కామపుచూపు..

ఎవరు ఏవిధంగా అనుకుంటే అలాగే అనిపిస్తాను
కామందృష్టి ఉన్న కళ్ళనుండి ఎన్నని కప్పెట్టను
ప్రశాంతంగా జీవించాలంటే ఏమేం మూసిదాచను!
చీరకడితే నడుంవంపు తప్ప వేరేం నీక్కనబడదు
నడిచి వెళుతుంటే రెండుపిరుదుల కదలిక ఆగదు
స్తనాలు చూపకుండా పవిట పొర ఏదీ దాచలేదు!
ఘాగ్రాపై చోలీ చూసి వెతికేవు రొమ్ముల కొలతలు
వీపును చూసినా కలుగు నీ అంగానికి కదలికలు
ఇనుపకచ్చడాలతో కట్టేసి కాపాడాలి శరీరభాగాలు!
చుడీదార్ వేస్తే చున్నీని ఎక్సరే కళ్ళతో చూస్తావు
అవయవం సౌష్టవం అంగుళమైనా వదలకున్నావు
ఎన్ని బొంతల్లో చుట్టి శరీరనిర్మాణం ఆపమంటావు!
ఎవరి పిల్లైనా తల్లైనా భార్యైనా నీక్కావలి ఆడఅంగం
పురుషాంగ వీర్యస్కలనం అయితే చాలదే మగతనం
తల నుండి కాళ్ళ వరకు కప్పితే కనబడదా కామం!
ఏ ముడతమడత అగుపడ్డా కామానికవి సంకేతాలు
నా భాగాలేవైనా నీయవ్వనాన్ని రెచ్చగొట్టేటి ప్రేరణలు
ఎక్కడ దొరికేను నీ కళ్ళగంతలు అయ్యేటి వలువలు!
ఆలోచనా విధానం మార్చి చూడు సమాజం మారును
లేదా కళ్ళూఒళ్ళూ కామఘర్షణకై కొత్తసాకు వెతుకును
కామపు చూపుల్ని తల్లిరొమ్ములు కూడా కవ్వించును!

28 comments:

  1. అద్భుతం అండీ
    మాటల్లేవు మీ అక్షరాలు
    అప్పుడూ ఇప్పుడూ ఎప్పటికీ పదునే

    ReplyDelete
  2. Wah...what a perfect narration
    Kudos to your thoughts and write ups

    ReplyDelete
  3. sreelu ela unna ettipodiche samajam gurinchi chakaga chepparu andi.

    ReplyDelete
  4. అంతా మగవారిదే తప్పు అనకండి మాడం. వస్త్రాలు విప్పి అందాలు ఆరబోసి కవ్వించే వారి సంగతి ఏమిటో మరి.

    ReplyDelete
  5. Madam nijam rasaru
    nishtooram avutaaru

    ReplyDelete
  6. ఆలోచనా విధానం మార్చి చూడు సమాజం మారును...yes

    ReplyDelete
  7. Replies
    1. కొంచం సాల్ట్ కొంత స్వీట్.. నయా ౫౦౼౫౦

      Delete
  8. Expect last line everything fine.

    ReplyDelete
  9. కామం రెచ్చగొట్టు తనం రెండూ తప్పేకదా.మగవారినే దోషులను చేయనేల?

    ReplyDelete
  10. పచ్చిగా చెప్పిన వాస్తవాలు అయినప్పటికీ ఈరోజుల్లో కామ కాంక్షను తీరుచుకోవడానికి మగవాడికి ఎన్నో దారులు ఉన్నాయి. అలాగే ఆడువారికి కూడాను. ఆడవాళ్ళు కూడా ఏమీ తీసిపోనట్లు మగవారిని రెచ్చగొట్టి డబ్బులు గుంజుతున్నారు. మన్నించాలి నేను చెప్పేవి కూడా వాస్తవాలే సుమండీ.

    ReplyDelete
  11. ఒక స్త్రీ మనసుని
    ఒక స్త్రీగా బాగావ్రాసారు.

    ReplyDelete
  12. సూపర్ పార్షాల్టీ చూపించారు. అందుకే నేను అలిగాను. ఎప్పుడూ మగవారిపైనే నిందలు.

    ReplyDelete
  13. dhoujanyam
    mammalni anatam

    ReplyDelete
  14. కఠిన వాస్తవమే అయినా అందరూ అలాగే చూడరు.

    ReplyDelete
    Replies
    1. కఠినమైన సమయాలలో చక్కనైన కాఫి: కాంటినెంటల్ ఎక్ట్రా

      Delete
  15. पद्मा जी, यह मेरी तरफ़ से पेशकर्ष:

    ना कभी देखा, ना कभी सुना
    मगर भगवान की चमत्कार वाकइ चमत्कार रहा है
    नौ छिद्र का देह हमारी मगर छः वर्ग की वासना है
    बूरा ना माने मगर जीवन देह और रूह की मिलाप है
    वास्तव में किसी की प्रेरणा किसी और की ख़्वाइश है

    ~श्रीधर भूक्या

    ReplyDelete
    Replies
    1. పద్మ గారు.. కవితలో పదాలు పరిధి దాటాయి.. కాని.. నిక్కచి నిజాలే వెల్లడించారు.. అరిషడ్వర్గాలను నియంత్రణలో పెట్టుకున్నవాడు చాలా చాలా అరుదు.. కాని మరీ ప్రతి ఒక్కరి మనస్తత్వ ధోరణి ఇదే మాదిరి ఉండదు..!

      Delete
  16. Adbhutam vrasina vidhanam.

    ReplyDelete
  17. Amaina book print chesara mee poetry madam. Very nice.

    ReplyDelete
  18. నమస్సులు అందరికీ _/\_

    ReplyDelete
  19. అయ్యయ్యో.. మళ్లీ మమ్మల్ని ఏకి పడేశారా

    ReplyDelete