వలపుసెగ రగిలించు ఉప్పొంగుతాను
మతలబు చేయకు మర్మం ఎరుగను
లిప్ స్టిక్ చెరిగిపోనియ్యి సంతోషిస్తాను
కంటికాటుక చెరగనీకు కలతపడతాను
బిగికౌగిట్లో బంధించు మురిసిపోతాను
ఊపిరాగనీయకు ఊహలున్న దానను
మది బహుకరించు రుణముంచుకోను
అంతకు మించిన అనురాగమందిస్తాను
నమ్మించి మోసంచేయకు నువ్వే నేను
అడిగి చూడు నవ్వుతూ ప్రాణమిస్తాను
వదిలి వెళ్ళిపోకు అన్నీ నీవనుకున్నాను
అలాగని అలుసుచేస్తే బాంబేసి లేపేస్తాను
నువ్వు నేను ఒకప్పుడు
ReplyDeleteకాని
ఇద్దరమొకటే ఇకపై ఇప్పుడు
సంతోషమొస్తే ఆపలేను, దుఃఖమైన అంతే
కాని
భావోద్వేగాలలో నువు నేను ఎపుడూ సమానమే
నిందలేస్తావు అపుడపుడు, నీరుగారి పోతావు
కాని
అశృతప్త నయనాలలో నా నీ ప్రతిబింబాలు మసకే
తిట్టుకుంటాము తగాద పడతాము
కాని
రెండు దేహాలలో కొలువైన ఒకే ఆత్మగా మెలిగేది మనమే
~నా భార్య కు అంకితం
నా నాటు లవ్వుకు లొంగకపోతే నాటు తుపాకీతో లేపేస్తా
ReplyDeleteinta gathu prema tattukovadam kashtam-ha ha ha ha
ReplyDeleteఅద్గది అర్పిత అదుర్స్
ReplyDelete"నమ్మకమే ఏ బంధానికైనా నాంది
ReplyDeleteఅది సన్నగిల్లినప్పుడు పైశాచికత్వం "
పెల్లుబికి బాంబులు వేసేకాడకు వస్తది
మస్తు రాసినారు....
మీరు ఇలా ధైర్యమైన పంధాలో వ్రాస్తెనే బాగుంటుంది
ReplyDeleteఢీలా ఢాలా కవితలు మీకు అంతగా నప్పవు.
చక్కగా అమరింది కవితా మరియు వాక్యాలు
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAmmo...vayammoe ammoe
ReplyDeleteచివరికి ఏదో తిరకాసు ఉంది అనుకున్నట్లే లేపేసారు. ఎంతకైనా సమర్ధులు మీరు
ReplyDeleteఅలుసుగా చూస్తే పులుసు తీసేస్తారన్నమాట :)
ReplyDeleteధీటైన జవాబు పద్మా
ReplyDeleteనమ్మించి మోసంచేయకు
ReplyDeleteబాంబేసి లేపేస్తాను....
వదిలి వెళ్ళిపోకుమని
ReplyDeleteవేడినా దరి రాకుంటే
పక్కలో బళ్ళెమై...
కంటికి కునుకు రాకుంటే
తప్పదు మనసుపై దాడి..
enti indi antha kopama leka prema na?
ReplyDeletemeeru mari intha rebal ani teliyadu papam :)
Just like Kiran bedi i think
ReplyDeletethat is good madam ..ha ha ha
Olammo bhayyam :)
ReplyDeleteపద్మార్పిత నమస్సులు.
ReplyDeleteRebal
ReplyDeleteAtom Bomb
ReplyDeleteLove this.
ReplyDeletedhetaina mata.
ReplyDelete