నిష్ప్రయోజనం

కాంతిపుంజాలు విప్పారి వెలిగి ఏం ఉపయోగం
ఎగసిపడే ఆశలే నల్లనిమసై ముఖాన్ని అంటితే

వలపుని వాయిదాపై తీరుస్తానంటే ఏం న్యాయం
ముక్కలైన మనసు ప్రతిస్పందించలేక వాలిపోతే

విరిగిన గోడనానుకుని ఆసరాని ఏం సమంజసం
పరువపు పచ్చి ఇసుకతో కట్టిన గూళ్ళే కూలితే

భీతిల్లి బిక్కుమంటూ బ్రతుకీడ్చి ఏం ప్రయోజనం
జీవితమే తెలియక సగానికిపైగా కాలిబూడిదైపోతే

నిర్మానుష్య రేయి ప్రశాంతంగా ఉండి ఏం లాభం
కరిగి క్షీణించిన రేయిలో అకస్మాత్తుగా అంతమైతే..

15 comments:

  1. ప్రయోజము ఏదీ లేదనే నిరాశ ఎందుకు?
    ఏదో ఉందని ఆశ పడితే పోలా?

    ReplyDelete
  2. గట్టి పదునైన పదాలు.

    ReplyDelete
  3. విరిగిన గోడను ఆనుకుని ఆసరా అనుకోవడం నిష్ప్రయోజనం...వాస్తవిక దర్పణం అండీ

    ReplyDelete
  4. niraasa dwanistuna aksharaalu
    chitramu kuda anugunamtoe undi.

    ReplyDelete
  5. మనుషులు సిక్ అయ్యి
    బొమ్మలు నీరసంతో చిక్కి
    వ్రాసే కవితలు కూడా
    నిరాశగా ఉంటే ఎలా మేడం
    ????????????????

    ReplyDelete
  6. ఏదైనా వీగి పోవలసిందే.. ఇందులో ఎటువంటి సందేహం లేదు.. అలా అని ధైర్యాన్ని వీడకూడదు కదా.. గడిచిన క్షణం సైతం జ్ఞాపకముగా మదిలో నిక్షిప్తమై ఉంటుంది.. ఏదైనా కాలాణుగుణంగానే ఎదురవుతు ఉంటుంది.. కాలక్రమేణ కను మరుగవుతుంది.. ప్రకృతి ధర్మం నియమ మిదే.. ఆశ నిరాశల నడుమ జీవితమొక తక్కెట.. దిగాలు పడటం ఎందుకట.. ఏదెప్పుడు జరగాలో అదపుడే జరిగి తీరుతుంది.. కాదు కూడదంటే ఎట్లా..!

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  7. why always pathetic views. be cheer full padma.

    ReplyDelete
  8. మరో వేదన వేదాంత గీతం.

    ReplyDelete
  9. చిత్రములో సుందరి విచారంతో ఉన్నది కదా వాక్యాలు నవ్వుతున్నట్లు ఉందవిని గ్రహించాములెండి.

    ReplyDelete
  10. నిర్మానుష్య రేయి ప్రశాంతంగా..how it can?

    ReplyDelete
  11. ఇప్పుడు లోకంలో అన్ని పనులు వాయిదా పద్దతుల్లోనే జరుగుతున్నాయి. అటువంటప్పుడు వలపు కూడా వాయిదాల పైన అవసరానికి తగినట్లు జరగడంలో తపులేదని నా అభిప్రాయము పద్మార్పితగారు.
    ఆలోచనా పరంగా సాగుతుంటాయి మీ కవితలు. అభినందనలు మీకు.

    ReplyDelete
  12. నిర్మానుష్యమైన రాత్రి అయితే ప్రశాంతం కదా ఇంకా ఎందుకు ఇది.

    ReplyDelete
  13. Nice painting with sad solo lyrics :(

    ReplyDelete
  14. _/\_వందనమస్తు_/\_

    ReplyDelete