నీ బాకీ

కోరిక తీర్చినందుకు తిరుగు బహుమతి బాకీ
కొంతకాలం ఆగు తప్పకుండా ముట్టచెబుతాను
వాగ్దానం చేయలేదన్న వంకతో ఇవ్వననుకోకు
నీకు బహుమతి తిరిగివ్వకుండా ఊపిరి వీడను

కోరరాని కోరికలు కోరే నేనో పంజరంలో ఏకాకీ
కాలాన్ని నీతోటి గడపాలన్న ఆశతో బ్రతికేస్తాను
ప్రేమలోముంచి ఉక్కిరిబిక్కిరి చేసాను శపించకు
నీ ఋణం తీర్చుకోకుండా నేను ఎటూ పోలేను

కోర్కెలతో తడారిన పెదాల్లో ఏముంటుంది చలాకీ
కాలంతోపాటు నేను కలిసి కధలు అల్లుకుంటాను
పనికిరాని వేదాంతం వల్లించి విసిగించా తిట్టుకోకు
నీకు పరిమళమివ్వని పువ్వులేం బహూకరించను

కోరికోరుకున్న బహుమతి నీకందుకే అంత గిరాకీ
కాలానికి ఎదురీది నా తాహతుకుమించిందే ఇస్తాను
ఉబుసిపోక ఊరించేటి ఊకదంపుడు ఊసులనుకోకు
నీకే నిన్నిచ్చి(నీవే నాప్రాణం) బాకీ తీర్చుకుంటాను

24 comments:

  1. కోరికలు కొరలుచాచి కోరే కాలాన
    జీవితానికి ఉండేదా ఋణమేదైన

    శ్వాస నిఃశ్వాసలతో తడబడు గుండె లయ
    తపన తాపత్రయం కుతుహలం ఆపై దేవుని దయ

    రెప్ప పాటు కాలం
    తెలిసి తెలియని వైనం

    మనషుల మనసుల నడుమ
    మంచికి చెడుకి వ్యత్యాస పటిమ

    రేపటి ఆశల చివురుల టూకిగా
    కోరికల ఊటలో మనసోక తూనీగా

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  2. అందమైన అక్షరాల్లో భావాన్ని తెలిపి బాకీ తీర్చేసుకున్నారు పద్మార్పితా

    ReplyDelete
  3. meru raseti postlo depth meaning untuni. great madam.

    ReplyDelete
  4. కోర్కెలతో తడారిన పెదాల్లో చలాకీ ఏముంటుంది.

    ReplyDelete
  5. కోరికోరుకున్న బహుమతి నీకందుకే అంత గిరాకీ..one line with full feel.

    ReplyDelete
  6. బాకీ తీర్చాలి అంకుంటాము కానీ ఒకసారి రుణగ్రస్తులం అయిన తరువాత చాలా కష్టం సుమా తీర్చటం.

    ReplyDelete
  7. తీర్చేయ్యండిలే

    ReplyDelete
  8. బాకీలు బరువైనవి. అవి ఎంత త్వరగా తీర్చుకుంటే అంత ప్రశాంతంతో నిదురపోవచ్చు. మీరు చెప్పేది బంధాలు బాధ్యతల బాకీలు అయితే అవి మనం కడతేరినప్పుడే తీర్చుకోగలము. చిత్రము చాలా బాగుంది.

    ReplyDelete
  9. Simply superb
    No words....

    ReplyDelete
  10. ఉబుసిపోక ఊరించేటి ఊకదంపుడు ఊసులనుకోకు..అసాధ్యం మీరు చెప్పే ఊసులు అలా అనుకెఒలేము కదా. బ్సున్నితముగా చెప్పినా ఘాటుగా ఉంటాయి.

    ReplyDelete
  11. ఇంతకూ ఎవరు ఎవరికి బాకీ???

    ReplyDelete
  12. ఎలా ఉన్నారు పద్మార్పితా?
    ఇంకా మీరు ఇలా చక్కని చిక్కని భావాలు అందిస్తూనే ఉన్నారు.
    మీకు మీ భావ కవితలకు నమస్సుమాంజలి

    ReplyDelete
  13. భావగంభీరమైన బాకీ

    ReplyDelete
  14. కాలానికి ఎదురీతడం అసాధ్యం.

    ReplyDelete
  15. నీకే నిన్నిచ్చి(నీవే నాప్రాణం)..extraordinary expression.
    Claps claps claps

    ReplyDelete
  16. Padmarpita garu me padabandhanalaku salam
    me bhavalaku na vandanam
    oko post chaduvutunna koddee meru oko konamloe kanabadutunaru.

    ReplyDelete
  17. అందరికీ వందనములు.

    ReplyDelete
  18. ఆనంద అనుభూతి.

    ReplyDelete