నీ వెలుగు...

వంగతోటలో ఒళ్ళొంచి లేత వంకాయలు కోసుకొచ్చి
మువ్వంకాయల కూరను వంగి వయ్యారంగా వడ్డిస్తే
ఓరకంట చూస్తూ ఒళ్ళు జిల్లుమంటుంది అంటావు!

పూదోటలోకి సందేలకెళ్ళి బొండు మల్లెపూలట్టుకొచ్చి
మరువాన్ని మధ్యెట్టి మాలకట్టి జడలో పెట్టుకొనివస్తే
మత్తెక్కించే మల్లెల మధ్య మరువం గుచ్చెనంటావు!

మావిడితోటకి మండుటెండకెళ్ళి మాగిన పళ్ళట్టుకొచ్చి
తొక్కతీసి ముక్కలు కోసి నా చేతితో నీ నోటికిఅందిస్తే
చిలిపిగా నవ్వి మావిడపళ్ళ రసాలు రంజు అంటావు!

జొన్నచేనుంచి లేతకంకులు నాలుగు దోరగ కాల్చిచ్చి
ఏటిగట్టుకెళ్ళి స్నానమాడి నూలుచీర ఒంటికిచుట్టుకొస్తే
ముతకబట్ట ఇద్దరిమధ్య తెరని తీసి దీపం ఆర్పేస్తావు!

చీకట్లో నీ చూపులే సూదంటురాయై నన్నేడేడో గుచ్చి
చిత్రంగా ఒళ్ళంత తడిమేటి ఆ సరసమే తబ్బిబ్బుచేస్తే
నా ఊపిరిలో దాగి నీ చీకటికి నేనే వెలుగు అంటావు!!

24 comments:

  1. I appreciate your bold & beautiful feel.

    ReplyDelete
  2. కాలమే కాదు కరోనా కూడా కట్టడి చేయలేదు మీ కలం ఒలికించే వలపు కావ్యాలను...అహ హా హా

    ReplyDelete
  3. ఇదేంటండి ఇలా విజృంభించి పడేస్తున్నారు... మేడం కి మూడ్ వచ్చింది!!

    ReplyDelete
  4. సరిగ్గా రెండేళ్ళ క్రితం కొంత టెన్షన్, కొద్దిగా ఆనందం..
    మా గారాల పట్టి "చూచూలు" శరణ్య పుట్టిన రోజు నేడు.



    తోటలన్ని మామిడి కాయలతో కళకళలాడే వేసవి
    నోరూరించే పనస తొనల సీజన్ కూడాను వేసవి
    నీరుగారే తాటి ముంజల కాలం కేవలం వేసవి
    మంచుబిందువులను వడగళ్ళుగా పలిచయం చేసేది వేసవి

    వేడి సలపరాల విహారి

    ReplyDelete
  5. poola thotalu pandla thotalato gurudu padipoyinatle :)

    ReplyDelete
  6. సరసమైన కవితాచిత్రము.

    ReplyDelete
  7. రసవత్తరంగా విసరిన వలపు బాణం గుండెల్లో గుచ్చుకుంది.

    ReplyDelete
  8. శృంగారం మానవ జీవితంలో ఒక విడదీయలేని బాగం,
    శృంగారం స్త్రీ పురుషులను ఒకటి చేస్తుంది..సక్కదనాల సుక్కతో శృంగారం

    ReplyDelete
  9. శృంగార నైరాశ్యం :)

    ReplyDelete
  10. శృంగార రసపోషణతో అల్లలాడించారు
    స్వేచ్ఛా ప్రణయ భావాలకు బాట వేసారు.

    ReplyDelete
  11. thota annee tirigi prematho chesina vatini kadani mimmalne korukunnadu gurudu. yamaha telivaina vadu sumah me priyudu.

    ReplyDelete
  12. Madam this is season for mangoes not for romance.
    Picture is awesome.

    ReplyDelete
  13. Replies
    1. ರಮ್ ಪಂಚ್ ಕೋಲಾ ಶುಂಠಿ (ಜಿಂಜರೇಲ್)

      Delete
  14. మత్తెక్కించే మల్లెల..seasonal post :)

    ReplyDelete
  15. చంపేసారు..హ హ అహ
    శృతి మించి రాగాన్న పడ్డం అంటే ఇదేనేమో:)
    బొమ్మ కత్తిలా గుండెలో గుచ్చుకుంది.

    ReplyDelete
  16. pandu vennela
    patte manchamu
    paruvapu janta
    inkem kavali :-)

    ReplyDelete
  17. Wonderful Blog Postings

    ReplyDelete
  18. మనోల్లాస భావకవితలు.

    ReplyDelete
  19. అందరి ఆత్మీయ స్పందనలకు పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete
  20. అద్భుతం.

    ReplyDelete
  21. మనసు పులకరించెను మీ కవితలకు.

    ReplyDelete
  22. Amazing blog to read.

    ReplyDelete
  23. సరస శృంగారం ఒలికింది కవితలో.

    ReplyDelete