్పటికీ తానుగా ఉండకూడదా అలంకరించుకుని...అదే కదా?

    ReplyDelete
  10. సంస్కృతీ సంప్రదాయాలను మంటగలిపే వస్త్రధారణ అమ్మాయిలకు అవసరమా. పిచి పోకడలతో వెర్రి వేషాలు వేసే నవతరానికి బద్ధి చెప్పండి అంతే కానీ నువ్వు మారు నేను ఇలగే ఉంటాను అని చెప్పే రాతలు ఎందుకు.

    ReplyDelete
  11. “నాగరికత సమాజానికి నేర్పిన మొదటి అంశం వస్త్రధారణ. ఆధునికత పేరుతో వస్త్రధారణ రోజురోజుకి విపరీతధోరణులు పోతూండడంతో అవి కవ్వింపు చర్యలుగా మలుచుకొంటున్నాయి. చెప్పిన మాటలు ఒక్కోసారి వికటిస్తాయి. పాపం ఓ మంత్రిగారు ఈ మాటని అని కోరి తద్దినం తెచ్చుకొన్నారు. మహిళా లోకం ఆయనగారి మీద దివి సునామీలా విరుచుకు పడింది.

    “పాపం మహిళాలోకాన్నీ నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే వెర్రిమొర్రి వస్త్రధారణ కేవలం సినిమాలకే పరిమితం. బాహుమూలల, నడుమువంపుల, ఊరువుల, ఎదలోయల బహిర్గతాలు, చిత్రవిచిత్రమైన ఉరోజ కంచుకాలూ చలనచిత్ర నాయికలకు కోట్లు సంపాదిస్తున్నాయి. కథాబలం లేక చిత్రాలు డింకీలు కొట్టినా నిర్మాతలకు నాలుగు రాళ్ళు దొరికేవి వీరిమూలానే! ప్రేక్షకుల యావ తీరేదీ వీరిమూలానే! ముంబైలో చలనచిత్రాలకు సంబంధించిన కుడ్యచిత్రాలను పేడముద్దలతో కొట్టి మహిళలు పలుసంధర్భాలలో తమ నిరసనలు తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది.” చక్కని అంశాన్ని ఎన్నుకుని మీదైన రీతిలో అందించారు. కుడోస్ పద్మార్పితా.

    ReplyDelete
  12. స్త్రీలపై లైంగికదాడులు జరుగుతన్నాయంటే కారణం వస్త్రధారణ సరిగ్గా లేకపోవడమేనని ఈ మధ్య కేంద్ర బీజేపీ ప్రజాప్రతినిధి అన్నారు. 6ఏండ్ల బాలికనుండి 60 ఏండ్లకు పైబడిన వృద్ధురాలి వరకు సామూహిక లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. వీరి వస్త్రధారణలో ఏం కనబడిందో వారికే తెలియాలి. భారతదేశంలో స్త్రీల వస్త్రాధారణ ఎట్లా ఉండాలో సంఫ్‌ుపరివార్‌ శక్తులు నిర్ణయిస్తున్నాయి. స్త్రీలపై కొనసాగుతున్న పురుషాధిపత్యాన్ని కుప్పకూల్చాలి. మనువాదుల ఆంక్షలను అణిచివేతను తిప్పికొట్టాలి.

    ReplyDelete
  13. Very strong objection :)

    ReplyDelete
  14. వాణిజ్య వ్యాపార కారణాలు మహిళల దుస్తులను, వాటి పోకడలను నిర్దేశిస్తున్నాయి. తమ వాణిజ్య ఉత్పత్తుల అమ్మకానికై స్త్రీ శరీరాన్ని విరివిగా వాడుకుంటూ దుస్తులు, నగలు, అలంకరణ సామగ్రితోనే ఆమెను నిర్వచించాలని ప్రయత్నిస్తున్నారు.ఇది తెలుసుకుని మసులుకుంటే మంచిది.

    ReplyDelete
  15. ఈ నియంత్రణలు, కట్టుబాట్లు, ఒత్తిడుల వెనుక ఉన్న రాజకీయాలను గుర్తించి
    వాటిని అధిగమించి మహిళలు తమ వ్యక్తిగత ఇష్టాల మేరకు,
    తమకు సౌకర్యవంతంగా దుస్తులను ఎంచుకొని ధరించే
    స్వాతంత్య్రం కలిగిన రోజునే నిజమైన స్వేచ్ఛ పొందినట్లు కదా...

    ReplyDelete
  16. ఒకటి మాత్రం నిజం..
    బాహ్యసౌందర్యానికి దాసులెందరో ఉన్నారు వారిలో కొందరు ఉన్మాదులుగా మారే సావకాశాలూ ఎక్కువే. కాని చూడాల్సింది అంతః సౌందర్యాన్ని.. నిజ జీవితం లో పనికొచ్చేదల్ల అదొక్కటే.
    ఆడవారిని అగౌరవ పరిచే విధంగా సమాజం తీరుతెన్నులు మారటం బాధాకరం. వస్త్రాలంకరణ, వేశం సౌకర్యం వరకే పరిమితం కాలగలాలి అంతే కాని వేరేదో వస్తువుగా పరిగణలోకి తీసుకోకూడదు. సాంప్రదాయానికి పుట్టిల్లు భారతావని, కాని పాశ్చాత్య ప్రభావం హెచ్చుతుండడం, దానిని పరిమితి దాటించడం అది ఒక రకంగా మనకు మనమే విధించుకునే శిక్ష లాగ తయారయ్యింది.
    డిస్క్లైమర్: నా వ్యాఖ్య కేవలం ప్రస్తుతానికి అద్దం పట్టే విధంగానే ఉంది తప్పితే ఏ ఒక్కరిని ఉద్దెశించి కించపరచాలనే దురుద్దేశం ఐతే ఏ కొసాన లేదు. కేవలం భావ ప్రకటన గానే భావించాలని మనవి. ఎవరినైన నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి.

    ReplyDelete
  17. మీ దృష్టిలో మగాళ్ళు అందరూ అంధులు ఆంబొతులు అంటారా?

    ReplyDelete
  18. chakaga saree kattukune varu who?

    ReplyDelete
  19. ఎవరికి అనువైన దుస్తులు వారు ధరించాలన్నది నా అభిమతమే కానీ..అలాగని విచ్చలవిడిగా విప్పుకుని తిరమనో మరేదో ఇంకొకటి మాత్రం కాదని నా మనవి. సహృదయంతో స్పందించిన అక్షర అభిమానులకు నా వందనములు.

    ReplyDelete
  20. మంచి సమాచారం...

    ReplyDelete
  21. శభాష్ పద్మార్పితా
    మగజాతి చెంపలు చెళ్ళుమన్నాయి
    ఆయుష్మాంభవతు-హరినాధ్

    ReplyDelete