తేడా తెలుపు


మనిషికే కాదు మృగానికీ గుండె ఉంటుంది
గుండె ఉంది అనుకుని కూర్చుంటే సరిపోదు
చెయ్యాలన్న సంకల్పము ధైర్యము ఉండాలి!

సక్రమంగా జరుగలేదు అనుకుంటే ఏముంది
ధైర్యముంటే చాలు అదే బలం అంటే చాలదు
దానికి తోడు దాతృత్వం శ్రమా కూడిరావాలి!

ధీక్ష పట్టుదల తెగింపు కలిస్తే పని అవుతుంది
అయ్యోపాపం ఎలాగైందని అడిగితే అయిపోదు
ఆపదలో ఆదుకోడానికి హస్తం ఒకటి ఉండాలి!

పగలు తరువాత రాత్రీ గడిచి తెల్లవారిపోతుంది
లేచామా తిన్నామా పడుకుంటిమా అంటేకాదు
మానవత్వంతో మనకూ గొడ్డుకీ తేడాతెలియాలి!

28 comments:

  1. పగలు రాత్రి వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఉండేవాళ్ళు ఉంటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే మానవత్వం కూడా ఉన్నవాళ్ళు చేస్తున్నారు లేనివారు ఉన్నారు.

    ReplyDelete
  2. Bomma pichaga nachchindi

    ReplyDelete
  3. ధీక్ష పట్టుదల తెగింపు కలిస్తే పని అవుతుంది this is not in all siruations.

    ReplyDelete
  4. మనిషికన్నా మృగము మిన్న అని పెద్దలు చెప్పారు.
    మీ భావ చిత్రాలు చాలా బాగుంటాయి.

    ReplyDelete
  5. manalo lopam lenapudu edutivarilo kudaundadu ani nammite sari apudu manaku variki kuda noppi kalugadu. Yemantaru padmaji?

    ReplyDelete
  6. అలా తేడా తెలుసుకోవడం వరకూ పర్వాలేదు. నగలు ఆస్తులతో పోల్చుకుని చేయించమని తిప్పలు పెడితేనే పెంట కదండీ.

    ReplyDelete
  7. అన్నీ సమపాళ్ళలో ఉంటే వారు మనుషులుకారు దేవుళ్ళు అయిపోతారు. అసలు ఇంతకూ మీరూ చెప్పాలి/చూడాలి అనుకున్నది మనిషిలోనా లేక పశువుల్లోనా. చిత్రము బాగుంది.

    ReplyDelete
  8. తేడాలు తెలుసుకుని తూట్లు పొడిచేస్తారా ఏమిటి :)

    ReplyDelete
  9. BEAUTIFUL THOUGHTS ANDI.

    ReplyDelete
  10. మానవత్వమా మేలుకో!!!

    ReplyDelete
  11. ఇప్పుడు కరోనా సమయం కదా అందుకే అందరికీ కావాల్సింది మనోధైర్యం.

    ReplyDelete

  12. ధైర్యముంటే చాలు అదే బలం అంటే చాలదు
    దానికి తోడు దాతృత్వం శ్రమా కూడిరావాలి
    ధీక్ష పట్టుదల తెగింపు కలిస్తే పని అవుతుంది
    మంచి ముచ్చట చెప్పారు.

    ReplyDelete
  13. రత్నగుళికలు

    ReplyDelete
  14. రాను రానూ పశువులకు మానవత్వం వస్తోంది... మానవులకు మృగత్వం వస్తోంది....

    ReplyDelete
  15. Don't compare with others.

    ReplyDelete
  16. Pratee manishilonu manavatwam untundi adi chooses drusti konamupaina aadhara padi avasaraniki upayoginchukovadamlo avivekam untundi

    ReplyDelete
  17. లేచామా తిన్నామా పడుకుంటిమా

    ReplyDelete
  18. తెలుసుకుని చేసేది ఏముంటుంది.

    ReplyDelete
  19. తేడలు తెలుసుకుని మారి మసలుకోవాలి. అదేనేమో కదా సగం మానవ్తంతో మెలగడానికి సహాయం చేస్తుంది. అయినా ప్రతీ మనిషీ తనని తాను తెలుసుకుని మసలుకుంటే అదే సగం సమస్యలకు పరిష్కారము చూపుతుంది అనుకుంటాను పద్మార్పితా.

    ReplyDelete
  20. Differences etti chupithe kopam vastundi kada.

    ReplyDelete
  21. మనసు కవయిత్రి మీరు.

    ReplyDelete
  22. Padma how are you?
    Hope you and your family is safe. Bless you dear.

    ReplyDelete
  23. first line is true.
    manasu unna manishi lo manavatwam untundi andi.

    ReplyDelete
  24. అందరికీ అభివందనములు_/\_

    ReplyDelete
  25. అన్నీ ఉండి కూడా ఏమీ చెయ్యనివారు ఎందరో ఉంటారు ఇలలో.

    ReplyDelete