దానికొక అర్థమూ పరమార్థం ప్రణాలికంటూ కూడా లేదు
ఏదో జరగాల్సింది ఇంకేదో జరిగిపోయింది అంతే సుమా..
నిన్ను చూడక ముందు జీవితానికొక అర్థమంటూ ఏంలేదు
అప్పటిదాకా బ్రతుక్కి ఒకగమ్యం నిశ్చింతస్థానం దొరకలేదు
అంతకు మించిన ఆలోచనలు నామెదడుకి లేవు సుమా..
నీ వ్యక్తిత్వసునిశితపరిశీలనా గుణానికి లొంగానంతే ఏంలేదు
అందరి మనసులనీ చదివే నీకు నామది కష్టం అనుకోలేదు
అనుకోకుండా మనసుతో చూసి మాట కలిపాను సుమా..
నిన్ను చుట్టిముట్టి ఉన్న భవబంధాల్లో నేనుండాలని ఏంలేదు
నిడారంబరనియమనిబంధనలున్న బంధమన మదిఒప్పుకోదు
ఉరుకులపరుగుల జీవనవ్యాపకంలో మరచిమారిపోకు సుమా..
నీ సహచరసావాససాంగత్యాన్ని తప్ప నేను కోరింది ఏంలేదు
మనసున మెండుగా ఉంది బయటపడని గుర్తింపు అక్కర్లేదు
ఏదేమైనా నాకంటూ ప్రత్యేక సమయాన్ని సృష్టించాలి సుమా..
చాన్నాళ్ళకు మీ కలం ప్రేమ పదాలు క్రొత్తగా వ్రాసింది.
ReplyDeleteBeautiful narration.
ReplyDeleteప్రత్యేక సమయాన్ని సృష్టించాలి
ReplyDeleteHow it is possible????
Lovely picture
ReplyDeleteInnocent lines with deep meaning.
మీ బ్లొగ్ ఆకర్షించడానికి మీ అక్షరాలు చాలు
ReplyDelete"సహచరసావాససాంగత్య" three words converted into one word nice mam.
ReplyDeletepainting bagundi
ReplyDeleteఒకటికి రెండుమార్లు చదవాలి
ReplyDeleteనిడారంబరనియమనిబంధనలు సూపర్
ReplyDeleteఏదో అలా జరిగిపోయింది అంటున్నారు
ReplyDeleteమరల ఏమీ జరగలేదు అంటున్నారు
ఇలా అయితే ఎలా చెప్పండి హా హా ఆహా
వ్యక్తిత్వసునిశితపరిశీలనాగుణం వామ్మో ఆశ్చర్యం అద్భుతం.
ReplyDeleteNamaste andi
ReplyDeleteHow are you?
సరికొత్త పదాల అల్లికతో ప్రేమను పలికించారు. అభినందనలు.
ReplyDeleteఏవిటి పద్మార్పితగారు....పదాలను సమూహంగా కలిపి కొట్టారు.
ReplyDeleteఅందరూ జంటలు కూడి ముచ్చటించుకోవాలని లేదు ఏవరికి వారే మనసుతో ముచ్చటించుకోవచ్చును కదా, ఇలా కలిసికట్టుతో అంటే కుదిరేపని కాదు ఈ రోజుల్లో.
ReplyDeleteమరచిమారిపోకు సుమా..
ReplyDelete_/\_అందరికీ పద్మార్పిత వందనములు_/\_
ReplyDeleteLovely one
ReplyDeleteహృద్యం రమ్యం కమనీయం
ReplyDelete