జరుగుతున్నది ఏమిటో నీకు తెలియకపోయినా
కోరుకున్నదేమీ జరుగకపోవటం నీకు తెలుసుగా
ఎవరిపై కోపము విసుగు చూపాలో తెలియకున్నా
నిన్ను నువ్వు తిట్టుకోవడమైతే నీకు తెలుసుగా!
బయటవున్నవి అన్నీ నీ సొంతం కావని తెలిసినా
సాధించే ప్రయత్నంలో అలసి సొమ్మసిల్లిపోతావుగా
నిశ్చింతగా ఉంటావు నీతోనువ్వు యుద్ధం చేస్తున్నా
నువ్వు పారిపోవాలనుకున్నా ఎక్కడికీ వెళ్ళలేవుగా!
కంటున్న కలలన్నీ గాఢాంధకారంలోనేనని తెలిసినా
దిగంతాల్లో వెలుతురుకై ఆశగా ఎదురు చూస్తావుగా
ఎడారిలో ఎండమావులకై వెతికేవు దాహంతీరకున్నా
ఆరిపోయిన ఆనవాళ్ళో చేమ తడుముతున్నావుగా!
నమ్మిన నిజాలన్నీ అబద్ధాలని నీకు తెలిసిపోయినా
బయటకు నిబ్బరంగా కనబడాలని నవ్వేస్తుంటావుగా
ఓపికనంతా పిడికిట బిగించబూనావు నీలో లేకున్నా
ఇదే బలమూ భరోసా అయ్యుండవచ్చు ఖచ్చితంగా!
ఎంత కాదని మొత్తుకున్నా కాని, నగ్న సత్యమిది.
ReplyDeleteఓర్పు సహనం కలగలసిన జీవిత గమనమిది.
చుట్టు పంది మది ఉన్నా నీకు నీవే సాటి.
లేదు మనఃసాక్షి కి ఏదీ పరిపాటి.
౧౭.౧౨.౨౦౨౧ ౦౭:౧౧
ఎవరూ ఎవరికీ తోడు రారు రాలేరు మేడం అందుకే మనకు మనమే అండదండలు.
ReplyDeleteఎవరికి వారే యమున తీరే..
Deleteనికార్సైన నిజం చెప్పారు, ఈశ్వర్ గారు
కంటున్న కలలన్నీ గాఢాంధకారంలోనేనని తెలిసి
ReplyDeleteదిగంతాల్లో వెలుతురుకై ఆశగా ఎదురు చూస్తావు..well written
కలలన్ని కన్నుల కొలనులో కలువ వెన్నెలగా విరబూస్తాయి. రేతిరి వేళనే కదా చంద్రిక తరాస పడేది.. కదా శాస్త్రీ గారు
DeleteSelf respect is our energy.
ReplyDeleteSelf-respect, Dignity and Loyalty with Courtesy are Pro Qualities of Life. Arrogance, Ego and Anger are the Fallacies of Life, Dheeraj Ji
Deletepainting chala bagundi
ReplyDeleteగుండె మంటలు ఆరేది ఎప్పుడు?
ReplyDeleteకొండ పైనుండే శిల భూమికి చేరుకూనే సమయానికి, కొండ దిగువన ఉండే శిల శిఖరాన్ని అందుకూనే సమయానికి వ్యత్యాస ప్రస్ఫూటంగా అర్థమైనపుడు, గుండె మంట చల్లారి పోతుంది దానికదే మైత్రి గారు.
Deleteమనకు మనమే 'బలం భరోసా' బాగా చెప్పారు.
ReplyDeleteఎపటికైనా ఏనాటికైనా సుఖ దుఃఖాలలో ఎవరి బాధ్యత బలం బలగం అన్ని ఎవరికి వారే. సానుభూతి చూపగలరే గాని ఎదుటి వారికోసం వారి కష్ట సుఖాలను అనుభవించలేము కదా పాషా జి
DeletePainting is awesome andi
ReplyDeleteఎడారిలో ఎండమావులకై వెతికేవు
ReplyDeleteబొమ్మకు భావానికి సంబంధం లేదు
ఎడారిలో ఏ వైపున చూసినా ఎండమావులే లక్ష్మీ గారు. దాహార్తి కై మరుద్యానమును కదా వెతకాల్సింది. నిజంగా జీవితం ఎడారిలో ఎండమావే. అదిగో అనిపిస్తూనే నిరాశ కమ్ముకొస్తుంది.
DeleteExcellent Art
ReplyDeletemanam edi anukunte alage anipistundi.
ReplyDeletechitramu chala bagundi.
kaani asaluki jaragaalsindi, manam vaddanukunna kooda jarige teeruthundi. edainaa kaalaanikateetam kaane kaadu, vanaja gaaru
Deleteకోరుకున్నదేమీ జరుగకపోవటం????
ReplyDeleteకోరుకున్నవన్ని అనుకున్న తడవుగా జరిగితే మరి వ్యథ కు చోటెక్కడ ఉండగలదు. వ్యథకు చోటు లేక పోతే సంతోషానికి విలువ ఉండబోదు కదా ఆదిముల గారు.
Deleteమెండైన వ్యధతో కూడిన పదాలు
ReplyDeleteవ్యథ తోనే జీవితమంత సాగాలని లేదు. అధిగమించ వచ్చును కూడా. వ్యథ లేని మనసు లేదసలు లోకానా సాయి దృప గారు. తదా..
DeleteAlways painful poetry
ReplyDeleteIt hurts the hear.
Be cool and calm.
భరోసా అనేది ఒకరు ఇవ్వటం ఏమిటి మనకు మనమే సంపాదించుకోవాలి
ReplyDeletePic is very nice.
ReplyDeleteఎడారిలో ఎండమావులు
ReplyDeleteచేమ తడిమిలో ఆనవాళ్ళు
బ్రతుకు భరోసాను కోరటం అద్భుతం.
Beautiful painting.
ReplyDeleteజీవితం మొత్తం పరేషాన్ అయితే ఎట్లా
ReplyDeleteదిగంతాల్లో వెలుతురు adurs
ReplyDeleteOh...painful words.
ReplyDeleteGood emotional feel
ReplyDelete2021 చివరిలో అయినా పద్మార్పితగారి నుండి ఒక రసవత్తమైన పోస్ట్ ని ఆశిస్తున్నాము.
ReplyDeleteఅందరికీ నా నెనర్లు.
ReplyDeleteబలమైన ప్రేరణ వాక్యాలు
ReplyDeleteAdbhutam
ReplyDelete