నా సలాం..

నన్ను అసహ్యించుకునే వారికి నా సలాం..
దృఢత్వాన్ని నానిండా నింపిన వారు కదా!!

నాకోసం ఆందోళన పడేవారందరికీ సలాం..
నిజానికి నా బాగోగులపై శ్రద్ధ వారిదే కదా!!

నాతోనే ఉంటానని వదిలిన వారికీ సలాం..
ఎప్పటికెవ్వరూ నాతో ఉండరని తెలిపె కదా!!

నన్ను ప్రేమిస్తున్న వారందరికీ నా సలాం..
హృదయాన్ని విశాలంగా చేసిన వారు కదా!!

నాకు పరిచయమైనవారు అందరికీ సలాం..
బ్రతుకు ఊహించని మలుపు తిరిగె కదా!!

నా జీవితానికి ప్రత్యేకమైన అతిపెద్ద సలాం..
దేన్నైనా తట్టుకునే శక్తినిచ్చి నడిపిస్తుంది కదా!!

24 comments:

  1. ఈ విధంగా అందరికీ సలాం అని చెప్పి కట్టిపడేస్తే ఏం చేయగలం. అహ హా హా

    ReplyDelete
  2. దృఢత్వాన్ని నిండా నింపే వారు ఎక్కడ దొరుకుతారు> చాలా బాగా రాసారు..

    ReplyDelete
  3. మీకు మా పెద్ద సలాం
    మంచి కవితలు చిత్రాలు అందిస్తున్నారు

    ReplyDelete
  4. మనసు దోచే మీ వాక్యాలకు నా సలాం

    ReplyDelete
  5. చివరి రెండు లైన్స్ కు ఎప్పటికీ ఋణపడే ఉండాలి. కేవలం పెద్ద సలాం తో సరిపెడితే ఎలాగండీ.

    ReplyDelete
  6. లైఫే ఓ ఊహించని మజిలి
    అమ్మ నాన్నలకు సలాం

    ధైర్యం ఓర్పు కలగలసిన వారధి
    లైఫ్ కు సలాం

    ReplyDelete
  7. నాకు పరిచయమైనవారు అందరికీ సలాం..

    ReplyDelete
  8. Deepavali Wishes to you

    ReplyDelete
  9. అద్భుతంగా చెప్పారు తల్లీ.

    ReplyDelete
  10. Excellent writeup
    Salute to you mam

    ReplyDelete
  11. జీవితానికి ప్రత్యేక సలాం.

    ReplyDelete
  12. నమస్కారములు పద్మార్పితగారు

    ReplyDelete
  13. నా సలాంలు స్వీకరించి స్పందించిన అందరికీ నా సలాం _/\_

    ReplyDelete
  14. మంచిగా సెలవిచ్చారు...సలాం

    ReplyDelete
  15. సలాం అని చెప్పి మనసైన వాళ్ళను ఫ్రూట్ సలాడ్ లా తినరు కదా

    ReplyDelete