తుదిధ్యాస..

తలపు తరంగాల్లో తడిసిన రెక్కలు
కూసింత సూర్యరశ్మిని కావాలనడగ
నీలి ఆకాశం కళ్ళనిండా నీరు నింపె
మొహమాటపు మనసు మాట్లాడలేక
తడిరెక్కలతో ఎగురలేక వణకి అలసె!

దిక్కుతోచని నిస్సహాయపు గాలులు
నిర్జనరహదారిపై సిగ్గునీడల్ని శపించగ
చేసిన పాపం ఏంటో చెప్పని ప్రశ్నించె
ఉదాసీనపు ఊపిరి శ్వాస పీల్చుకోలేక
పిరికిని ధైర్యపు కిటికీ నుండి తరిమేసె!

ఆవేశంతో మండి భగ్గుమన్న గుండెలు
మంచుపర్వతాల్లో సూర్యుడు అస్తమించగ
ఉప్పకన్నీటితో గాయాలు మరింతమండె
సుదీర్ఘ పయనం ఎవ్వరి సహకారంలేక
గాలి వీచిన వైపు ఎగిరిపోయి ముగిసె!

23 comments:

  1. తలపుల తరంగాల్లో తడవటం అద్భుత భావం.

    ReplyDelete
  2. మునగాలి తేలాలి తడవాలి ఆరాలి అంతే కానీ ముగియడం బరువైన వక్యం. బొమ్మ మాత్రం సూపర్.

    ReplyDelete
  3. Gundello guchhukunnna feel
    fantastic picture padmagaru.

    ReplyDelete
  4. ఎంతటెంతటి మదిలో భావజాలం
    చటుక్కున కదలాడే మనసు గేయం

    ReplyDelete
  5. Adbhutam mee rachanalu.

    ReplyDelete
  6. చిత్రము చింపి చంపేసింది
    మీ భావాలు మనసుని మెలిపెట్టినాయి

    ReplyDelete
  7. ఆవేశంతో గుండెలు భగ్గున మండితే మంచుపర్వతాల్లో సూర్యుడు అస్తమించడం అతీతం అద్భుతం.

    ReplyDelete
  8. Photo super ga undi andi.

    ReplyDelete
  9. సుదీర్ఘ పయనం ఎవ్వరి సహకారం లేకపోతే జరిగేది చివరికి చావు మాత్రమే అని బాగా చెప్పారు.

    ReplyDelete
  10. Painful words ni saitam sensitive way lo cheppagalaru meru.

    ReplyDelete
  11. నిర్జన రహదారిపై సిగ్గు నీడల్ని వీడి పయనించడం అసాధ్యం ఏమో అందరికి...చక్కని భావాన్ని పలికించారు పదాల్లో.

    ReplyDelete
  12. తుదిశ్వాస ఉన్నంత వరకు ఇది తొలి ధ్యాసనే అవుతుందండీ అహా హా హా హా

    ReplyDelete
  13. ఆవేదన
    ఆలోచన
    అక్షరాల్లో
    అందించిన
    భావన బాగుంది.

    ReplyDelete
  14. Title meaning THE END kadaa....

    ReplyDelete
  15. mee blog chuda mucchatatoe undi.

    ReplyDelete
  16. Excellent paintings
    fidaa aipotaru evaraina
    amazing collections you have

    ReplyDelete
  17. తలపులలో తడచి

    ఎదురుచుపులు చూచి

    వలపు విరహంతో వగచి

    వ్యధతాపంతో కవిత రచించి

    మది చలించే బొమ్మ గాంచి..

    ReplyDelete
  18. నీలి ఆకాశం కళ్ళనిండా నీరు :(

    ReplyDelete
  19. అందరి ఆత్మీయస్పందనలకు అభివందనములు

    ReplyDelete
  20. andamaina sthri hrudayam

    ReplyDelete
  21. meelane mee chitramu kooda. lovely andi

    ReplyDelete