కాగితాలతో కాపురాలు నిలచి కూలే కాలంలో
కళ్యాణవైభోగమంటూ కంచిపట్టు చీరలు నగలని
ఖరీదైన కాగితాల్ని ఖర్చు చేయడం ఎందుకు?
కాగితాలే మనిషి చావు పుట్టుకల్ని నిర్ధారిస్తుంటే
పుట్టిన ప్రాణి బ్రతికి చావడానికి కాగితం కావలిస్తే
చచ్చిన మనిషి కనబడి మాత్రం చేసేది ఏంటి?
కాగితాలకూ దస్తావేదులకూ విలువ ఉన్నప్పుడు
మనిషికి మానవతా విలువల నీతులు భోదించి
భాంధవ్య బంధాల బంకను అంటించడం దేనికి?
కాగితాలపై రాసుకున్న రాతలే కావలసినవి చేస్తే
కార్యాచరణలను కట్టుబాట్లనూ బలవంతంగా కక్కి
అందులోనే పడిపొర్లితే దక్కేటి ఆస్తిపాస్తులు ఎన్ని?
కాగితాలకే అన్ని రంగాల్లోనూ ఆధిక్యత ఉన్నట్లైతే
భూమేకాదు బూడిద సైతం కాగితానికి గులామవ్వ
దర్జాగా వెట్టిచాకిరీ చేస్తున్న బ్రతుకులకి అర్థమేంటి?
ప్రతీ ప్రాణికీ నోటుతో పనిలేదు మేడంగారు కేవలం మనిషికి మాత్రమే ఆ కాగితంతో పని. ఆలోచనతో కూడున రాతను వ్రాసారు. అభినందనలు.
ReplyDeleteఖరీదైన కాగితం కోసం మనిషి ప్రాణాలను సైతం లెక్కచేయడు కదా.
ReplyDeleteలోకం అంతా మనీ మనీ మనీ అని ఎప్పుడో చెప్పారు...well said
At present in this pandemic there is no use.
ReplyDeleteగర్భాలయంలో ఆత్మజ్యోతి వెలిగిన రోజు
ReplyDeleteమ్యాటర్నిటి హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో సోనోగ్రాం రిపోర్ట్
డబల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ మార్కర్, తరువాయి టిఫ్ఫా రిపోర్ట్.
ఏదైనా తేడా కొడితే మరల యామ్నియోసెంటెసిస్ రిపోర్ట్.
తీరా జన్మ పొందినాక మీ సేవ సెంటర్లో బర్త్ రికార్డ్ రిపోర్ట్
ఈ రిపోర్ట్ లన్నిటికి మూల ఇంధనం పైసల్.
నేటి ఈ కోవిడ్~౧౯ వెర్షన్ ౨ రిలీజ్ బీటా వేరియెంట్ డెల్టా ప్లస్ సమయాన
పేటియం, జీపే, ఫోన్పే, అమేజాన్పే, భారత్పే, యన్పిసీఐ యూపిఐ, ఆర్టిజీయస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లతో నిమిషాల నిడివిలో రుసూం ఫిగర్ల మార్పిడి.
పుట్టుక చావు నడుమన రెక్కలు లేని కాయితం నలుగురి చేతిలో చెల్లుతు, చివరాఖరి మజిలి దాక పయనాన్ని నిర్దేశించే కాగిత ముద్ర.. డబ్బు, వీలునామ దస్తావేజు, మెడికల్ రిపోర్ట్, బర్త్, ఎడ్యూకెషన్, ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్లు.. వీటి చుట్టే మనిషి జీవితం ముడి. ఎలా బ్రతికినా చివరికి అనంత వాయువే గతి అనేదే నానుడి.
kagitam ki unna viluva manishiki ekkadidi? :(
Deleteఅదే విస్తు గొలిపే సత్యం, గంట గారు.. జీర్ణించుకోలేని నిజం. అదేదో మూవిలో చెప్పినట్టు మనిషికి విలువ లేదు కాని మనికి విలువ ఉంది. మనిషి ఆయువు చెల్లినాక పిడతడు బూడిత. అదే డబ్బు వస్తు ఉంటుంది, పోతు ఉంటుంది. మనిషి లేని రోజున కూడా డబ్బు మాత్రం అలానే చేతులు మారుతు ఉంటుంది.
Deletetella kagitam manishi jeevitam
ReplyDeleteoko aksharam prati nimusham antoo padukovali.
Chitramu prasnistundi
ReplyDeletejavabu ivali mari :)
కాగితం ఏదైనా చిరిగితే పనికిరాదు కదండీ
ReplyDeleteఅందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మనం
ఖరీదైన కాగితం
ReplyDeletekagitam aneadi manishi jeevitamuto mudipadi undi danini manam malachukune teeruloe untundi anedi na nammakamu.
ReplyDeleteకాగితాలే మనిషి చావు పుట్టుకల్ని నిర్ధారిస్తున్నది. ఇది కరెక్టు
ReplyDeleteyemito artham aiee kanatlu undi
ReplyDeleteమ్మ్ మొత్తానికి కాగితం గురించి కాగితం పైన లిఖించారు.
ReplyDeleteభూమే కాదు బూడిద సైతం కాగితానికి గులాము, కాగితాలే మనిషి చావు పుట్టుకలను నిర్ధారిస్తున్నవి. వెల్ సెడ్ మాడం
ReplyDeleteపూర్వం నాణ్యాలతో జీవితం సజావుగా సాగేది. ఇప్పుడు కాగితం/నోటు వచ్చిన తరువాత అంతా అరాచకమే అనుకోవాలి. ,ఈ ఆలోచనలకు అక్షరాల్లో ఇదేనా అర్థం అని అడుగుతున్నాము.
ReplyDeleteఒకవేళ అదే నిజం అనుకుంటే అప్పట్లో ఇప్పటికన్నా బానిస బ్రతుకు ఎక్కవగ ఉండేది కదండీ. అయినా ప్రతీ దానికీ ఏదో ఒక నిర్ధిష్టమైన ప్రణాలిక లేకుండా ఏది జరుగ అని నా అభిప్రాయము.
వెలకట్టలేని విలువైనది కాగితం.
ReplyDeleteSo Beautiful blog
ReplyDeleteజీవితం కాగితం కంటే గొప్పది.
ReplyDeleteమనసుని దగ్గర చేస్తాయి మీ వాక్యాలు.
ReplyDeleteఅందరికీ అభివందనములు-పద్మార్పిత
ReplyDelete