ఎందుకిలా జరుగుతుందని ఎవరిని అడగాలి
చతికిలబడి సమయమెందుకు సాగుతుందిలా
సంతోషకరమైన క్షణాలను ఎక్కడని వెతకాలి?
నుదుటిరాతను ఎందుకిలా రాసావో చెప్పని
జీవితం ఇంకా ఎంత దూరం ఇలాగే సాగాలి
కలలు కళ్ళలోనే చెమటలు కక్కి కారిపోనేల
తడారని పెదవుల కోసం ఎక్కడని వెతకాలి?
మేలు చేస్తే పంపించిన దీవెనలు ఏంచేసావని
ఆకాశాన్ని తాకిన ఆశలు శాశ్వితముగా రాలి
శ్వాస ఎక్కడో మలుపుతిరిగి మరలివచ్చెనిలా
మదిని వదలిన స్పందనని ఎక్కడని వెతకాలి?
చిత్రంలో లాగా ప్రేమ కూడా వెలుగు నీడల లాంటిది... అన్నమాట!!
ReplyDeleteఅంతే కదండీ...జీవితంలో ప్రేమ వెలుగునీడల సయ్యాట
Deleteహృదయం ఉన్నప్పుడు వేదన తప్పదు మేడం. పెయింటింగ్ చాలా బాగుందండీ.
ReplyDeleteఎప్పుడూ వేదన రాస్తేనే తట్టుకోలేం...అనుభవించే వారికి కష్టం కదండీ
Deleteహృదయాన్ని వీడి మదిస్పందన వెళ్ళిపోతే ఇంక బ్రతికి మాత్రం ఎందుకు? నిర్జీవం అన్నట్లే కదా
ReplyDeleteఎందుకని చచ్చిపోలేం కదండీ.
Deleteమూగ మనసులో వేనవేల భావోద్వేగాలు
ReplyDeleteఊపిరి ఊయలలో ఉచ్వాశ నిఃశ్వాసలు
హృదయపు స్పందనలో ఆవిరయ్యే రాగద్వేషాలు
మాట రాక మూగబోయి నలభై ఎనిమిది గంటలు
This comment has been removed by the author.
Deleteమీరు చెబితే కాదనగలమా!!
Deleteవ్యధలకు కోపోధ్రేకాలకు నెలవు ఈ జీవితాలు. అందులో దేనికోసం అమ్మా వెతుకులాట.
ReplyDeleteప్రశాంతంగా పోవాలని ఆశ.
Deleteశ్వాస ఎక్కడో మలుపుతిరిగి మరలివచ్చె awesome
ReplyDeleteచావలేక బ్రతకడమండీ.
Deleteadbhutamga untayi meru rase padalu.
ReplyDeleteThank you.
Deleteమనసులో ఉన్నవారిని వెతకవలసిన పనిలేదు
ReplyDeleteవెళ్ళిపోయిన వారు వస్తారని ఆశపడకూడదు
మీ కవితలు చదువుతుంటే మాకూ కవిత్వం వస్తుంది అండీ
వాస్తవాన్ని చెప్పే ప్రతివాక్యం కవితే కదా.
Delete"ఆకాశాన్ని తాకిన ఆశలు" too much is too bad :)
ReplyDeleteఎత్తుగా ఆలోచిస్తే సగం అయినా అవుతాయి కదండీ
Deleteమనసు ఎప్పుడూ మూగగా రోధిస్తుంది మీ కవితల్లో ఎందుకని?
ReplyDeleteగట్టిగా ఏడిస్తే వినే వాళ్ళకు విసుగని:)
Deleteమౌనమే మనసు భాష
ReplyDeleteవినపడదు మది ఘోష
ఎందుకు ఈ కంట శోష
ఏదో ఆశ
Deleteబాగారాశారు.
ReplyDeleteధ్యాంక్యూ
Deletevetikindi chalu, entani vetukutaaru?
ReplyDeleteintaku evarini adugutunnaru meeru? :)
vetukkuntoo tirigi nannu neanu adugunna prasnalu.
Deleteమతి స్థిమితంలేని రాతలు.
ReplyDeleteమతిలేని వారే...మహా మేధావులు!
Deleteజీవితం ఏమిటి?
ReplyDeleteచీకటి-వెలుతురు
జీవితం చీకటి వెలుగులు కావు.. చీకటి వెలుగులు కేవలం మన కంటికి కనబడే కనబడని ఇంద్రీయ ఇంద్రజాలము మాత్రమే నాని గారు..
Deleteజీవితానికి నిర్వచనం ఇదే నని చెప్పటం అంత సులువూ కాదు.. కొద్దిగా ఆవేశం.. మరి కొద్దిగా అసహనం.. అసూయ ఈర్శ్య ద్వేషాలు పొరపాట్లు సరిదిద్దుబాట్లూ.. ఆప్యాయత అవమానాలు ఇవన్ని కూడా జీవితంలో భాగాలే..
అవును జీవితంలో మీరు చెప్పినవి కూడా భాగాలు శ్రీధర్
Deleteచీకటీ వెలుతురు అని అంత సింపుల్ గా అనుకోలేము కదండీ.
Deleteశ్వాస ఎక్కడో మలుపుతిరిగి మరలివచ్చె
ReplyDeleteతిరిగి తన గూటికే చేరె
Deleteprasninchadamlo arthamea ledu kadandi
ReplyDeleteadakunte ela telusukunTamu
Delete