తప్పొపుల తులాభారం

నా ఓటములన్నీ కలిసి కొవ్వొత్తిగా కాలి నీ గెలుపై వెలిగితే
ఆ వెలుగులో నా బ్రతుకునిచూస్తూ గతించాలి అనుకున్నా!
జీవితంలోకి ఇంద్రధనస్సులా వచ్చి వెళ్ళిపోతావని తెలిసుంటే
కామకోరికలకే ప్రాధాన్యతనిచ్చి మనసునులిమి కప్పెట్టేదాన్ని!
ఎవరు ఎవర్ని చూసి ఎందుకు మోహించారోకదాని తెలిసిపోతే
వాటినే పలుమార్లు ప్రకటించి దూరమవ్వడానికి దారి ఇస్తున్నా!
నటించే బంధానికున్న బలం నిర్మలమైన ప్రేమకు లేదనంటే
అంతర్గత ఆలోచనల్ని ఇంత నగ్నంగా చెప్పుకోక పోయేదాన్ని!
వెదజల్లేటి సువాసనలు క్షీణించనంత వరకే కౌగిళ్ళని చెబితే
మూలుగుతున్న వాంఛలపై వస్త్రంవేసి కర్మకాండ చేసేదాన్ని!
చల్లని మేనుతో ఎడబాటు ఎదని వెచ్చని కన్నీరు తడిపేస్తుంటే
విశాలహృదయాన్ని వేశ్యనై ముక్కలు చేసి పంచిపెడుతున్నా!
పొరపాట్లు తప్పొప్పుల మధ్య తేడాలను చర్చించుకుంటూపోతే
జీవితకాలం సరిపోదని తెలుసుకుని మెల్లగా తప్పుకుంటున్నా!

21 comments:

  1. తప్పొప్పులను ఎంచుకుంటూ బాధ పడటమే తప్ప ఏమిలాభం అన్ని మరచి సర్దుకుని పోతుంటేనే జీవితము కదా!

    ReplyDelete
  2. Nirasha nispruhalato jivitam soonyam

    ReplyDelete
  3. ప్రతి పదం లోని భావన అసత్యంగా (fake) అనిపించింది. ప్చ్.. నచ్చలేదని నిక్కచ్చిగా చెప్పగలను.

    ReplyDelete
  4. వ్యధాభరిత భావాలకు ఫులుస్టాప్ ఎప్పుడు?

    ReplyDelete
  5. లై ఫీజేబ్యా లెన్స్ బి ట్విన్ ఇమోషన్స్, సర్కం స్టాంసెస్, మోరల్ రెస్పాంసిబిలిటిస్, క్రెడిబిలిటి యాండ్ అకౌంటెబిలిటి. ఈవెన్ ఒన్ వేరియేబల్ చేంజెస్ స్లైట్లి, దేర్ విల్ బీ ఏ హెవి ఇంపాక్ట్. //ఓవర్ ఆండ్ ఔట్\\

    ReplyDelete
    Replies
    1. విరించిగా వినిపించావు నీ గానం.. 1983-2021 ముప్పై ఎనిమిదేళ్ళ సిని సాహిత్య ప్రస్థానం.. కవినై కవితనై.. మల్లెల దారిలో నడయాడుతు చెరుకుగడల అనకాపల్లి నుండి తీపి సినిగేయాలు రచించి మంచు ఎడారిలో మౌనముద్ర దాల్చిన చెంబోలు సీతరామశాస్త్రి గారికి అశ్రుతప్త ఘన నివాళి.

      Delete
  6. భౌతికంతో మానసిక కళ్లెమా...

    ReplyDelete
  7. enduku intha deep think life gurinchi.

    ReplyDelete
  8. నాగచైతన్య దుఃఖాన్ని సమంత వైపునుంచి చూసి రాసినట్టు ఉంది!

    ReplyDelete
  9. తప్పులు అందరూ చేస్తారు, వాటిని తెలుసుకుని సరిచేసుకోవాలి. అంతే కానీ తిరిగి మరల అవే తప్పులు చేయరాదు.

    ReplyDelete
  10. అంతర్గతాన్ని ఎవరికి చెప్పుకున్నా అలుసే కదండి.

    ReplyDelete
  11. wow...
    Happy Birth Day Madam!!
    4th Dec is a memorable day for all of us!!
    god Bless you... Keep writing!!!!

    ReplyDelete
  12. చల్లని మేనుతో ఎడబాటు ఎదని వెచ్చని కన్నీరు తడిపేస్తుంటే
    విశాలహృదయాన్ని వేశ్యనై ముక్కలు చేసి పంచిపెడుతున్నా!Hats off andi

    ReplyDelete
  13. అందరికీ నా వందనములు _/\_

    ReplyDelete