చిరిగినబొంత

ఉండమన్నా ఉండక ఊడిపోయేటి ఉట్టుట్టి జీవితంలో..
ఒకరికొకరని బలవంతంగా దూర్చేరు బొత్తాన్ని కాజాలో
బొత్తాం గట్టిగా కుడితే పట్టుకుని ఉండు కాజా బొక్కలో
లేదా విడివిడిగానే ఒకటై చుట్టబడి ఉంటారు బొంతలో!

చీకిచిరిగి ముక్కలైన బొంతకు కుట్లువేసే ప్రయత్నంలో
డాన్సాడే దారం దూర్చేరు నిటారుగా నిలబడ్డ సూదిలో
నాసిరకం బట్టని తెలిసికూడా దాస్తారు పన్నెండుపొరల్లో
అదృష్టాన్ని దిండు చేసుకుని జీవితాన్ని చూడు కలలో!

కరిగేకలలలో బొంత తడవకుండా కప్పాలి టార్పాలిన్‌లో
టేపుతో పొడవైన రాత్రుల్ని కొలుస్తుండాలి అంగుళాలలో
కుడుతూ దారం తెగినప్పుడంతా ఎక్కిస్తున్నాం సూదిలో
అలసినా కూడా అగ్గగ్గలాటే అతుకుల్ని దాచే ఆరాటంలో!

బొంతైనా బనారస్ చీరైనా తేడాలేదు కుట్టే కంటిచూపులో
చేతితో కుట్టినా మిషనైనా దారం దూరవల్సిందే సూదిలో
ఎన్నిగాట్ల కుట్లువేసినా దాగవు ఇవేం జీవితపు చిరుగులో
చిన్నచిన్నగ చిరిగి బొంతతోనే చితికిపోతాయి చివరిదశలో!


23 comments:

  1. జీవితాన్ని బంధాలను బొంతతో పోల్చి చెప్పిన విధానం బాగుందమ్మా.

    ReplyDelete
  2. బొంతైనా బనారస్ చీరైనా తేడాలేదు కుట్టే కంటిచూపులో..చెప్పిన తీరు ఆలొచనాసరళి అద్భుతం. అయినా మీకు ఇటువంటి ఆలోచనలు ఎలా రేకెత్తుతాయో అసలు.

    ReplyDelete
  3. తొమ్మిది బొత్తాలు, ఐదు కుట్లు గల బొంత అందరిదీను
    ఒక్కోమారు ఒక్కో బొత్త విడిపోవచ్చు, కుట్టుకునే వెసులుబాటు ఉంటే మంచిదే.. నైకుంటే ఎంతటి నైపుణ్యం ఉన్నా పుణ్యం సున్నా.. ఒక్కోమారు టార్పాలిన్ కప్పటానికి చూసినా లేదా గోనే సంచి తౌ చుట్టినా చిరిగిన బొంత తడిసే పోతుంది ఎంత కాదనుకున్నా.. ఏదో ఒక రోజు బొత్తాలన్ని ఊడిపోయి, బొంత కుట్లు విడిపోయి, అందవిహీనంగా మారుతుందని తెలుసు, చివరాఖరున నూలు పోగులన్ని విడివడి వికారంగా తయారవుతుందనీ తెలుసు..ఐనా కాని మనసొప్పదు చిరిగిపోయే బొంతపై బోలెడంత మోజు.. అది కాస్త పాతదై పాడైపోతే ఇహ అంతే..!

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  4. హ్యాపి బర్త్‌డే పద్మ గారు. పుట్టిన రోజు శుభాభినందనలు మీకు.

    ReplyDelete
  5. bonthalo bratukulu adbhutamga rasinaru.

    ReplyDelete
  6. సూదిలో దారం
    బ్రతుకుతో బేరం అంటారా :)

    ReplyDelete
  7. ఊడిపోయేటి ఉట్టుట్టి జీవితంలో..Uncertained Life

    ReplyDelete
  8. jeevitanni botanu mudi chesaru bagundi

    ReplyDelete
  9. చిరిగిన బొంతకు కుట్లు వేసి చలకాలం ఉండలేము
    జీవితాన్ని చావు నుండి తప్పించలేము

    ReplyDelete
  10. chivaridasaloe ante the END kadandi..enduku ee bontha vedantamu:)

    ReplyDelete
  11. బాగుందండి బొంతబాగొతం.

    ReplyDelete
  12. జీవితాలు అన్నీ చిరిగిన బొంతలూ కావూ పరిచిన పట్టుపరుపులూ కావు. సూర్యచంద్రుడిలా మారుతూ ఉంటాయి.

    ReplyDelete
  13. బ్రతుకులు చిరిగిన బొంతలు కాదు
    ఆశయాలు ఉట్టుట్టి ఊహలు కాదు
    పట్టుదల ఉంటే ఏదీ వ్యర్థం కాదు
    ఒక గమ్యం ఉంటే అసాధ్యం కాదు..

    ReplyDelete
  14. తూట్లు పడిన బొంతతో సమానం చితికిన జీవితం అని చక్కగా వర్ణించారు.

    ReplyDelete
  15. టేపుతో పొడవైన రాత్రుల్ని కొలుస్తుండాలి YES

    ReplyDelete
  16. Life gurinchi inta takkuva chesi raste ela andi?

    ReplyDelete
  17. Heart touch life truths

    ReplyDelete
  18. అదృష్టాన్ని దిండు చేసుకుని జీవితాన్ని చూడు కలలో super

    ReplyDelete
  19. మీరు అర్థంగాని ప్రశ్న :)

    ReplyDelete
  20. జీవితం చిరిగిన బొంత
    మన బ్రతుకులు చిరిగిన విస్తరి
    ఏమిటి ఈ రాతలు పద్మార్పిత?

    ReplyDelete
  21. అందరికీ నమస్సులు_/\_

    ReplyDelete