నూతనయత్నం..

ప్రేమ లోతుని పసిగట్టలేని పిచ్చి మనసు
తననితాను ప్రేమిస్తూ ప్రకృతిని ప్రేమించె
ప్రేమించి మిన్నక దాని ఒడిలో పవళించి
వెన్నెల వెలుతురు వేడి తనవేనని తలంచె!
కొండ కోనలూ పచ్చికబయళ్ళూ నదులు
అవన్నీ తనతోటే మచ్చటించాలని ఎంచె
వర్షం వచ్చి రాకున్నా విపరీతంగా తడచి
విసిగిపోని భావోద్వేగంతో విచలితనిచెందె!
తప్పని ప్రాయశ్చిత ప్రక్రియతో ఆవేదనను
ప్రేమ భావాన్ని హుందాగా ప్రకటించనెంచె
సామాజిక స్పూర్తివైపు తన ధ్యాస మళ్ళించి
భావప్రపంచపు దిశను మార్చి మదిరచించె!
భావ వవనపు పూలు నన్ను చూసి నవ్వుతూ
దిశమార్చినట్లు మదిమార్చగలవాని ప్రశ్నించె
సుఖఃధుఖ వలపు శృంగారాత్మకం అనిపించి
ఐహిక మలినాలు కడగ కలం ప్రయత్నించె!

23 comments:

  1. మార్పుతో మీ భావాలను రాస్సెయ్యండి పద్మాజీ.

    ReplyDelete
  2. ఐహిక మలినాలు కడగ కలం ప్రయత్నించె
    మీ ప్రయత్నం ఫలిస్తుంది..మంచికి మంచే జరుగును.

    ReplyDelete
  3. మార్పు మంచిదైతే ఆలోచన ఎందుకు?

    ReplyDelete
  4. మార్పు నాంది
    మార్పు పునాది
    మార్పు సహజం
    కాలంతో పాటు సహగమనం
    కాలాలకతీతమై సాగే పయనం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  5. తెలుగు భాషలోని పదాలు అన్నీ మిమ్మల్ని మహాగట్టిగా ముద్దాడినట్లు ఉన్నది కవిత.

    ReplyDelete
  6. Painting pic ku fidaa

    ReplyDelete
  7. Mahabaga rasi meppinchinaru
    bomma kallu tippukoniyatam ledu suma.

    ReplyDelete
  8. మనసు పైకి అలా అంటుందే కానీ లోన వెన్న
    మీరు మారాలి అనుకున్నా మారలేరు. అయినా ఎవరకి నచ్చినట్లు వారు ఉంటే తప్పేమి లేదు.

    ReplyDelete
  9. Padma nuvvu inka still continuing that josh aha?

    ReplyDelete
  10. SO BEAUTIFUL ART PICTURE.

    ReplyDelete
  11. సామాజిక స్పూర్తివైపు తన ధ్యాస మళ్ళించి..సాధ్యమేనా?

    ReplyDelete
  12. Madam how are you?
    Take care andi
    So beautiful painting.

    ReplyDelete
  13. bhavam amarchina teru bavunnadi.

    ReplyDelete
  14. అందమైన భావాలు ఎప్పుడూ అలరిస్తాయి

    ReplyDelete
  15. ఏమి వ్రాసినా తిట్టక ప్రియమైన వాక్యాలు వ్రాయండి చాలు.

    ReplyDelete
  16. నూతనోత్సాహ సంబరాలు జరుపుకోవడానికి ఇది సమయము కాదు.
    మీ భావాలను యధాతధముగా వెల్లడి చేయగలరు.

    ReplyDelete
  17. okay...rastarani educhustunamu
    edi adigo idigo ani inni rojulu ayyindi
    inka rayane ledu marchi mancgi kavitanu.

    ReplyDelete
  18. భావ వవనపు పూవ్వు కొత్తగా ఉంది.

    ReplyDelete
  19. నమస్సులు_/\_

    ReplyDelete
  20. అందమైన చిత్రకవిత

    ReplyDelete