తప్పేమిటి?

సుదీర్ఘ ప్రయాణంలో మార్గం మరచిపోయి
దారిచూపమన ఆగిపొమ్మనడంలో అర్థమేంటి!
శీతల తరంగం ముద్దముద్దగా తడిసిపోయి
చలివేయ కాస్త సూర్యరశ్మిని కోరితే తప్పేమిటి?
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు అతిభారంగా ఉన్నాయి
లోపల ఎంత వేడి ఉన్నా ప్రయోజనమేమిటి!
నీలాకాశం కంటినిండుగా తిరుగాడుతున్నాయి
నిశ్చలంగా నీటిని నిలబడిపొమ్మంటే తప్పేమిటి?
హోరుగాలులు ఏమో శాపనార్థాలై వీస్తున్నాయి
అంధకారంలో అలంకరణతో ఉపయోగమేంటి!
నిర్మానుష్య రహదారిపై చల్లని అలలాసాగిపోయి
సిగ్గునీడలో తలదాచుకుంటే మాత్రం తప్పేమిటి?
పొగమంచై పర్వతాల్లో సూర్యుడు దాగిపోయి
ఉప్పకన్నీటితో మండే గాయాలకు మందేమిటి!
గాలిలో తేలుతున్న ఆశపొగలు మసగపరిచాయి
మేఘాలను కుండపోతై కురవమంటే తప్పేమిటి?

19 comments:

 1. అదిరిపోయే ప్రశ్నలకు
  జవాబులు ఎక్కడ?

  ReplyDelete
 2. ప్రకృతి సోయగాలలో ప్రేమావేదన తడిసింది కామోసు. చిత్రం అదుర్స్

  ReplyDelete
 3. మీరు చేసేది తప్పుకాదు
  కానేరదు అది అంతే...

  ReplyDelete
 4. గాలీ నీరు మంచు శీతలం అన్నీ మీ సొంతం :)

  ReplyDelete
 5. భావగర్భితం
  ప్రతీ పదం
  ప్రతి కవితా ప్రశంసనీయం
  సర్వం పద్మార్పితం...

  ReplyDelete
 6. శీతల తరంగం ముద్దముద్దగా తడిసి...అందమైన భావాలు మీ సొంతం.

  ReplyDelete
 7. ఎక్సెలెంట్ పోస్ట్.

  ReplyDelete
 8. మీరు ఏది వ్రాసినా ఆలోచించి వ్రాస్తారు...అందుకే అది తప్పు కాదు. చిత్రము చాలా బాగున్నది.

  ReplyDelete
 9. కటిక చీకటిలో చెదరని అడుగులకు మడుగులై సాగే పయనానికి
  చింత చెంతకు చేరకుండ చలించని చంచలమైన మనసు కెరటాల
  సవ్వడి మాటున కానరావా మైల్ స్టోన్ లు దారి పొడవున

  స్వేదానికి నిర్వేదంగా నర్మగర్భంగా నిటూర్చేకంటే చిరు చినుకుల మాలిక పలకరించే కదా పుడమిన వసంతాగమనానికి పునాది
  వరద హోరులో మనసే ఉప్పోంగే ఉప్పెన తరంగాల తటస్థాలతో

  ~శ్రీత ధరణి

  ReplyDelete
  Replies
  1. కోవిడ్ కాలమందు మాస్క్ శానిటైజర్ మూలాన ఊపిరి సలపకున్నా
   ఆశ అనే ఆయువు కి ప్రాణాన్ని పోస్తూ జనం నలుదిక్కుల తాపత్రయం
   వెలుగు నీడల సమాహారం ఏదైనా కనుక తీరు తెన్ను మారేనా
   నిశిధి అలుముకున్న వేళ ఏమో ఆ వైపున ఏదో అంతరంగ తరంగాల వెలుగు విరాజిల్లేను కాదా

   వినీలాకాశం నీలవర్ణం చిట్‌పట్ సినుక్ సవ్వోడి మాదిర్
   ఒక్కో సినుక్ భువి పై సిందాడగా కుచించుకున్న పుడిమే ఓలలాడగ
   ఆకాశం అంచుల దాక ఇనబడే బాక చివురుటాకు తడసి మోపేడ్ అవగా కార్బన్ ఫుట్‌ప్రింట్ బేజారవగ

   రాధ కమల వాణి మనోజ్ఞ అనూహ్యంగ ఎదురు చూసినా
   కాల గర్భాన జ్ఞాపకాల తెరలు పొరలై జలతారులై తా అతా
   కునుకు చేరని అలసి సొలసిన కనులకు ఎబెట్టుగా గోచరించిన ఫలితమే మున్నది తెరచాప నావకే దిక్సూచి మాదిరి

   ~యస్ఆర్ఐడీహెచ్ఏఆర్

   Delete
 10. అంధకారంలో అలంకరణతో ఉపయోగమేంటి!

  ReplyDelete
  Replies
  1. అలా అని అలంకరణ మానుకుంటా రేటి అమ్ములు రుగా. పవర్ కట్ ఐనంత మాత్రానికే పవర్ రీస్టోర్ కాదని ఉన్నదా హేవిటి.. పవర్ ఫ్లక్చువేషన్ ఉన్నంత మాత్రానికే ఢీలా పడిపోతారా.. ఉహూ.. పగల్ ఉండనే ఉంటది. మోరల్ యాండ్ ఎథిక్.. (ఆల్ ఇజ్ వెల్ ఇఫ్ ది బిగినింగ్ ఇజ్ గుడ్)

   Delete

 11. _/\_ అక్షరాభిమానులకు
  అర్పిత అభివందనం_/\_

  ReplyDelete