మనమధ్య..

నేనేమో చదవమని తెరచిన నిఘంటువుని
నువ్వేమో చదువురాని నిరక్ష్యరాసుడివి...
నీకూ నాకూ మధ్యన కనబడని ఖాళీస్థలం!
నేనేమో ప్రేమానుబంధాల ఊటలో ఊరితిని
నువ్వేమో బంధాలఊబిలో కూరుకుంటివి...
నీకూ నాకూ మధ్య నిస్సహాయతా నిశ్శబ్దం!
నేనేమో ఈవల ఒడ్డునున్న విరిగిన తెడ్డుని
నువ్వేమో ఆవల ఒడ్డున నావలో ఉంటివి...
నీకూ నాకూ మధ్యన ఒత్తిళ్ళు సుడిగుండం!
నేనేమో అనురాగ స్వార్థంగల అనైతిక బీటని
నువ్వేమో గ్లోబల్ తాపంతో రగిలే జ్వాలవి...
నీకూ నాకూ మధ్యనేమో నూలుపోగుబంధం!
నేనేమో తైలవర్ణం అద్దని తెల్లని కాన్వాసుని
నువ్వేమో వర్గవర్ణవిచక్షణ తెలిసిన జ్ఞానివి...
నీకూ నాకూ మధ్యలోన అల్పపీడన భీభత్సం!

22 comments:

  1. నేను నీవు నాకు నీకు నడుమన నానార్థాలు
    నేనే నీవై నాకై నీవు నిరీక్షించే నిడివిన నారాజునా
    నీలో నేను నాలో నువ్వు నిక్షిప్తమై నిరాడంబరం
    నన్నే నాకు నూత్నంగా నమ్మిక నేర్పే నయనానందకరివై
    "న" లెన్నైనా ఎన్ని నాళ్ళైనా నా నువ్వు నీ నేనే నికచ్చిగా

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  2. Adbhutamina matalu andamaina chitram tho andincharu.

    ReplyDelete
  3. అనునుబంధాల ఊటలో ఊరటం అంటే అమరం ఈ ప్రేమ.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. ఇరువురికీ ఇంత అవినాభావ సంబంధం ఉన్నప్పుడు ఇంక అడ్డకులు ఎన్ని వచ్చి మాత్రం ఆపగలవు. ఆనందంగా జీవితాన్ని కొనసాగించడమే. చిత్రము చూడ ముచ్చట గొల్పుచున్నది.

    ReplyDelete
  6. Lovely
    Gamattuga chepparu.

    ReplyDelete
  7. తైలవర్ణం అద్దని తెల్లని కాన్వాసు
    Simply Sooperb.

    ReplyDelete
  8. మనసు దోచింది మీ కవిత.

    ReplyDelete
  9. ప్రత్యేక అభినందనలకు నోచుకున్న పదబంధమాలిక పద్మార్పిత

    ReplyDelete
  10. neenaa madhyana dooram ledu.

    ReplyDelete
  11. ప్రేమ మూర్తి అద్భుత అక్షరమాల.

    ReplyDelete
  12. అమోఘం..ఇద్దరి మధ్యన ఉన్న బంధం.
    మీ కవితల్లో అందమైన ప్రేమలోకాన్ని చూపెడతారు.

    ReplyDelete
  13. So beautiful Painting.

    ReplyDelete
  14. హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయినపుడు.. రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, కొండ కోనలు, బండలు వగైరా మాత్రమే ఉండేవి. దట్టమైన కారడివి అందులో ఎన్నో రకాల జీవరాశులు సింబియోసిస్ మాదిరి జివించేవి. కాలచక్రం గిర్రున తిరగాడి.. యాన్‌సేయింట్ నుండి మెడీవల్ దాటుకుని ఇండస్ట్రీయల్, వైట్, గ్రీన్ రివొల్యూషన్, ఇన్నోవేషన్, బ్రేక్‌థ్రూలు ఇలా కొనసాగుతున్న జీవన వాహినిలో.. నిపాహ్, హంటా, ఎబోలా అంటు రకరకాల వైరసులు ప్రతిదాడి చేసినా.. మెడికల్ అడ్వాన్స్‌మెంట్ మూలాన వాటిని దాదాపుగా అణచివేయటం జరిగింది అది అందరికి విధితమే.. ఐతే అనతి కాలంలోనే మొదలయ్యి అనుకున్న దాని కంటే రెట్టింపు, మూడింతలు, నాలుగు.. ఐదు.. అలా పదింతలుగా పెరిగి భూగ్రహాన్నే తన గుప్పిట బంధించాలనే దురుద్దేశం మూలానో మరే ఇతర కారణాల మూలనో కరోన అనే భయంకర రక్త పిశాచి అలియాస్ రక్కసి చాప కింద నీరులా సంక్రమిస్తూనే ఉంది.. ఏమో.. దీనికి భవిష్యత్తులో ఔషధాలు వచ్చి పూర్తిగ సమసిపోయేదిగా ఉండబోతుందో లేక మనిషి మేధతో తయారైన భవంతులు, ఈ-పరికరాలు గుట్టలుగా చివరాఖరుకి భూమిపై జీవకోటి వినాశనానికి దారి తీయనుందో తెలియని సందిగ్ధ స్థితి.
    ప్రతి ఒకరు మాస్క్ ధరించి, డీనేచర్డ్ అల్కాహాల్ బేస్ శానిటైజింగ్ హ్యాండ్ రబ్ వాడుతూ.. మూడు కాదు ఆరు కాదు తొమ్మిది గజాల దూరం పాటిస్తు ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోగలిగే స్థితిని చేజారనియ కూడదనే హితవుతోనే ఈ కమెంట్ ను ప్రచూరించటం జరిగింది.
    అందరం క్షేమంగా ఉందాం, పరిపూర్ణ ఆరోగ్యానికి కావలసిన సరంజామను సమకూర్చుకుంటూనే ఈ మహమ్మారి వినాశనాన్ని కోరుకుందాం

    జై శ్రీమన్నారాయణ

    ReplyDelete
  15. నేనేమో చదవమని తెరచిన నిఘంటువుని, నువ్వేమో చదువురాని నిరక్ష్యరాసుడివి...ఇది నిజమే

    ReplyDelete
  16. మనిషి మనోభావాలను సున్నితంగా చెబుతారు. చదివిన ప్రతీసారీ కొత్తగా ఉంటాయి మీ వ్రాసేవి, హ్యాట్సాప్

    ReplyDelete
  17. ఎలా ఉన్నావు?
    ప్రతీ పదంలోనూ పాండిత్యం కనబరచినట్లుంది.
    అభినందనలు పద్మ నీకు.

    ReplyDelete
  18. అనురాగ స్వార్థంగల అనైతిక బీటని
    గ్లోబల్ తాపంతో రగిలే జ్వాలవి...ఎక్కడివి మీకు ఈ పదాలు?

    ReplyDelete
  19. నాలో ఎన్నెన్నో భావాలు..వాటిని ఆదరిస్తున్న అందరికీ వందనములు_/\_

    ReplyDelete
  20. ఈ పదాల ఒరవడికి హ్యాట్సాఫ్.... I always shock and amaze with your poetry

    ReplyDelete
  21. అత్యుత్తమం

    ReplyDelete