చివరిమజిలీ..

పచ్చపసుపుని ఒంటికంతా రాసి నలుగు పెట్టి
పక్వానికొచ్చిన పరువాన్ని పవిటలో మెలిపెట్టి
పబ్లిక్ గా రా మావా పారిపోదామని అంటి...
అన్నదే తడువుగా అత్తాపత్తా లేకుండా పోతివి!
పిరుదుల వరకున్న వాలుజడను కొప్పు చుట్టి
పిక్కల పైదాకా చుక్కల చీరని బిగుతుగ చుట్టి
పిటిషన్ పెట్టేటోళ్ళు ఎవ్వరూ నాకు లేరంటి...
అయినా కిమ్మనకుండా ఎక్కడికో ఉడాయిస్తివి!
పుప్పొడితో పూలరెక్కలని వేరు చేస్తిని విడగొట్టి
పున్నమివెన్నెల్లో పక్కపై రమ్మన్నా కన్నుగొట్టి
ఫుల్ పల్లెటూరి బైతుననుకుని నన్ను గెంటి...
అహంకారమున్న అమీర్ ఆమెని మనువాడితివి!
పెద్ద పోటుగాడివని భంగపడితి మది బొప్పికట్టి
పెద్ద ఆసామికి అర్పించుకుంటి మానం లెక్కకట్టి
పెనాల్టీగా ఉంచుకుంటా అంటే అక్కడే ఉంటి...
అనురాగం తప్ప మస్తు పైసలు నాదగ్గర ఉన్నవి!
పొందులో పొర్లి పైసా గడించిన ఇద్దరం ఒకేమట్టి
పొగరుతగ్గి నువ్వు వడలినేను చివరికౌతాం మట్టి
పొల్యూట్ కాక ముందు ఎలాగో కలవకుంటి...
అయితే అయ్యింది ఛలో కలిసిచేద్దాం చావుమజిలీ!

21 comments:

  1. పుప్పొడితో పూలరెక్కలు విడివడ్డం ఎంతో సున్నిత భావమండీ పద్మార్పితగారు. చిత్రము చెప్పకనే భావాన్ని చేరవేస్తుంది.

    ReplyDelete
  2. తుది మలుపు మలి మజిలి నడుమన జీవితం
    ప్రేమ కొంచెం ద్వేషం కొంచెం భావోద్వేగాల సంగమం

    ReplyDelete
  3. కొల్లగొట్టారు గుండెను.

    ReplyDelete
  4. ఎక్కడికో తీసుకుని వెళ్ళి పైనుండి ఎత్తి వేసారు.
    చిత్రము చూడ ముచ్చట ఉన్నది.

    ReplyDelete
  5. అందుకే మగవారి వెంట మనం పడకూడదు వాళ్ళే మన వెంటపడాలని పెద్దలు చెప్పింది అహ హా హా

    ReplyDelete
  6. Rocking lines with lovely picture.

    ReplyDelete
  7. పెద్ద పోటుగాడే :)

    ReplyDelete
  8. మొదటి మజిలీ మొదలు కానిదే చివరి మజిలీ ఎక్కడికని అడుగుతారు?

    ReplyDelete
  9. Very nice madam

    ReplyDelete
  10. ఒకే బులెట్కు రెండు పిట్టలు
    అట్ల చనిపోదాం అంటే ఏట్లా?

    ReplyDelete
  11. శృంగారంలో అపశృతి చావు
    అది ఎలా ఒప్పుకుంటాము

    ReplyDelete
  12. బాగుంది మీ చివరి మజిలీ

    ReplyDelete
  13. నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్లు వ్రాయడంలో మీరు ధిట్టలు.

    ReplyDelete
  14. చాకచక్యంతో కూడి ఉన్నవి పదాలు

    ReplyDelete
  15. పదబంధాల పచ్చని కవితను అందించారు.

    ReplyDelete
  16. ప్రతీఒక్కరికీ పద్మార్పిత ప్రణామం _/\_

    ReplyDelete