"అర్పితాభిప్రాయం"


సమాజ అద్దంలాంటి పుస్తకం ఎంత చదివినా ఏముంది
నలుపు తెలుపు అక్షరాలు తప్ప ఏం అర్థం కాకున్నది

రాజ్యాంగ చట్టాలు చదవినాక కన్నీరొచ్చి మసగబారింది
ఎందుకని యోచిస్తే ఎంత వంచనా మోసమనిపిస్తున్నది

వాదోపవాదాలతో నిజాన్ని తడికల్లో చుట్టేసేగా నడుస్తుంది
నీదినాదంటూ సూక్తులెన్నో చెప్పుకుంటూ బ్రతుకుతున్నది

క్షణక్షణానికి రంగులు మార్చే స్త్రీపురుషులేగా ఇక్కడుంది
ముందూ వెనుక మూర్ఖపువాదం తప్ప నీతి ఎక్కడున్నది

ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎత్తుకుపైఎత్తేగా వేస్తుంది
అది నమ్మించాలనే నటన నేర్చుకుని నాటకం ఆడేస్తున్నది

వలపుసెగ వాక్యాలకు రాజ్యాంగం ఆమడ దూరంలోనే ఉంది
రాజ్యాంగం రాసినవారిలో రసికత లోపించినట్లే గోచరిస్తున్నది

మనసుకి నవ్వు ముసుగేసుకుని బ్రతకడంలో అర్థమేముంది
పడిలేచి పళ్ళికిలించక జ్ఞానంతో ప్రశ్నించి మది సాగమన్నది
నువ్వు నేను రాజ్యాంగం చదివితే చేసిన తప్పులు తెలిసింది
తెలుసుకున్న సూత్రాలు కొన్నైనా అమలు చెయ్యాలనున్నది


(విష్వక్సేనుడు వినోద్ గారు వ్రాసిన "నువ్వు నేను రాజ్యాంగం" పుస్తకం చదివిన తరువాత నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపమే ఈ "అర్పితాభిప్రాయం" చూసి చదివి చెప్పండి ఎలా ఉందో)

20 comments:

  1. అభిప్రాయాలు వ్రాయాలి అంటే పుస్తకం చదివి కదా వ్రాయాలి...
    అందుకే ఇప్పుడు నిష్క్రమిస్తున్నాను. మళ్ళీ వస్తాను...టా టా

    ReplyDelete
  2. వలపుసెగ వాక్యాలకు రాజ్యాంగం ఆమడ దూరంలోనే ఉంది
    రాజ్యాంగం రాసినవారిలో రసికత లోపించినట్లే గోచరిస్తున్నది
    Objection vastundi kadandi E vidhmaina words

    ReplyDelete
  3. అభిప్రాయం అదిరింది

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. దేన్నైనా సరళమైన రీతిలో వ్రాస్తారు. చదవాలి అనిపించేలా వ్రాయటం మీ సొత్తు.

    ReplyDelete
  6. అభినందనలు మీ అందరికీ

    ReplyDelete
  7. Beautiful views and Picture.

    ReplyDelete
  8. PAINTING BAGUNDI
    BOOK GURINCHI KAVITALO CHEPPINDI KOODA BAGUNDI.

    ReplyDelete
  9. Good book and worth to read andi.

    ReplyDelete
  10. చెప్పే విధానం చాలా బాగుంటుంది.
    Carry on you skills

    ReplyDelete
  11. క్షణక్షణానికి రంగులు మార్చే స్త్రీపురుషులేగా ఇక్కడుంది, ముందూ వెనుక మూర్ఖపువాదం తప్ప నీతి ఎక్కడున్నది...వాస్తవాలు వ్రాసినారు.

    ReplyDelete
  12. very artistic blog. love this

    ReplyDelete
  13. _/\_అందరికీ వందనములు_/\_

    ReplyDelete
  14. fantastic poetic description.

    ReplyDelete
  15. మంచి పనికి వచ్చే పుస్తకాన్ని పరిచయం చేసారు. కవిత బాగున్నది అండీ..

    ReplyDelete