తడవ తడవకూ తుమ్మినప్పుడంతా తలపుల్లోకొచ్చి
తనువు అంతా జ్ఞాపకాలతో తడిమి తడిమి తడిచేసి
తలవకుండా ఉండంటావు ఏందోయ్ నీ తస్సదియ్యా!
ఛీది ఛీదీ చిత్రంగా చీరకొంగు అంతా తడిసె చీమిడొచ్చి
జలుబుతో ముక్కూ చెంపలూ ఎర్రబడ్డ ముఖం చూసి
రొంపేదో పెద్దజబ్బని జారుకుంటివి కదారా నీ జిమ్మడా!
ఖళ్ళ్ ఖళ్ళుమంటూ దగ్గి గుండెని అరచేత పట్టుకొచ్చి
తుంపర్లకే తుస్సంటావని నోరు బట్టతో మూస్తి దగ్గేసి
దగ్గితేనే దరికి చేరనోడివి దాంపత్యం ఏమి చేస్తావయ్యా!
గబ గబా రెండుగుటకల నీళ్ళుతాగితే పొలమారె హఛ్చీ
నీవు గుర్తొచ్చి ఒళ్ళు వేడెక్క చన్నీట తడిస్తి మునకేసి
ముట్టిచూసి మునగక మూలుగుతావే ముదనష్టపోడా!
నీవు దరిలేక ఆకలిదప్పిక వేయక వేచి చూసి నిట్టూర్చి
పగలూ రాత్రీ కానరాక నిరీక్షిస్తున్నా కనులు కాయకాసి
వంక చెప్పి బద్మాష్ లెక్కలు వేయక బేగిరం రావయ్యా!
Amazing Picture
ReplyDeleteBe safe & healthy
ఎంత మోజుపుడితే మాత్రం అంత నాటు సరసమా మరీనూ, చిత్రము చూపు మళ్ళించుకోలేనట్లు చేస్తుంది.
ReplyDeleteనేను తాళలేను అమ్మో
ReplyDeleteఈ విరహము ఎడబాటు
మనసు చిందరబందర రోగం
ఇంతలా స్త్రీలు విరహాన్ని
ఈకవితా నాయికలే చూపుతారు
ekkado guchchutundi mojutho mullu
ReplyDeleteno kopam madam...just for fun
డిస్క్రీట్ ఖణేళ్ హాచి సురుక్ కు తగ్గిపోయే మోజు
ReplyDeleteఅవన్నిటి చోట కోవిడ్ మహమ్మారి* దులుపుతోంది బూజు
కెమెరా యఫమ్ టీవిలకు తగ్గిపోలేదా మోజు
వాటి స్థానాన చేరవచ్చే సుమారుట్ ఫవన్ రీవాజు
ఈరోజున యావత్ ప్రపంచం అల్లకల్లోలం ఉక్కిరిబిక్కిరి
ఎవరికి వారై జనాల నడుమ సన్నిహిత లోపమే వైఖరి
దగ్గినా తుమ్మినా వాంతినా జ్వరించినా వలదు జాగు
ఏ పుట్టన ఏ పామున్నదో కనుకనే జాగ్రతతోనే మెలుగు
* తగు జాగ్రతలు పాటిస్తు, ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తు, అత్యవసర పరిస్థితుల వేళ బయటకు వచ్చి ముక్కు, కన్నులను తాకకుండ, ఎక్కువ జనాల సమూహం వైపు వెళ్ళకుండ, మాస్క్ ను అలంకార ప్రాయంగా కాకుండ రక్షణ కవచంగా భావిస్తు థర్డ్ వేవ్ రాకుండ ఆపగలిగే ప్రయత్నం అందరి బాధ్యత. జై హింద్
తగు రీతిలో ఇస్తిరి జాగృతి వచనాలు claps to you.
Deleteಸಾಯಿದೃಪಾವರೇ ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು.
Deleteమోజు మోటు సరసం
ReplyDeleteఅహా హా హా బొమ్మ అదుర్స్
enti madamintha ghoram tittinaru, papam ala tidithe inka emi vastadu? khalas khalas
ReplyDeleteగబ గబా రెండుగుటకల నీళ్ళుతాగితే
ReplyDeleteపొలమారె హఛ్చీ హఛ్చీ హఛ్చీ
హఛ్చీహఛ్చీహఛ్చీ
హఛ్చీహఛ్చీహఛ్చీ
-----------------
అందమైన చిత్రముతో అలరించారు.
ReplyDeleteవయ్యారి భామ మోజుతో రమ్మంటే రాకుండా ఉంటారా!
ReplyDeleteఅందులోను మహా రంజుతో తిడుతుందాయీ.....:)
మోజులో ఉన్నప్పుడు నచ్చిన మాటలు తిట్టిన తిట్లు మోజు తీరినాక హుష్ కాకి అయిపోతాయి. అందుకే జర భధ్రంగా ఉండాలి ఎవరైనా.
ReplyDeleteRomantic rogam idi
ReplyDeleteకరోనా కల్లోలంలో ఎక్కడో చిక్కుని ఉండవచ్చునండి
ReplyDeleteకంగారు పడకండి అన్నీ సర్దుకున్నాక లగెత్తుకొస్తాడు.
అన్ని దారులు మూసుకుని పోయాయి కదోలమ్మో:(
ReplyDeleteముట్టిచూసి మునగక :)
ReplyDeleteమనసు మోజుపడితే పర్వాలేదు
ReplyDeleteమైండ్ బ్లాక్ అయితేనే ముప్పు
తడవ తడవకూ తుమ్మినప్పుడంతా తలపుల్లోకొచ్చి,తనువు అంతా జ్ఞాపకాలతో తడిమి తడిమి తడిచేసి,తలవకుండా ఉండంటావు ఏందోయ్ నీ తస్సదియ్యా...వారే వాహ్!!!
ReplyDeletedaggu
ReplyDeletetummu
jalubu
idi ade rogam.
ఇంకెన్ని కాలాలు ఇలా కలలతో సహజీవనం చేస్తారు.
ReplyDeleteఏదో పెద్ద రోగం
ReplyDeleteమోజు తీరక ముందు వెంటపడి, తీరినాక వదిలేయకుంటే అదే పెద్ద ట్రీట్మెంట్ అనుకోవాల్సి వస్తుందేమో పిల్లోయ్ జాగ్రత్త.
ReplyDeleteరెండు గుటకలతో తీరేటి దాహం కాదు ఇది బిందెలు కొద్దీ స్వాహా చెయ్యాలి
ReplyDeleteఅందరికీ నా నమస్సులు _/\_
ReplyDeleteరోగం పైనే మోజు :)
ReplyDeleteAMAZING DEAR
ReplyDeleteWonderful
ReplyDeleteకాదేదీ కవితకు అనర్హం-ఖళ్ ఖళ్ హాచ్చీ
ReplyDeleteఅద్భుత కాల్పనిక కవితాచిత్రము.
ReplyDeleteAdbhutam
ReplyDeletemanasu doechinaru
ReplyDeleteఅద్భుతమైన ఆనంద అనుభూతి.
ReplyDelete