సమయానుసారం వయస్సు పెరిగిపోతుంది
కోల్పోయిన కలలలో కట్టివేయబడి నక్కినా
కొంత తెలిసినట్లు మరికొంత తెలియనట్లుగా
శరీరం దూరంవెళ్ళినా ముఖం గుర్తుంటుంది!
ప్రేమని కాంక్షించి ఎన్నో జరగాలని ఊహించి
గుమ్మనంగా కోర్కెలెన్నో కప్పెట్టి కొన్ని తీరినా
కాలం మారి పయనించు నదీ ప్రవాహంలాగా
శరీరం కృంగికృశించినా ముఖం గుర్తుంటుంది!
సంపద మంటల్లో మోము కాలి బూడిదౌతుంది
అమాయకులూ మూర్ఖులూ అమ్ముడుపోయినా
కొనుగోలుదారులు దగాతో నీచానికి దిగజారగా
శరీరం మండి మాడినా ముఖం గుర్తుంటుంది!
బాల్యం యవ్వనం వృద్ధాప్యం తనలోతానే వణికి
అద్దం తననితానే పాతముఖం చూపమనడిగినా
నీరుకారిపోయే నిస్సహాయత సిగ్గుతో తలవంచగా
శరీరము మునిగితేలినా ఆ ముఖం గుర్తుంటుంది!
మనుషులంతా ఒక్కటైనా ముఖాల్లో తేడాఉంది
విభిన్న ముఖకవళికలతో ఎవరెలా మార్పుచెందినా
సిగ్గులేని ముఖాలు జ్ఞాపకాల్లో జీవిస్తాయి నిర్లజ్జగా
శరీరం శవమై కాలిపోయినా ముఖం గుర్తుంటుంది!
Samayanusaram sagipoka tappadu payanam
ReplyDeleteNice Picture
భావజాలం వెల్లివిరిసింది పద్మార్పితా
ReplyDeleteఅద్భుతంగా వ్రాసారు.
ReplyDeleteముఖంతో పాటు మీరు వ్రాసే కవిత్వం గుర్తుండిపోతుంది.
ReplyDeleteHard to digest.
ReplyDeleteBut true we remember face.
జీవితం భయంకరమైన అనుభూతితో కూడి ఉన్నట్లుగా వ్రాసారు.
ReplyDeleteFantastic Narration.
ReplyDeleteGood post
ReplyDeleteగంభీరమైన వాక్యాలతో అర్థవంతమైన చిత్రముతో అలరించావు పద్మార్పితా, బ్లెస్ యూ-హరినాధ్
ReplyDeleteExcellent Pic
ReplyDeleteబరువుతో కూడిన భావాలు మీ సొంతం
ReplyDeleteశరీరం దూరంవెళ్ళినా ముఖం గుర్తుంటుంది!
ReplyDeleteశరీరం కృంగికృశించినా ముఖం గుర్తుంటుంది!
శరీరం మండి మాడినా ముఖం గుర్తుంటుంది!
శరీరము మునిగితేలినా ఆ ముఖం గుర్తుంటుంది!
శరీరం శవమై కాలిపోయినా ముఖం గుర్తుంటుంది!
All last line are fabulous.
Nenu kavini aipoyaa :)
Elegant artistic thoughts
ReplyDeleteఈమధ్య కాలంలో వచ్చిన నేను అమితంగా మెచ్చిన కవిత ఇది
ReplyDeleteకాని ఆ ముఖానికే ముసుగేస్తే మసక బారి పోతుంది.
ReplyDeleteకాని ఆ ముఖానికే రంగులు పులిమితే తడారి పోతుంది.
కాని ఆ ముఖానికే ఈర్శ్య అసూయలు తోడైతే వంకరై పోతుంది.
~శ్రీత ధరణి
sie wissen nie den wert der liebe, bis sie für immer verschwunden ist.
Deleteమనసును మెప్పించే భావాలతో మరో రూపం దాల్చిన మీ అక్షరాలు ఎప్పుడూ గుర్తుంటాయి.
ReplyDeleteఅసంకల్పితంగానే ఆలోచనల్లో పడేస్తాయి మీ కవితాచిత్రాలు. అభినందనలు మీకు
ReplyDeleteక్లిష్టం...మీరు అర్థం కారు.
ReplyDeleteగుర్తుండిపోయే లక్షణాలు అందరిలోను ఉండవు కొందరు మాత్రమే మీరన్నట్లు గుర్తుండిపోతారు. వారు చేసింది మనకు మంచి అయినా అది చెడు అయినా కానీ. చిత్రము భావగర్భితముతో అలరించే విధముగా ఉంది.
ReplyDeleteసమయానుసారం వయస్సు పెరిగిపోతుంది కోల్పోయిన కలలలో కట్టివేయబడినా...Fantastic
ReplyDeleteసిగ్గులేని ముఖాలు జ్ఞాపకాల్లో జీవిస్తాయి...evaripai kopam antha
ReplyDeleteSo beautiful art
ReplyDeleteAngry energetic :)
ReplyDeleteAdbhutam padmagaru
ReplyDeleteoko kavita vinnotanam
విభిన్న ముఖకవళికలతో ఎవరెలా మార్పుచెందినా..no change
ReplyDeleteజీవించి ఉన్నంతకాలం గుర్తుండే మీ అందరి అభిమానానికి సదానమస్కరిస్తూ..._/\_
ReplyDeleteజీవితం చిరిగిన బొంత
ReplyDeleteమన బ్రతుకులు చిరిగిన విస్తరి
ఏమిటి ఈ రాతలు పద్మార్పిత?