ఇది చాలు...


చేయి చేయి కలిపి

నడిచినా నడవకున్నానేమీ...
జ్ఞాపకాల్లో కలిసిమెలసి
నవ్వుకుంటే చాలు!!

ఎదురుగా కూర్చుని
కబుర్లు చెప్పకపోతేనేమీ...
మనసులో నిండుగా
ఉండిపోతే చాలు!!

నిరాశ నిస్సహాయతలో
నిష్టూరపు వాక్యలాడనేమీ...
విడచి ఉండలేనట్టి
వలపుజాడ్యమనుకో చాలు!!

చేతిలోన చెయ్యేసి
బాస చేయకపోతేనేమీ...
నన్ను నా ప్రేమను
నమ్మితే చాలు!!

ఆశలను నేరవేర్చక
అలుక తీర్చకుంటేనేమీ...
అనురాగ అభయహస్తం
అందిస్తే చాలు!!

చావు వరకూ చెరిసగం
కాకున్నా మాత్రమేమీ...
అర్ధంతరంగా మధ్యలో
వదిలివేయకు చాలు!!

18 comments:

  1. ఇదే చాలు అంటూ అనతం అడిగేసారు.

    ReplyDelete
  2. ఏ మగాడూ ప్రేమించే స్త్రీ లేకుండా ఉండలేడు. నిష్టూరమాడి వదిలించుకోకపోతే చాలు. జీవితాంతం ఉండిపోతాడు.

    ReplyDelete
  3. పురుషునికి పరిపూర్ణత స్త్రీ వలనే
    స్త్రీ ప్రేమలో పరిపక్వత పురుషుని మూలానే
    వారిరువురిలో ఏ ఒక్కరు ఎక్కువ కాదు ఏ ఒక్కరు తక్కువ కాదు
    స్త్రీ పురుషుల యుగ్మం లోకానికే తలమానిక ఇదే నిజం అపద్దం కాదు

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  4. సరళ సంభాషణలతో ఊరట చెందినట్లుంది...ఇది చాలు

    ReplyDelete
  5. అంతేనా ఇంకా ఏమీ వద్దా
    ?????????????????
    :)))))))))))))))))

    ReplyDelete
  6. నిరాశ నిస్సహాయతలో
    నిష్టూరపు వాక్యలాడనేమీ :)

    ReplyDelete
  7. ఈ అలుకలు
    బ్రతిమిలాడ్డాలు
    ఉత్తుత్తి మాటలు
    ఎవ్వరూ ఎవ్వరినీ
    వదులుకోరు ఉండలేరు

    ReplyDelete
  8. chavulo no half anta
    chivari varaku undali ela sadhyam?

    ReplyDelete
  9. ఆశలను నేరవేర్చక
    అలుక తీర్చకుంటే..

    ReplyDelete
  10. vadalanu
    vadalanu
    vadalanu

    ReplyDelete
  11. చాలు చాలు అంటూ అన్నీ కోరెది ఆడువారు

    ReplyDelete
  12. ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పకపోతేనేమీ
    మనసులో నిండుగా ఉండిపోతే చాలు....ఉన్నట్లేనా లేదా అని ఇంకెన్నాళ్ళు డౌట్

    ReplyDelete
  13. Agasi paDutunna bhavalu

    ReplyDelete
  14. అంతా శూన్యం ???

    ReplyDelete
  15. అందరికీ వందనములు_/\_

    ReplyDelete
  16. మాకు ఇవి చాలదు :)

    ReplyDelete