గట్టికౌగిలి...

కావాలీ కావాలీ నాకొక కౌగిలింత కావాలీ
పట్టుకుంటే వీడిపోలేని కౌగిలింత కావాలి!

పరిచయాల పెనవేతలో చేతులు కలవాలీ
మనసులు నగ్నమై రాసలీలగాది సాగాలి!

అల్లాటపా కౌగిలింతలకి భిన్నంగా ఉండాలీ
వదిలేయ్ అంటుంటే మరింత దగ్గరవ్వాలి!

రెండు చేతుల నడుమ పూర్తిగా ఒదగాలీ
జిగురులా ఇద్దరం ఒకటై అతుక్కుపోవాలి!

బిగికౌగిట అతుక్కున్న బంక బంధమవ్వాలీ
అలసిన తనువులు కనులతో ఊసులాడాలి!

మాటలమాల మౌనంతో మూతితిప్పుకోవాలీ
గాలైనా చొరబడనంత గట్టిగా వాటేసుకోవాలి!

స్పర్శచే స్వేదమే సుమసౌరభాలు వెదజల్లాలీ
చిత్తడిచిత్తడైన ప్రేమ పురివిప్పి నాట్యమాడాలి!
మమతలమెలిలో మన్వంతరము కొనసాగాలీ
అలా నా ఊపిరి తన ఎదపై విడిచేసిపోవాలి!

27 comments:

  1. బిగికౌగిలింతలో బిగుసుకుపోవటం అబ్బా అమ్మో అహా!!!!!!!!!

    ReplyDelete
  2. పద్మగారు...ఇంకా ఇలాగే కౌగిలింతలోనే ఒదిగిపోవాలీ
    కావాలని పాడుకోవడం కోరుకోవడమేనా :) :) :)

    ReplyDelete
  3. Medam lovely post...a hug to your boosting words

    ReplyDelete
  4. పరిచయాల పెనవేత బాగుంది.

    ReplyDelete
  5. Kaugilinta katnam adagandi madam :)

    ReplyDelete
  6. మాటలు మౌనం దాలుస్తాయి కౌగిలింతలలో...

    ReplyDelete
  7. bigigaugili lo undipondi.

    ReplyDelete
  8. కౌగిలింతలు గిలిగింతలు పెట్టినట్లు ఉన్నవి మీరు వ్రాసిన పదకవితలు.
    బాపుగారి వలపు జంట చిత్రము ఎంతో బాగుంది.

    ReplyDelete
  9. చిత్తడిచిత్తడైన ప్రేమ!

    ReplyDelete
  10. ప్రతి ఒక్కరికి శారీరక స్పర్శ అవసరం. మనిషి కనిపెట్టిన అద్భుతమైన విషయాలలో ఒక సాధారణ కౌగిలింత ఒకటి. ఇది ఒకదానికొకటి సహాయపడటానికి, శక్తిని ప్రసారం చేయడానికి మరియు అదే సమయంలో దానిని అదే స్థాయిలో స్వీకరించడానికి ఉద్దేశించబడింది.

    ReplyDelete
  11. కౌగిలించుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్‌, డోపమైన్‌, సెరొటోనిన్ అనే రసాయనాలు విడులవుతాయి.
    ఇవి మెదడును శాంత పరుస్తాయి. దీని వల్ల మూడ్ మారుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. మరింత ఉత్సాహంతో ఉంటారు ఆ రోజు అందుకే తెలివైనవారు కౌగిలించుకోమనే అడుగుతారు. పద్మార్పిత తెలివైనదని మరోమారు రుజువు చేసుకున్నది :)

    ReplyDelete
  12. చూసేచూపులు
    కురిసే సుధలు
    పలికే పలుకులు
    మమతల చినుకులు
    ఎగసిన వలపులు
    ళెక్కలేని కౌగిలింతలు..

    ReplyDelete
  13. Chilipi aksharalu :)

    ReplyDelete
  14. ఆలింగనం చేసుకుంటే పదునైన అనుభూతులు కూడా సున్నితంగా మారి ప్రేమ సమృద్ధితో మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకే గౌగిలింత ఎంత గట్టిది అయితే అంత మంచిదే సుమా!

    ReplyDelete
  15. కడలి కెరటాలు ఒడ్డున చేరటానికి ఆరాటం
    ఉదయించే సూర్యుడు తూరుపున తెలవారుతు పడమరన దాగాలని ఉబలాటం
    తనువు మనసు ఎదురెదురుగ నిలిచే సమయాన ఒదిగిపోవాలనే టాటాఢం (జస్ట్ ఫర్ రైమింగ్, నో మీనింగ్ ఆఫ్ టాటాఢం)

    ReplyDelete
    Replies
    1. from the same rhythm, we tune, we equalize, we toggle switches, we slide until we get the desired music at a desired tempo, same is with life. so play on.

      Delete
  16. రెండు చేతుల నడుమ పూర్తిగా ఒదగాలీ
    Lovely feel..

    ReplyDelete
  17. అందరికి కావలని ఉన్న ఒక మంచి స్మరణ

    ReplyDelete
  18. మమతల మెలిలో బాగుంది.

    ReplyDelete
  19. అల్లాటపా కౌగిలింతలకి భిన్నంగా ఉండాలీ???

    ReplyDelete
  20. Adurs kada mee kaugilintala kadha kadu kavita

    ReplyDelete
  21. _/\_అందరికీ వందనములు_/\_

    ReplyDelete