వైద్యురాలినై సేవ చేయాలని తడి ఇసుకలో
చూపుడువేలుని ఆశల సిరాలో ముంచి రాసా
చదవడం కాదు చేయాల్సిన ప్రయత్నం చేసా
ఆ అదృష్టం అలలా వచ్చి కొట్టుకుపోయింది!
న్యాయవాదినై వాదించాలని మండు ఎండలో
చట్టాల గురించి చెట్టు నీడలోన చదివి అలసా
చెప్పులు అరిగేలా తిరిగి గట్టి ప్రయత్నం చేసా
ఆ ఆశ కూడా ఎండకు ఆవిరై చెమటకార్చింది!
ఇంజనీరునై ఏ రంగాన్నైనా గెలవాలని వర్షంలో
చదివి తడిసి చిరిగిన పుస్తకాల్ని విసిరి పడేసా
పగబట్టిన పేజీల్ని బ్రతిమిలాడే ప్రయత్నం చేసా
ఆ జ్ఞానం అక్కరకురాని ఇంద్రధనస్సై పోయింది!
పైలట్ నై విమానం నడిపి ఎగరాలి ఆకాశంలో
ఆలోచన వచ్చిందే తడవుగా ధరకాస్తు చేసేసా
ఒడ్డూ పొడవు తెలివితో చివరి ప్రయత్నం చేసా
ఆ పనికీ పైసలకే ఫైలెట్ పాఠాలని తెలిసింది!
ఆఫీసర్ అయితే ఒకప్రత్యేక గుర్తింపు అందరిలో
అలాగని అహర్నిశా పుస్తకం చేతపట్టి చదివేసా
చదివింది చాలని పెళ్ళిచేస్తే అత్తారింట అడుగేసా
ఇంకేంటి కలలు కరిగినా జీవితమైతే సాగుతుంది!
What you achieved is more than enough.
ReplyDeleteవైద్యం వైవిద్యభరితం నాడు
ReplyDeleteఒక వైరస్ ధాటికి కుదేలు నేడు
ఐనా కొన ఊపిరితో పోరు నెంచి
మూడు శాతం మందికైనా చేస్తోంది మంచి
ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసిజర్ కోడ్
న్యాయం దిశగా చట్టపరమైన చర్యకు లా సూట్
ఎదిరించి ధీటుగా పూర్వపరాల పర్యవేక్షణలో సాగుతు
నేరాన్ని కూకటివేళ్ళతో పెకిలించే సాహసోపేత కర్మకు ఊతమిస్తు
ముడి సరుకును మానవాళికి ఉపయుక్తమైన సాధనగా మలిచి
డిస్క్రీట్ కాంపోనెంట్స్ ను ఒకదానికి మరొకటి సంధానమిచ్చి
ప్రౌద్యోగికరణను అభియాంత్రికతతో సాంకేతిక నైపుణ్యానికి ముడివేస్తు
నిత్యం పరిశోధన కే పెద్దపీట వేస్తు దేశ ప్రగతికై కాంక్షిస్తు
కాక్‌పిట్ కంట్రోల్ ప్యానెల్ లో హెడింగ్ సెట్ చేసి
చెక్‌లిస్ట్ సాంతం ఓపికగా స్కిమ్ చేసి
యోక్ రడ్డర్ పెడల్ సైడ్ స్టిక్ యాక్టివేట్ చేసి
వీవన్ రొటేట్ స్పీడ్ అచీవవుతూనే ఏటిసి కమాండ్ లతో టేకాఫ్
హయ్యారే ఇంకా ఏమి సాధించాలని??????
ReplyDeleteఅన్నింటినీ మించిన పోస్ట్లో ఉన్నారు
ReplyDeleteపెళ్ళాం అంటనే పెద్ద పవర్ఫుల్ కదా
కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్లు ఉన్నారు పద్మగారు.
ReplyDeleteవృత్తి ఏది ఎంచుకున్నా దానికి న్యాయం చేయాలి. మీరు చేస్తున్న వృత్తి ఎంతో గొప్పది. ఇంకా ఈ నిరాశా వేదాంతం ఎందుకు మీలో?
ReplyDeleteintakoo meeru chadivindi eamiti?
ReplyDeleteకోరికలు అంటేనే ఎప్పుడూ తీరనివి కదా?
ReplyDeleteAnnee okkaru ela chestaru
ReplyDeleteanduke GOD decide chesinaru ila
వందనములు మాతా మీకు.
ReplyDeletejob leni valu chala mandi unnaru. pelli chesukuni intlo bandhinchabadina vari mata emiti madam?
ReplyDeleteడాక్టర్
ReplyDeleteపైలెట్
ఇంజనీర్
లాయర్
సినిమాల్లో చేరితే అన్ని వేషాలూ వెయ్యచ్చు.
ఏడవలేక నవ్వుతున్నట్లు ఉంది> :) :(
ReplyDeleteమనుసు వ్యధనా ఏమీ కాలేదని?
ReplyDeleteలేక కవిత కోసం అల్లిన కధనమా?
meru ala anukunte memu magallamu yemi anukuni uddharinchali madam. all you know still no satisfaction.
ReplyDeletePlease Don't Confuse Me :)
ReplyDeleteantarleenam avedana kanabadutundi. bagundi andi
ReplyDeleteఅందరిలోను ఏదోక ప్రత్యేకత ఉంటుంది.
ReplyDeleteనిరాశతో జీవించకండీ...ఇంకా ఢీలా పడతారు
వేదన అహంకారము సమపాళ్ళలో రంగరించారు.
ReplyDeleteఅవ్వాలి చెయ్యాలి అనుకున్న అన్నీ చేసివేయ గలిగితె ఇంక దేవుడు ఎందుకు మన మొక్కుకో వలసిన పని ఉండదు అందుకే ఇలా చేస్తారు అనిపిస్తుంది నాకు.
ReplyDeleteSerious topic
ReplyDeleteNot possible to decide
అదృష్టం అలలా వచ్చి కొట్టుకుపోయింది-True
ReplyDeleteఅన్నీ మన చేతుల్లో ఉన్నాయ్ అనుకోవటం మన భ్రమ
ReplyDeleteఏదైనా చెయ్యలి అనుకుని ప్రయత్నించడమే మన వంతు
ఆపై అంతా పైవాని దయ.చేయవలసింది చేసి చూస్తూ ఉండటమే
హాఖాషవాని హయట్ణఘఱ్ ఖేంఢ్రం.. ణిళయంలో షమయం ఱెందు ఘంఠళ ఫఢి ణీంసాల్.. ఖాఠ్ఫాఢీ నూణ్‌ఢి ఱీళె ప్రషాఱమింథట్తో సమాఫ్టం.. టిఱ్ఘీ ఉడ్యం ఫ్రఛాఱంళో మిడియం వేవ్ ఎంప్లిటుడ్ మాడిలోషిన్ పై పునః ప్రారంభం.. అంథ వరక్ సేలవ్.. నమసుప్పు
Deleteమానవ ప్రయత్నం నిరర్ధకం.
ReplyDeleteఅలా ప్రశ్నించుకుంటే ఎవ్వరూ ఏమీ ఉద్దరించి ఉండరు.
ReplyDelete_/\_పద్మార్పిత పదవందనములు _/\_
ReplyDelete