గ్యాస్ కబుర్లు

ఆక్సిజన్ అన్ని జీవరాశులకు అదే మూలమని

రంగురుచివాసన లేకున్నా బ్రతకడానికవసరమని
ప్రాణవాయువులా నాతో ఉన్నంత కాలము ఉండి
దాని సంకేతంలా శూన్యంలో "O"చుట్టి వెళ్ళిపోకు!

నైట్రోజన్ మొక్కలకి అవసరమైనదీ మూలకమని
కృత్రిమ గర్భోత్పత్తిలో ద్రవ నత్రజని పాత్ర ఉందని
స్పృహ తిరిగితెప్పించే అమోనియాకు నేస్తంవంటిది
నవ్వించే గ్యాస్ వోలే నమ్మించి నట్టేటిలోముంచకు!

కార్బన్ డై ఆక్సైడ్ వృక్షాలు వదిలేసిన వాయువని
నీట్లో కలిస్తే సోడా,పదార్ధం పులిస్తే పైకొచ్చే గ్యాసని
మండుతున్న మంటలు ఆర్పడానికి ఉపయోగపడి
మనసున మంటరేపి గాలికంటే బరువై దిగజారిపోకు!

హైడ్రోజన్ గాలిలోన మండి ఉదకఊటను ఇస్తుందని
గాలికంటే అత్యంత తేలికైన వాయువుపేరు ఉదజని
అధిక దహనోష్ణతని కలిగిన పారిశ్రామిక ఇంధనమది
అన్నీ నీవని ఆశగా ఉంటే అంతరిక్షంలోకి ఎగిరిపోకు! 

32 comments:

  1. Oxygen
    Hydrogen
    Nitrogen
    Carbon dioxide
    Gas Love annamata :)

    ReplyDelete
  2. ప్రాణ వాయువులు ఈ విధంగా కూడా ఉపయోగ పడతాయి అని తెలియ చెప్పారు, కుడోస్.కుడోస్

    ReplyDelete
  3. ఆశ్చర్యం
    అబ్బురం
    అక్షరాలతో
    ఆయువుపోసారు

    ReplyDelete
  4. ఏ భావమైతే ఏమున్నది మనసునే కాక కోశాలలోకి చేరి, ఊపిరి తిత్తులను రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే ప్రాణవాయువు పద్మార్పిత పదబంధాలని చెప్పడలో సందేహమే లేదు.

    ReplyDelete
  5. Total Fit Madam
    Oxygen tho paniledu-ha h ha haaa

    ReplyDelete
  6. ఇంతకూ అంతా గ్యాస్ మయం అంటారా?

    ReplyDelete
  7. ఒడిసి పట్టుకున్నది మీరు ఇంక ఎక్కడికి పోతాడు గురుడు.అహా హా హా హా

    ReplyDelete
  8. Replies
    1. [He] 2s² 2p⁴
      [He] 2s² 2p³
      [He] 2s² 2p⁴::[He] 2s² 2p²::[He] 2s² 2p⁴
      1s¹

      Delete
    2. పద్మ గారు కవితలో తెలిపిన కెమికల్ ఎలిమెంట్స్ తాలుకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, శ్రీధర్ గారు

      Delete
    3. ఆ పైదేమో మెన్డెలెవ్ పీరియాడిక్ టేబల్ లో గల ఎలిమెంటల్ గ్రూప్ వైజ్ నెమానిక్..

      Delete
  9. Ah...Chemistry Love Propose

    ReplyDelete
  10. Mee thoughts ku mee ideas laku johar.

    ReplyDelete
  11. ఎవరివి గ్యాస్ కబుర్లు
    ? ? ? ? ? ? ! ! !

    ReplyDelete
  12. అర్థము కాని వాక్యాలు
    ఏమి చెప్పాలి అనుకున్నారు అసలు

    ReplyDelete
  13. మీ బ్లాగ్ అలంగరణ అందులోని ప్రతీ పోస్ట్ చిత్రాలు మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. నేను హైద్రబాద్ నివాసిని. మీరు మీ చిరునామాను దయచేసి తెలుపగలరు. మా నాన్నగారు హాస్పటల్లో చికిత్స పొందుతూ మీ బ్లాగ్ చూసి చాలా ఆనందించారు. ఆయన కోరిక మేరక మిమ్మల్ని ఒకసారి వారికి పరిచయం చేస్తే చాలా సంతోషిస్తారని ఆలోచన మిమ్మల్ని అడ్రస్ అడిగేలా చేసింది.

    ReplyDelete
  14. అన్నీ గాలి కబుర్లేనా :)

    ReplyDelete
  15. Now a days there is no use of chemistry madam.

    ReplyDelete
  16. "O"చుట్టి సంకేతంలా శూన్యంలో వెళ్ళిపోకు!

    ReplyDelete
    Replies
    1. ఏది ఒక ఓ వేసుకోండని అంటారు కదా.. అదే కామోసు బహుశ, పద్మ గారి మాటల్లో.. అంటే తెలిసి కూడా ఆడంబరానికి పూనుకోవద్దనే భావన.. ("కేరింత"లో బావనా)

      Delete
  17. Annie vayuvulu kalisi kummaru :)

    ReplyDelete
  18. NITROZEN
    navvistundoch
    ha ha aha ha aaah

    ReplyDelete
  19. Meru science student avuna
    kala ku yedi anarham kadu avuna

    ReplyDelete
  20. Comment cheste gas kaburlu antaru.

    ReplyDelete
  21. ఉప్పెన జలపాతం పేరడి (భగ్గున)

    భగ భగ ఎండే నువ్వు
    థర్ థర్ ధూజితే మేము
    వడగాలిని తోడుగా తెచ్చావే
    పాలిపోయే పెదవుల తోడు
    తడి ఆరిన గొంతుక చూడు
    కాకల్లే జనం మాడిపోతారే

    43°C in Warangal

    ReplyDelete
  22. _/\_గాలిలో కలిసిపోయే గ్యాస్ కబుర్లు అయినా అభిమానించే అందరికీ పద్మార్పిత హృదయాంజలి-/\_

    ReplyDelete
  23. ఇలా గ్యాస్ వాయువులు కూడా ఉపయోపడతాయి కవిత్వానికి అనుకోలేదు.

    ReplyDelete