అలా జరిగింది!

గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేసితి
కురులు ఆరబోసి సాంబ్రాణి ధూపాన్ని వేసితి
నీకిష్టమైన పలుచని తెల్లచీరనే ఒంటికి చుట్టితి
నుదుటన నిలువుబొట్టు కంటికి కాటుక పెడితి
వళ్ళంతా వన్నెతగ్గని వగలనే నగలుగా వేసితి
తలలో మల్లెలుతురిమి గుమ్మంలో నీకై వేచితి!
చక్కని చూపుల వలలో చిక్కుతావని కలగంటి
నా నడుము వంపులో నక్కాలని ఊహల్లోఉంటి
కోరికల కొవ్వొత్తులు పడకగదిలో వెలిగించుకుంటి
చెప్పకున్నా నన్నునీవు చదివేస్తావు అనుకుంటి
వచ్చి ఇచ్చే చుంబన లాలాజలమే లేపనమంటి
ఈ విరహఉష్ణవ దాహం నీవే తీర్చగలవనుకుంటి!
అలా ఎదురుచూసిన నాకు నీరాక ఒక పిడిబాకు
ఇంటికొస్తూ రాగానే తేనీరు కావాలి అలసిన నీకు
స్నానం తరువాత రుచులు కోరతావు భోజనంకు
ప్రయాణబడలికతో నీ దేహం దాసోహం పాన్పుకు
ఇంకేం తలపులు రగిలించిన ఉత్తేజపు వేడి నాకు
ఆరాటం అందంగా ఆవిరైపోయింది నిట్టూర్పులకు!

27 comments:

  1. ఆరాటం అందంగా ఆవిరైపోయింది :)

    ReplyDelete
  2. talaku niiLLoekuni talapulloe tealinaa ఇంతకీ ఏమి జరిగినట్లులేదు.

    ReplyDelete
  3. 1 lady manasuloe chelaregina korikalaku darpanam amma mee ee kavita mariyu chitramu. abhinandanalu meeku.

    ReplyDelete
  4. chivarakarilo nittoorpu sega arindi

    ReplyDelete
  5. ఈరోజుల్లో ఎవరు నుదిటన నిలువు బొట్టు పెట్టి నగలు దిగేసుకునే వారు. ఇంటి వద్ద నైటీలు డ్రెస్సులు కదా వేసుకునేది అందుకే నీరుకార్చింది

    ReplyDelete
  6. అలా జరిగింది
    మీరు వ్రాసిన తీరు అదిరింది

    ReplyDelete
  7. meeru okosaari oko konanlo rastaru.

    ReplyDelete
  8. రసవత్తరంగా సాగిన సన్నివేశం
    రసత్తరరమ్యమైన చిత్రం అనుకుంటే చివరిలో నీరుకార్చారు కదండీ

    ReplyDelete
  9. తలపులు రగిలించిన ఉత్తేజపు వేడి నాకు
    ha ha ha :) :) :)

    ReplyDelete
  10. Wish You Happy Independence Day.

    ReplyDelete
  11. చివరిలో ట్విస్ట్ బాగున్నదండీ

    ReplyDelete
  12. అలా అలా ఎలా జరిగినా మమ్మల్ని అలరించారు మీ కవితాచిత్రముతో.

    ReplyDelete
  13. [16/08, 09:39] If you are going through *Hell*, keep going, because, the path to _Heaven_ is always trespassed by the path of Hell, if you cease moving, you will have to get stranded in the murky Hell, so move on.

    ~Winston Churchill

    _*Good Morning_*
    [16/08, 09:43] past is passe, past was something which you would have never expected before, but then, it went away with scars, when you can get through past, you can make through present too, perseverance is what it matters.
    [16/08, 09:53] _p: pain, a: agony, s: stress, t: trauma_
    when those four could not hinder your determination, then these six can't even dare touch you _f: fear, u: unrest, t: turmoil, u: unruly, r: restlessness, e: ego_
    [16/08, 09:57] past can never try to pinch you again, unless you move and keep moving in the present.

    ReplyDelete
  14. నిరుత్సాహంలో నుండి పుట్టిన కవిత.

    ReplyDelete
  15. Andamaina chitra rachana.

    ReplyDelete
  16. అలాంటి ఆంబోతుగాన్ని ఎలా ప్రేమించారండి

    ReplyDelete
  17. సలాం... మేడం... మీ అలుపెరగని పద ప్రయాణానికి...

    ReplyDelete
  18. andamaina akshara malalu mei E kavitalu

    ReplyDelete
  19. నీ దేహం దాసోహం

    ReplyDelete
  20. అందరికీ పద్మార్పిత వందనం.

    ReplyDelete
  21. పదాలు మురిపించి మరిపిస్తున్నాయి చిత్రంతో పాటు

    ReplyDelete
  22. Chala manchi padala koorpu

    ReplyDelete