వంగతోటలో ఒళ్ళొంచి లేత వంకాయలు కోసుకొచ్చి
మువ్వంకాయల కూరను వంగి వయ్యారంగా వడ్డిస్తే
ఓరకంట చూస్తూ ఒళ్ళు జిల్లుమంటుంది అంటావు!
పూదోటలోకి సందేలకెళ్ళి బొండు మల్లెపూలట్టుకొచ్చి
మరువాన్ని మధ్యెట్టి మాలకట్టి జడలో పెట్టుకొనివస్తే
మత్తెక్కించే మల్లెల మధ్య మరువం గుచ్చెనంటావు!
మావిడితోటకి మండుటెండకెళ్ళి మాగిన పళ్ళట్టుకొచ్చి
తొక్కతీసి ముక్కలు కోసి నా చేతితో నీ నోటికిఅందిస్తే
చిలిపిగా నవ్వి మావిడపళ్ళ రసాలు రంజు అంటావు!
జొన్నచేనుంచి లేతకంకులు నాలుగు దోరగ కాల్చిచ్చి
ఏటిగట్టుకెళ్ళి స్నానమాడి నూలుచీర ఒంటికిచుట్టుకొస్తే
ముతకబట్ట ఇద్దరిమధ్య తెరని తీసి దీపం ఆర్పేస్తావు!
చీకట్లో నీ చూపులే సూదంటురాయై నన్నేడేడో గుచ్చి
చిత్రంగా ఒళ్ళంత తడిమేటి ఆ సరసమే తబ్బిబ్బుచేస్తే
నా ఊపిరిలో దాగి నీ చీకటికి నేనే వెలుగు అంటావు!!
I appreciate your bold & beautiful feel.
ReplyDeleteకాలమే కాదు కరోనా కూడా కట్టడి చేయలేదు మీ కలం ఒలికించే వలపు కావ్యాలను...అహ హా హా
ReplyDeleteఇదేంటండి ఇలా విజృంభించి పడేస్తున్నారు... మేడం కి మూడ్ వచ్చింది!!
ReplyDeleteసరిగ్గా రెండేళ్ళ క్రితం కొంత టెన్షన్, కొద్దిగా ఆనందం..
ReplyDeleteమా గారాల పట్టి "చూచూలు" శరణ్య పుట్టిన రోజు నేడు.
తోటలన్ని మామిడి కాయలతో కళకళలాడే వేసవి
నోరూరించే పనస తొనల సీజన్ కూడాను వేసవి
నీరుగారే తాటి ముంజల కాలం కేవలం వేసవి
మంచుబిందువులను వడగళ్ళుగా పలిచయం చేసేది వేసవి
వేడి సలపరాల విహారి
poola thotalu pandla thotalato gurudu padipoyinatle :)
ReplyDeleteసరసమైన కవితాచిత్రము.
ReplyDeleteరసవత్తరంగా విసరిన వలపు బాణం గుండెల్లో గుచ్చుకుంది.
ReplyDeleteశృంగారం మానవ జీవితంలో ఒక విడదీయలేని బాగం,
ReplyDeleteశృంగారం స్త్రీ పురుషులను ఒకటి చేస్తుంది..సక్కదనాల సుక్కతో శృంగారం
శృంగార నైరాశ్యం :)
ReplyDeleteశృంగార రసపోషణతో అల్లలాడించారు
ReplyDeleteస్వేచ్ఛా ప్రణయ భావాలకు బాట వేసారు.
thota annee tirigi prematho chesina vatini kadani mimmalne korukunnadu gurudu. yamaha telivaina vadu sumah me priyudu.
ReplyDeleteMadam this is season for mangoes not for romance.
ReplyDeletePicture is awesome.
SO ROMANTICPUNCH.
ReplyDeleteರಮ್ ಪಂಚ್ ಕೋಲಾ ಶುಂಠಿ (ಜಿಂಜರೇಲ್)
Deleteమత్తెక్కించే మల్లెల..seasonal post :)
ReplyDeleteచంపేసారు..హ హ అహ
ReplyDeleteశృతి మించి రాగాన్న పడ్డం అంటే ఇదేనేమో:)
బొమ్మ కత్తిలా గుండెలో గుచ్చుకుంది.
pandu vennela
ReplyDeletepatte manchamu
paruvapu janta
inkem kavali :-)
Wonderful Blog Postings
ReplyDeleteమనోల్లాస భావకవితలు.
ReplyDeleteఅందరి ఆత్మీయ స్పందనలకు పద్మార్పిత వందనములు_/\_
ReplyDeleteఅద్భుతం.
ReplyDeleteమనసు పులకరించెను మీ కవితలకు.
ReplyDeleteAmazing blog to read.
ReplyDeleteసరస శృంగారం ఒలికింది కవితలో.
ReplyDelete