ప్రత్యేకస్థానం..


నీవైపు అకర్షించబడ్డానికి ప్రత్యేక కారణమంటూ ఏంలేదు
దానికొక అర్థమూ పరమార్థం ప్రణాలికంటూ కూడా లేదు
ఏదో జరగాల్సింది ఇంకేదో జరిగిపోయింది అంతే సుమా..
నిన్ను చూడక ముందు జీవితానికొక అర్థమంటూ ఏంలేదు
అప్పటిదాకా బ్రతుక్కి ఒకగమ్యం నిశ్చింతస్థానం దొరకలేదు
అంతకు మించిన ఆలోచనలు నామెదడుకి లేవు సుమా..
నీ వ్యక్తిత్వసునిశితపరిశీలనా గుణానికి లొంగానంతే ఏంలేదు
అందరి మనసులనీ చదివే నీకు నామది కష్టం అనుకోలేదు
అనుకోకుండా మనసుతో చూసి మాట కలిపాను సుమా..
నిన్ను చుట్టిముట్టి ఉన్న భవబంధాల్లో నేనుండాలని ఏంలేదు
నిడారంబరనియమనిబంధనలున్న బంధమన మదిఒప్పుకోదు
ఉరుకులపరుగుల జీవనవ్యాపకంలో మరచిమారిపోకు సుమా..
నీ సహచరసావాససాంగత్యాన్ని తప్ప నేను కోరింది ఏంలేదు
మనసున మెండుగా ఉంది బయటపడని గుర్తింపు అక్కర్లేదు
ఏదేమైనా నాకంటూ ప్రత్యేక సమయాన్ని సృష్టించాలి సుమా..

19 comments:

  1. చాన్నాళ్ళకు మీ కలం ప్రేమ పదాలు క్రొత్తగా వ్రాసింది.

    ReplyDelete
  2. ప్రత్యేక సమయాన్ని సృష్టించాలి
    How it is possible????

    ReplyDelete
  3. Lovely picture
    Innocent lines with deep meaning.

    ReplyDelete
  4. మీ బ్లొగ్ ఆకర్షించడానికి మీ అక్షరాలు చాలు

    ReplyDelete
  5. "సహచరసావాససాంగత్య" three words converted into one word nice mam.

    ReplyDelete
  6. ఒకటికి రెండుమార్లు చదవాలి

    ReplyDelete
  7. నిడారంబరనియమనిబంధనలు సూపర్

    ReplyDelete
  8. ఏదో అలా జరిగిపోయింది అంటున్నారు
    మరల ఏమీ జరగలేదు అంటున్నారు
    ఇలా అయితే ఎలా చెప్పండి హా హా ఆహా

    ReplyDelete
  9. వ్యక్తిత్వసునిశితపరిశీలనాగుణం వామ్మో ఆశ్చర్యం అద్భుతం.

    ReplyDelete
  10. Namaste andi
    How are you?

    ReplyDelete
  11. సరికొత్త పదాల అల్లికతో ప్రేమను పలికించారు. అభినందనలు.

    ReplyDelete
  12. ఏవిటి పద్మార్పితగారు....పదాలను సమూహంగా కలిపి కొట్టారు.

    ReplyDelete
  13. అందరూ జంటలు కూడి ముచ్చటించుకోవాలని లేదు ఏవరికి వారే మనసుతో ముచ్చటించుకోవచ్చును కదా, ఇలా కలిసికట్టుతో అంటే కుదిరేపని కాదు ఈ రోజుల్లో.

    ReplyDelete
  14. మరచిమారిపోకు సుమా..

    ReplyDelete
  15. _/\_అందరికీ పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete
  16. హృద్యం రమ్యం కమనీయం

    ReplyDelete