కిక్ కసి ..

కోక్ పెప్సీ సోడాతో కాక రా కొట్టాలన్నంత కసి..
గుండెని కోసీ మిక్సీలో బాగామెత్తగా రుబ్బి తీసి
ముద్దని గుప్పెట్లో పట్టుకుని క్రిందాపైకీ ఎగురవేసి
బంతితో ఆడినట్లు ఆటాడి విసుగుపుడితే విసిరేసి
ఏమైందని అమాయకంగా అడిగితే రగిలినట్లు కసి!
పద్మార్పిత బొమ్మలే సెక్సీ రాతల్లో కనబడని కసి..
ఫోటోలు చూసి భారంగా నిట్టూర్పు విడిచేసి అలసి
ఎవరికి వారే అదీఇదనీ ఇష్టమొచ్చినట్లు ఊహించేసి
రమ్మూ బీరు వైన్ కలిపి కొట్టినట్లు రచ్చరచ్చ చేసి
నన్ను చూస్తేనే కానీ తీరదనుకోవాలా మీలోని కసి!
కాక్ టైల్లా అన్నీ కలిపి ఫుల్గా కొడితే తీరునేమో కసి..
కల్లూసారాయే కాదు ఆల్కాహాల్ ఏదైనా మత్తని తెలిసి
ఎందుకో అనిపిస్తుంది అన్నీకలిపి త్రాగేసి తాకాలి రోదసి
నక్షత్రాలను బుట్టలోవేసి చంద్రుడితో చిందేయాలి కలిసి
ఇదీ గత కొన్ని రోజులుగా నాలో చెలరేగుతున్న కసి!
కల్లుకొచ్చి ముంత దాచినట్లు కాక అనిపించింది చెప్పేస్తి
మీకు ఏం రాయాలి అనిపిస్తే అదిరాసి తీర్చుకోండి కసి!

16 comments:

  1. కసిలో కిక్ ఉందా ??????

    ReplyDelete
  2. అనుకుని తిట్టుకుని ఏమి ప్రయోజనం
    ఎలాగూ కనపడనిది ఈ జీవితం...

    ReplyDelete
  3. tagubotula mandu kottatam kick istundi antam baledu.

    ReplyDelete
  4. tagubothu avalani asha :)

    ReplyDelete
  5. మీరు మందులో కూడా మమతానురాగాలు చూడగలరు మాడం.

    ReplyDelete
  6. Rayadaniki emundiZ?
    intakoo kick ekkindi evariko cheppandi :)

    ReplyDelete
  7. బేషరం కహీకా....ఎవ్వరూ అని అడగొద్దు

    ReplyDelete
  8. మత్తు వచ్చే వరకూ తాగి చిత్తుగా రాసేయండి కవితలు. అయినా కల్లుని సారాయినీ కూడా విడవక తాగేద్దాం అనుకున్నారు చూసారు అదే కిక్....అహ హా హా

    ReplyDelete
  9. మీకు సరిపడదులెండి.
    మాకు వదిలేయండి మందుని :)

    ReplyDelete
  10. కూల్ డ్రింక్స్ తో కూల్ గా ఉండక మందుకొట్టి చిందులు వేయటం ఏమిటి పద్మార్పిత

    ReplyDelete
  11. గుర్రం ఎక్కుతారా
    హ హ్ అహ ఆ

    ReplyDelete
  12. madam ratalu kodavainaenduku? kshemame kadandi?

    ReplyDelete
  13. హాయ్...అందరికీ పద్మార్పిత నమస్సులు_/\_

    ReplyDelete