అన్నీ నీవంటి..

నువ్వే నా ఆశ నిరాశ కూడా నీవల్లే కదా
నువ్వే నా ఆకలి అది తీర్చేది నువ్వే కదా
నువ్వే నా నిద్ర నీగుండే నాతలదిండు కదా
అయినా మంచం కంచం మాత్రం వేరు కదా

నువ్వే నాసుఖం దుఃఖం కూడా నీతోటే కదా
నువ్వే నా రాగంతాళంపల్లవి అయ్యావు కదా
నువ్వే ఊపిరని నిశ్వాసలో నిన్ను వీడ కదా
అయినా నువ్వు అక్కడా నేను ఇక్కడ కదా

నువ్వే నా కవనం అక్షరరూపమూ నీవే కదా
నువ్వే నా ఆదీ అంతమూ నీతో ఉంటా కదా
నువ్వే నా చైతన్య నాంది ప్రేమపునాదివి కదా
అయినా కంటికి ఎదురుగా ఉండవెందుకో కదా

నువ్వే నాఅస్త్రం అంతకు మించి అవసరం కదా
నువ్వే నా ఆలోచన ఆసరా కూడా నువ్వే కదా
నువ్వే భయభ్రాంతుల్ని తరిమే తాయత్తువి కదా
అయినా ఉండీ లేనట్టి దేవుడు దెయ్యానివి కదా

32 comments:

  1. ప్రేమ పొంగి పొర్లిన వేళ వచ్చే భావచిత్రం అందగా రంగులు అద్దుకున్నది.

    ReplyDelete
  2. నువ్వే నువ్వే అంటుంది నాప్రాణం
    పాడుకోండి ఇద్దరూ.....

    ReplyDelete
    Replies
    1. [నువ్వే నువ్వే] కావాలి [అంటుంది] పదే పదే [నాప్రాణం]

      గీ పాట యాది కొచ్చినాద్ మీ వ్యాఖ్య జూసినఁక..!

      Delete
  3. Beautiful emotions expressed

    ReplyDelete
  4. Ghataina premaku aatu potlu tappavu
    chitramu chuda bagunnadi.

    ReplyDelete
    Replies
    1. [ఘాటైన ప్రేమ ఘటన.. ధీటైన మేటి నటన]
      ఈ పాట గుర్తుకొచ్చింది మీ టపి వ్యాఖ్య ను చూసినపుడు

      Delete
  5. ప్రేమ ఎంత మధురమో అంత విషాదము కూడా కదండీ.

    ReplyDelete
    Replies
    1. [ప్రేమ ఎంత మధురం పిరియ రాలు అంత కఠినం] పాట హర్దే అయో మన

      Delete
  6. నిద్దురలో మెలుకువలో ఇద్దరూ ఒకే కలగంటూ
    ప్రేమకు మబ్బే కరిగి భూమిపై జల్లులాకురుస్తుంది
    మన్ను మిన్ను కలిసి హరివిల్లులా మారుతుంది...ప్రేమైక భావం బాగుంది

    ReplyDelete
    Replies
    1. [మన్ను మిన్ను కలిపే హరివిల్లవదా.. దోస్త్ మేరా దోస్త్] అనే పాట గుర్తుకొచ్చింది మీ వ్యాఖ్యతో

      Delete
  7. ప్డేమ ఇషాదం నింపుటది
    ప్డేమ సంతోజం పంచదతి

    ప్డేమ హఱిల్లు తలుస్తాది
    ప్డేమ భూపెకంపనల్ సుస్‌టిదతి

    ప్డేమ ఇలవ మనసుకే ఎరుకతది
    ప్డేమ సాచాత్తు మనిషికే తెలుదతి

    ~శ్డీథ తరడి

    ReplyDelete
  8. Painting post superb madam.

    ReplyDelete
  9. ఎక్కడో ఎదను మెలిపెడుతుంటాయి మీ కవితలు. కుడోస్

    ReplyDelete
  10. భయభ్రాంతుల్ని తరిమే తాయత్తు
    కొత్త పోలిక బాగుంది.

    ReplyDelete
  11. premanu express chesina vidhanam nachchindi madam

    ReplyDelete
  12. ఇద్దరూ కలిసి ఉంటేనే కదా కోలాటం ఆడేది లేకుంటే బ్రతకడమే ఒక పోరాటం అవుతుంది. శృతిలయ కలసినప్పుడు గీతం వినసొంపు అవుతుంది. ఒకరి యద చప్పుడు ఇంకొకరు వినలేనప్పుడు ఎండలో వెన్నెల కోరుకోవటం లాంటిది కదా ఆశ. భావుకధకు పట్టం కట్టినట్లు ఉన్నాయి మీరు వ్రాసిన పదపంక్తులు. అభినందనలు పద్మార్పితగారు.

    ReplyDelete
    Replies
    1. [డాండియ ఆటలు ఆడ.. గుజరాత్ పడచులు పాడ] అనే పాట.. [కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం] అనే పాట.. గుర్తుకొస్తారామ్ గారు

      Delete
  13. Replies
    1. [ఏ చోట ఉన్నా.. నీ వెంట లేనా] అనే పాట గుర్తుకు వచ్చింది మీ వ్యాఖ్య మూలన విల్సన్ గారు.

      Delete
  14. నా రాగం తాళం పల్లవి నువ్వే..

    ReplyDelete
  15. Anuragamtho aalinganam

    ReplyDelete
  16. మీకు మీరు ఏమీ కానట్లేనా..అన్నీ నువ్వే నువ్వే అంటే

    ReplyDelete
  17. చిత్రము ఎంతో నచ్చేసింది.
    నేను తస్కరించేసాను.

    ReplyDelete
    Replies
    1. జులై లో బడుల తీత.. ఆగస్టులో ఫీజుల మోత.. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ రోత.. అక్టోబర్ లో లాక్‌డౌన్ తో మూత.. నవంబర్ లో వ్యాక్సిన్ల కొరత.. డిసెంబర్ లో డాక్టర్ల నలత.. ఎటుపోతుందో తెలియని సన్నని గీత..

      Delete
    2. Correct Sridhartha

      Delete
    3. Thank you Sri(dharani)tha for relevant song replies :)

      Delete
  18. అందరి అభిమాన స్పందనలకు అర్పిత వందనములు.

    ReplyDelete