కాలినబూడిద

కలలా కరిగి కాలిపోతున్న దీపపు కాంతిలో
ఎన్నిమార్లని వెలిగించుకోను ఆశాజ్యోతులను
అనుమతి ఇవ్వకుండానే వచ్చి వెళ్ళిన నీతో
ఎన్నని కుంటి సాకులు చెప్పి రప్పించుకోను!
ఏళ్ళ తరబడి కట్టిన గట్టి జ్ఞాపకాల గోడలలో
ఎంతని వెతకను నమ్మకపు ప్రేమసాంద్రతను
అనురాగంతో కట్టేయకుండా ఆపలేను ఆజ్ఞతో
కుమిలి కమిలిన పువ్వు ఏం పరిమళించును!
గుండెనున్నా గుండెపై సేదతీర ఎన్నిహద్దులో
కన్నపేగు కనుసైగ విరిచేసె వలపు వీణతీగను
మూడుముళ్ళు విడవు మిణుగురు మెరుపుతో
పెళ్ళి ముందు దిగదుడుపే ఏ ప్రణయమైనను!
వ్రాసుకున్న ప్రేమ లేఖలు తడిసేను చెమటలో
వేడెక్కిన శరీరకామం అస్థిరబంధాన్ని కాల్చేను
కాగితంపై తమకంలో చేసిన చెల్లని సంతకాలతో
ఒకరంటే ఒకరికున్న కాంక్ష కనుమరుగవ్వును!

15 comments:

  1. manasu nundi putte vedanani paramarsinchalemu
    adi anubhavinchali aveadana chendali anthe.

    ReplyDelete
  2. రాక్: చివరికి అదీ కూడా గాలి ధూళిలో మమేకం
    భస్మం: ఆరిపోయిన ఆశలకి ఎగసి పడిన జ్వాలల రూపం
    బూడిద: చివురులు వీడి మోడుబారిన చెట్టు కాండాన అశనిపాతం
    యాష్: వేదనలు వెల్లువై నిలువెల్ల దహించే భావోత్పాత తాపం

    ReplyDelete
    Replies
    1. కటౌట్ జూసి కొన్ని కోని నమిలేయాలి బూడ్
      బీలైతే ప్రేమిద్దాం ధూడ్ మహా ఐతే తిరిగి ఫ్రేమిత్తరు

      Delete
  3. ఆర్దతతో నిండిన వాక్యాలు
    మనసుకు చదివినా ప్రశాంతతను ఇయ్యవు
    మనసుని ఉత్తేజపరిచే కావ్యాలు వ్రాయండి పద్మార్పితగారు.

    ReplyDelete
  4. I hate love stories :)
    Its very painful.

    ReplyDelete
  5. భవగర్భితం... దుఃఖ పూరితం

    ReplyDelete
  6. భవగర్భితం... దుఃఖ పూరితం

    ReplyDelete
  7. ఎండలు మండిపోతున్నాయి పద్మగారు
    ఇకనైనా చల్లని పదాలతో కూల్ చేయండి.

    ReplyDelete
  8. ఎద నిండున వ్యధలు ఉంటే
    వాక్యాలు కూడా వేదనతో నిండి ఉంటాయని తెలిపే కవిత.

    ReplyDelete
  9. వ్రాసుకున్న ప్రేమ లేఖలు తడిసేను చెమటలో
    వేడెక్కిన శరీరకామం అస్థిరబంధాన్ని కాల్చేను
    అద్భుతం పదాల అల్లిక....

    ReplyDelete
  10. gunde mantalu aaripothe kanneellu

    ReplyDelete
  11. manasuni control lo unchukunte
    ichchi puchchukune badhalu undavu kada madam. mee post lu konni arthamai artham kanatlu untayi.

    ReplyDelete
  12. కాగితంపై తమకంలో చేసిన చెల్లని సంతకాల...new word with deep meaning.
    How are you madam? Missing your posts.

    ReplyDelete
  13. _/\_అక్షర అభిమానులకు పద్మార్పితాంజలి_/\_

    ReplyDelete