ఏముద్ధరించా..

వైద్యురాలినై సేవ చేయాలని తడి ఇసుకలో
చూపుడువేలుని ఆశల సిరాలో ముంచి రాసా
చదవడం కాదు చేయాల్సిన ప్రయత్నం చేసా
ఆ అదృష్టం అలలా వచ్చి కొట్టుకుపోయింది!

న్యాయవాదినై వాదించాలని మండు ఎండలో
చట్టాల గురించి చెట్టు నీడలోన చదివి అలసా
చెప్పులు అరిగేలా తిరిగి గట్టి ప్రయత్నం చేసా
ఆ ఆశ కూడా ఎండకు ఆవిరై చెమటకార్చింది! 

ఇంజనీరునై ఏ రంగాన్నైనా గెలవాలని వర్షంలో
చదివి తడిసి చిరిగిన పుస్తకాల్ని విసిరి పడేసా
పగబట్టిన పేజీల్ని బ్రతిమిలాడే ప్రయత్నం చేసా
ఆ జ్ఞానం అక్కరకురాని ఇంద్రధనస్సై పోయింది!

పైలట్ నై విమానం నడిపి ఎగరాలి ఆకాశంలో
ఆలోచన వచ్చిందే తడవుగా ధరకాస్తు చేసేసా
ఒడ్డూ పొడవు తెలివితో చివరి ప్రయత్నం చేసా
ఆ పనికీ పైసలకే ఫైలెట్ పాఠాలని తెలిసింది!

ఆఫీసర్ అయితే ఒకప్రత్యేక గుర్తింపు అందరిలో
అలాగని అహర్నిశా పుస్తకం చేతపట్టి చదివేసా
చదివింది చాలని పెళ్ళిచేస్తే అత్తారింట అడుగేసా
ఇంకేంటి కలలు కరిగినా జీవితమైతే సాగుతుంది!

27 comments:

  1. What you achieved is more than enough.

    ReplyDelete
  2. వైద్యం వైవిద్యభరితం నాడు
    ఒక వైరస్ ధాటికి కుదేలు నేడు
    ఐనా కొన ఊపిరితో పోరు నెంచి
    మూడు శాతం మందికైనా చేస్తోంది మంచి

    ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసిజర్ కోడ్
    న్యాయం దిశగా చట్టపరమైన చర్యకు లా సూట్
    ఎదిరించి ధీటుగా పూర్వపరాల పర్యవేక్షణలో సాగుతు
    నేరాన్ని కూకటివేళ్ళతో పెకిలించే సాహసోపేత కర్మకు ఊతమిస్తు

    ముడి సరుకును మానవాళికి ఉపయుక్తమైన సాధనగా మలిచి
    డిస్క్రీట్ కాంపోనెంట్స్ ను ఒకదానికి మరొకటి సంధానమిచ్చి
    ప్రౌద్యోగికరణను అభియాంత్రికతతో సాంకేతిక నైపుణ్యానికి ముడివేస్తు
    నిత్యం పరిశోధన కే పెద్దపీట వేస్తు దేశ ప్రగతికై కాంక్షిస్తు

    కాక్‌పిట్ కంట్రోల్ ప్యానెల్ లో హెడింగ్ సెట్ చేసి
    చెక్‌లిస్ట్ సాంతం ఓపికగా స్కిమ్ చేసి
    యోక్ రడ్డర్ పెడల్ సైడ్ స్టిక్ యాక్టివేట్ చేసి
    వీవన్ రొటేట్ స్పీడ్ అచీవవుతూనే ఏటిసి కమాండ్ లతో టేకాఫ్

    ReplyDelete
  3. హయ్యారే ఇంకా ఏమి సాధించాలని??????

    ReplyDelete
  4. అన్నింటినీ మించిన పోస్ట్లో ఉన్నారు
    పెళ్ళాం అంటనే పెద్ద పవర్ఫుల్ కదా

    ReplyDelete
  5. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్లు ఉన్నారు పద్మగారు.

    ReplyDelete
  6. వృత్తి ఏది ఎంచుకున్నా దానికి న్యాయం చేయాలి. మీరు చేస్తున్న వృత్తి ఎంతో గొప్పది. ఇంకా ఈ నిరాశా వేదాంతం ఎందుకు మీలో?

    ReplyDelete
  7. intakoo meeru chadivindi eamiti?

    ReplyDelete
  8. కోరికలు అంటేనే ఎప్పుడూ తీరనివి కదా?

    ReplyDelete
  9. Annee okkaru ela chestaru
    anduke GOD decide chesinaru ila

    ReplyDelete
  10. వందనములు మాతా మీకు.

    ReplyDelete
  11. job leni valu chala mandi unnaru. pelli chesukuni intlo bandhinchabadina vari mata emiti madam?

    ReplyDelete
  12. డాక్టర్
    పైలెట్
    ఇంజనీర్
    లాయర్
    సినిమాల్లో చేరితే అన్ని వేషాలూ వెయ్యచ్చు.

    ReplyDelete
  13. ఏడవలేక నవ్వుతున్నట్లు ఉంది> :) :(

    ReplyDelete
  14. మనుసు వ్యధనా ఏమీ కాలేదని?
    లేక కవిత కోసం అల్లిన కధనమా?

    ReplyDelete
  15. meru ala anukunte memu magallamu yemi anukuni uddharinchali madam. all you know still no satisfaction.

    ReplyDelete
  16. Please Don't Confuse Me :)

    ReplyDelete
  17. antarleenam avedana kanabadutundi. bagundi andi

    ReplyDelete
  18. అందరిలోను ఏదోక ప్రత్యేకత ఉంటుంది.
    నిరాశతో జీవించకండీ...ఇంకా ఢీలా పడతారు

    ReplyDelete
  19. వేదన అహంకారము సమపాళ్ళలో రంగరించారు.

    ReplyDelete
  20. అవ్వాలి చెయ్యాలి అనుకున్న అన్నీ చేసివేయ గలిగితె ఇంక దేవుడు ఎందుకు మన మొక్కుకో వలసిన పని ఉండదు అందుకే ఇలా చేస్తారు అనిపిస్తుంది నాకు.

    ReplyDelete
  21. Serious topic
    Not possible to decide

    ReplyDelete
  22. అదృష్టం అలలా వచ్చి కొట్టుకుపోయింది-True

    ReplyDelete
  23. అన్నీ మన చేతుల్లో ఉన్నాయ్ అనుకోవటం మన భ్రమ
    ఏదైనా చెయ్యలి అనుకుని ప్రయత్నించడమే మన వంతు
    ఆపై అంతా పైవాని దయ.చేయవలసింది చేసి చూస్తూ ఉండటమే

    ReplyDelete
    Replies
    1. హాఖాషవాని హయట్ణఘఱ్ ఖేంఢ్రం.. ణిళయంలో షమయం ఱెందు ఘంఠళ ఫఢి ణీంసాల్.. ఖాఠ్ఫాఢీ నూణ్‌ఢి ఱీళె ప్రషాఱమింథట్తో సమాఫ్టం.. టిఱ్ఘీ ఉడ్యం ఫ్రఛాఱంళో మిడియం వేవ్ ఎంప్లిటుడ్ మాడిలోషిన్ పై పునః ప్రారంభం.. అంథ వరక్ సేలవ్.. నమసుప్పు

      Delete
  24. మానవ ప్రయత్నం నిరర్ధకం.

    ReplyDelete
  25. అలా ప్రశ్నించుకుంటే ఎవ్వరూ ఏమీ ఉద్దరించి ఉండరు.

    ReplyDelete
  26. _/\_పద్మార్పిత పదవందనములు _/\_

    ReplyDelete